Tissue Paper : మన నిత్య జీవితంలో టిష్యూ పేపర్ వాడకం సర్వసాధారణం. కానీ దాని ఉత్పత్తి, ఉపయోగం ఖచ్చితంగా పర్యావరణంపై ప్రభావం చూపుతుంది. అన్ని ప్రదేశాల్లాగే మనం తినే ప్రదేశం కూడా చాలా నీట్‌గా ఉండాలని కోరుకుంటాం. కానీ మన డైనింగ్ టేబుల్ చాలా నీట్ గా ఉండాలంటే టిష్యూ హోల్డర్స్ ఉపయోగిస్తే చాలా బాగుంటుంది. ఇలాంటివి మన డైనింగ్ టేబుల్స్‌పైనే కాకుండా మన ఆఫీసులో కూడా పెడితే చాలా బాగుంటుంది. ఈ మధ్య కాలంలో ఇలాంటివి కూడా కారులో ఎక్కువగా వాడటం మనం చూస్తున్నాం. అయితే, ఇది అనేక రంగులు, అనేక డిజైన్లలో అందుబాటులో ఉంటున్నాయి. ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉపయోగించే వస్తువులలో టిష్యూ పేపర్లు కూడా ఒకటి అని మనం చెప్పుకోవచ్చు. ఇది తిన్న తర్వాత చేతులు తుడుచుకోవడానికి చాలా సహాయపడుతుంటాయి. మనకు చాలా ఉపయోగకరంగా ఉంటున్నాయి.
టిష్యూ పేపర్ మన జీవితంలో ఒక ముఖ్యమైన భాగంగా మారింది. అయితే ఈ టిష్యూ పేపర్లు ఎక్కడి నుండి వచ్చాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఒక చెట్టు నుండి ఎంత టిష్యూ పేపర్ తయారు చేయవచ్చని ఆలోచించారా. నేడు ప్రతిచోటా టిష్యూ పేపర్ వాడుతున్నారు. మీకు ప్రతి ఆఫీసులో లేదా ఇంట్లో టిష్యూ పేపర్ దొరుకుతుంది. కానీ చెట్టును నరకడం ద్వారా ఎంత టిష్యూ పేపర్ ఉత్పత్తి అవుతుందో తెలుసా? ఈ కథనంలో ఆ విషయాలను తెలుసుకుందాం.
ఒక అంచనా ప్రకారం, ఒక చెట్టు నుండి దాదాపు 17 రీమ్‌లు (ఒక రీమ్‌లో 500 షీట్‌లు) తయారు చేయవచ్చు. ఒక రీమ్ పేపర్ నుండి దాదాపు 10,000 టిష్యూ పేపర్లను తయారు చేయవచ్చు. దీని ప్రకారం, ఒక చెట్టు నుండి దాదాపు 1,70,000 టిష్యూ పేపర్లను తయారు చేయవచ్చు. టిష్యూ పేపర్ ఉత్పత్తి పర్యావరణానికి పెద్ద సవాలు. దాని ఉత్పత్తిలో పెద్ద మొత్తంలో చెట్లు నరికివేయబడతాయి. ఇది అడవులను నాశనం చేస్తుంది. జీవవైవిధ్యాన్ని కోల్పోతుంది. అంతేకాకుండా, టిష్యూ పేపర్‌ను తయారు చేయడం వల్ల చాలా నీరు ఖర్చవుతుంది. వివిధ రకాల రసాయనాలను ఉపయోగిస్తుంటారు. ఇది నీరు, మట్టిని కలుషితం చేస్తుంది. మనమందరం టిష్యూ పేపర్‌ని ఉపయోగిస్తాము, కానీ మనం దానిని బాధ్యతాయుతంగా ఉపయోగించాలి. టిష్యూ పేపర్ వాడకాన్ని మనం తగ్గించుకోవాటి. అత్యవసరమైనప్పుడు మాత్రమే ఈ టిష్యూ పేపర్‌ని ఉపయోగించాలి. అలాగే టిష్యూ పేపర్‌ను వీలైనంత వరకు రీసైకిల్ చేయండి. ఇది కాకుండా, క్లాత్ హ్యాండ్‌కర్చీఫ్ లేదా వెదురు టిష్యూ పేపర్ వంటి బయోడిగ్రేడబుల్ ఎంపికలను ఉపయోగించాలి.