https://oktelugu.com/

TTD: టీటీడీ సంచలన నిర్ణయం.. ఇక వారికి తిరుమలలో నో ఛాన్స్?

టీటీడీలో చాలా రకాల అంశాలు వివాదాస్పదం అయ్యాయి. ఇటీవల లడ్డు వ్యవహారం బయటకు వచ్చింది. మరోవైపు ఉద్యోగుల్లో అన్య మతస్తులు ఉన్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ తరుణంలో టీటీడీ కీలక నిర్ణయాల దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈనెల 18న జరగనున్న టీటీడీ ట్రస్ట్ బోర్డు సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది.

Written By: Dharma, Updated On : November 16, 2024 10:33 am
TTD

TTD

Follow us on

TTD: తిరుమల తిరుపతి ట్రస్ట్ బోర్డు కీలక నిర్ణయాల దిశ గా అడుగులు వేస్తోంది. టీటీడీ చైర్మన్ గా బొల్లినేని రాజగోపాల్ నాయుడు బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈనెల 18న తొలి సమావేశం జరగనుంది. ఇందులో కీలక నిర్ణయాలు ఉంటాయని సమాచారం. అయితే ఇప్పటికే టీటీడీ చైర్మన్ కీలక ప్రకటన చేశారు. టీటీడీలో హిందువులు మాత్రమే ఉండాలని ఈ ప్రకటన సారాంశం. టీటీడీలో అన్యమతస్తుల అనే అంశం చాలా కాలంగా వివాదాస్పదంగా ఉంది. అన్య మతస్తులను టీటీడీ నుంచి తప్పించాలని ఉద్యమాలు జరిగాయి. కానీ ఇప్పటికీ అది నినాదం గానే ఉంది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చింది. సి ఎస్ గా ఎల్వి సుబ్రహ్మణ్యం ఉన్నారు. ఆ సమయంలో తిరుమలలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. ఆయన ఉద్యోగుల ఇళ్లకు వెళ్లి విచారణ చేశారు. అన్య మతస్తులు అని అనుమానం వచ్చిన తర్వాత టీటీడీ ఉద్యోగుల ఇళ్లకు కూడా వెళ్లి పట్టుకున్నారు. అంతకుముందే మొత్తంగా 45 మంది ఉద్యోగులను అప్పట్లో తప్పించినట్లుగా తెలుస్తోంది. అయితే వారు కోర్టుకెళ్లడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఎల్వి సుబ్రహ్మణ్యం మొత్తం టీటీడీని సంస్కరించే ప్రయత్నం చేశారు. కానీ జగన్ సర్కార్ ఆయనను హఠాత్తుగా తప్పించింది. తరువాత కొన్ని సందర్భాలలో తిరుమలలో అన్యమత ఉద్యోగులు లేకుండా చేసేందుకు ప్రయత్నం చేసినందుకే ఎల్ వి సుబ్రహ్మణ్యం తప్పించారన్న విమర్శలు కూడా ఉన్నాయి.

* చాప కింద నీరులా అన్యమత ప్రచారం
టీటీడీలో అన్యమత ప్రచారం చాప కింద నీరుల కొనసాగుతోందన్న అనుమానాలు ఉన్నాయి. ప్రధానంగా 2020లో దీనిని గుర్తించారు. ఈ అంశంపై దృష్టి సారించిన టీటీడీ విచారణ కూడా చేసింది. అయితే అంతకంటే ముందే టీటీడీలో అన్యమత ఉద్యోగులు ఉన్నారన్న విషయం వెలుగులోకి వచ్చింది. అన్యమత ప్రచారం చేస్తూ తిరుమల పవిత్రతకు భంగం కలిగిస్తున్న వారిని గుర్తించి 69 మందితో కూడిన ఓ జాబితాను రూపొందించింది. ఈ జాబితాలో టీటీడీలో ఉద్యోగాలు చేస్తున్న వారితో పాటు అక్కడే పదవీ విరమణ చేసిన మాజీ ఉద్యోగులు సైతం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టిటిడి భావించింది. అటువంటి ఉద్యోగులను టీటీడీ నుంచి పంపించేయాలని కూడా అనుకున్నారు. కానీ ఎక్కడికి అక్కడే ఆ ప్రక్రియ నిలిచిపోయింది.

* అడ్డుకట్ట వేస్తోందా
అయితే ఇటీవల పరిణామాల నేపథ్యంలో టీటీడీపై బలమైన చర్చ నడుస్తోంది. ఇటీవల టీటీడీ లడ్డు వ్యవహారం వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు అన్యమత ఉద్యోగస్తులు విషయం కూడా చర్చకు దారితీసింది. అన్య మతస్తులను టీటీడీలో ఉన్నత ఉద్యోగుల స్థానాల్లో కూర్చోబెట్టారని.. మాంసాహారం, గంజాయి, మద్యం వంటివి కొండపై విరివిగా దొరుకుతున్నాయని అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న టిడిపి, జనసేనలో తీవ్ర ఆరోపణలు చేశాయి. తిరుమల కొండ పవిత్రత దెబ్బతినే ప్రమాదం ఉందని కూడా ఆందోళన వ్యక్తం చేశాయి. ఇటువంటి పరిస్థితుల్లో కూటమి అధికారంలోకి వచ్చింది. టీటీడీ ట్రస్ట్ బోర్డును ఏర్పాటు చేసింది. అయితే ఈ అన్ని మతస్తుల అంశాన్ని ఎలా పరిగణిస్తుందో చూడాలి.