Blackmailing: ఆన్ లైన్ మోసాలకు అంతే లేకుండా పోతోంది. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విటర్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా పలువురు మహిళలు మోసపోతూనే ఉన్నారు. స్నేహం పేరుతో వల వేసి తరువాత వారిని మచ్చిక చేసుకుని చాటింగ్ చేస్తూ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడో ప్రబుద్డుడు. ఆడవారి అమాయత్వాన్ని ఆసరాగా చేసుకుని వారితో న్యూడ్ వీడియో కాల్స్ చేస్తూ బెదిరింపులకు గురిచేసి శారీరకంగా అనుభవించాడు. కొందరి దగ్గర డబ్బులు కూడా వసూలు చేస్తున్నాడు. దీంతో ఓ మహిళ చేసిన ఫిర్యాదుతో కటకటాలపాలయ్యాడు. తరువాత ఆరా తీస్తే అతడి బాగోతాలన్ని బయటపడ్డాయి.

కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన చెన్నుపల్లి ప్రసన్నకుమార్ బీటెక్ చదువుతూ మధ్యలోనే వదిలేశాడు. ప్రశాంత్ రెడ్డి, రాజారెడ్డి, టోనీ అనే పేర్లు మార్చుకుంటూ మహిళలపై వల విసురుతున్నాడు. కొద్దిరోజులు చైన్ స్నాచింగ్, తాళం వేసిన ఇళ్లల్లో చోరీలు చేస్తూ జల్సాగా తిరిగేవాడు. వీటిపై బోరు కొట్టడంతో దారి మార్చాడు. మహిళలపై లైంగిక దాడులకు పలు మార్గాలు అన్వేషించాడు. ఈ నేపథ్యంలో తెలుగు స్టేట్లలో దాదాపు 26 కేసులు అతడిపై నమోదయ్యాయి. దీంతో అతడి అసలు స్వరూపం బయటపడింది. అతడి నేరాలు వెలుగులోకి రావడంతో అందరు ఆశ్చర్యపోయారు.
తెలుగు స్టేట్లలో దాదాపు 400 మంది అమ్మాయిలు, మహిళలను బుట్టలో వేసుకుని వారిని బ్లాక్ మెయిల్ చేస్తూ లొంగదీసుకున్నాడు. కొందరిని శారీరకంగా అనుభవించాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక చాలా మంది ఫిర్యాదు చేసేందుకు వెనుకాడారు. ఒక వేళ చేసినా పరువు పోతుందనే ఉద్దేశంతో ఎవరికి చెప్పుకోలేకపోయారు. దీంతో అతడి నేరాల పరిశోధనలో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.
దీంతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వారి పరిశోధనలో పలు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. దీంతో అతడి ఆగడాలకు అంతేలేకుండా పోతోంది. ఇన్నాళ్లు పోలీసుల కళ్లు గప్పి తిరుగుతున్న అతడిని ప్రస్తుతం కటకటాల్లోకి పంపించారు. ఏది ఏమైనా తెలుగు ప్రాంతాల్లో పలు నేరాలు చేసి చివరికి అరెస్టు కావడంతో బాధిత మహిళలు ఊపిరి పీల్చుకున్నారు.