Bhaskar:టాలీవుడ్ లో ‘హిట్’ మాత్రమే మాట్లాడుతుంది. హిట్ అయిన దర్శకుడికి ఫ్లాట్ లు, కారులు గిఫ్ట్ లుగా వెళతాయి. లాభాల్లో వాటాలు దక్కుతాయి. కానీ ఫ్లాప్ అయితే ఇండస్ట్రీ మొత్తం దూరం పెడుతుంది. ఎటూ కాకుండా పోతారు.. అప్పుడెప్పుడో ‘బొమ్మరిల్లు’ సినిమాతో ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడు భాస్కర్ తర్వాత తీసిన ‘ఆరేంజ్’ సినిమాతో నాగబాబును అప్పుల పాలు చేశాడన్న విమర్శ ఉంది. ఆయన ఆత్మహత్యకు ఈ సినిమా అప్పులు దారితీశాయని అంటున్నారు.
bhaskar
‘ఆరేంజ్’ సినిమాతో ఇక దర్శకుడు భాస్కర్ పై టాలీవుడ్ లో నమ్మకం పోయింది. అతడితో సినిమాలు తీయడానికి ఏ దర్శకుడు ముందుకు రాలేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా ఏ హీరో దరిచేరనివ్వలేదు. దీంతో చాలా సంవత్సరాలు వెయిట్ చేసిన భాస్కర్ కు అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ సినిమాతో ఒక అవకాశం వచ్చింది.
ప్రస్తుతం టాలీవుడ్ లో రాజమౌళి, త్రివిక్రమ్ లు బడ్జెట్ ను బట్టి 30 కోట్లపైనే రెమ్యూనరేషన్లు తీసుకుంటున్నారు. చిన్న సినిమా దర్శకుడు వరకూ 50 లక్షల నుంచి కోటి వరకూ తీసుకుంటున్నారు. ఇంత డిమాండ్ ఉన్న వేళ గంపగుత్తగా చెక్కులు ఇస్తున్న సమయంలో కూడా తాజాగా బొమ్మరిల్లు భాస్కర్ నెలజీతానికి పనిచేస్తూ దర్శకత్వం వహించి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ’ మూవీని తీశాడన్న టాక్ ఇండస్ట్రీలో నడుస్తోంది.
ఫేడ్ అవుట్ అయిన భాస్కర్ కు రెమ్యూనరేషన్ కాకుండా కేవలం నెలకు రూ.2లక్షల చొప్పున జీతం ఇచ్చి ఆ సినిమాను పూర్తి చేసినట్లుగా టాక్ నడుస్తోంది. మరి సినిమాకు మంచి టాక్ రావడంతో ఇప్పటికైనా నిర్మాత అల్లు అరవింద్, గీతా ఆర్ట్స్ ఈ దర్శకుడికి రెమ్యూనరేషన్ ఇస్తుందో లేదో చూడాలి మరీ..