Tirupati JanaSena Town President Raja Reddy: ప్రజలకు సేవ చేయమని పదవులు ఇస్తే మంత్రులు ఆ పదవులకు కళంకం తెచ్చే రీతిన ప్రవర్తిస్తున్నారని.. దేవుడి సొమ్ము తినడానికి కూడా వెనుకాడడం లేదని జనసేన పార్టీ తిరుపతి నగర అధ్యక్షుడు శ్రీ జె.రాజారెడ్డి ఫైర్ అయ్యారు. జగన్ రెడ్డి మెప్పు కోసం జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు చేస్తూ కాలం వెళ్లదీస్తున్నారని మండిపడ్డారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద లేనిపోని నిందలు వేస్తే రోడ్ల మీద తిరగనివ్వమని హెచ్చరించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో పార్టీ నాయకులతో కలసి మీడియా సమావేశం నిర్వహించారు. జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ట్వీట్ల నేపథ్యంలో ఆయనపై మంత్రులు చేసిన విమర్శలను తిప్పికొట్టారు.

ఈ సందర్భంగా శ్రీ రాజరెడ్డి మాట్లాడుతూ.. “రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు వైసీపీ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డికి తెలియచేయాలన్న ఉద్దేశంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్ ద్వారా ప్రశ్నాస్త్రాలు సంధిస్తే.. ఆ ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేని పరిస్థితుల్లో మంత్రులు రోడ్డు మీద పడి వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. మంత్రి పదవులు కాపాడుకోవాలంటే ప్రజల మధ్యకు రండి. మీకు ఓట్లు వేసిన ప్రజలకు మంచి చేయండి. అది వదిలి 24 గంటలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జపం చేస్తారేంటి? రాష్ట్ర ప్రజలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్న సంగతి మీకు అర్ధం అయ్యే మీకు భయం పట్టుకుంది. రాబోయే రోజుల్లో ప్రజలు మిమ్మల్ని రోడ్ల మీద తిరగనిచ్చే పరిస్థితులు లేవన్న సంగతి గుర్తు పెట్టుకోండి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు వెనకాముందు చూసుకుని మాట్లాడండి.
Also Read: AP RTC Buss: ఏపీఎస్ ఆర్టీసీ బస్సు రన్నింగ్ లో ఉండగా ఊడిన చక్రాలు.. మొన్న అలా.. నేడు ఇలా
* కొండకు వెళ్ళేది దర్శనం కోసం కాదు
మంత్రి రోజా గారు తిరుమల కొండ మీదకు వెళ్లి రాజకీయాలు మాట్లాడుతారు. ఆమె పదే పదే కొండ మీదకు వెళ్లేది దేవుడి దర్శించుకునేందుకు కాదు. దర్శనం టిక్కెట్లు అమ్ముకునేందుకు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై నగరాల్లో ప్రత్యేక కౌంటర్లు తెరిచి మరీ ప్రోటోకాల్ టిక్కెట్లు అమ్ముకుంటున్నారంట. అమ్మా… రోజమ్మా ఇంతకీ ఒక్కో ప్రోటోకాల్ టిక్కెట్టు మీరు ఎంతకు అమ్ముకుంటున్నారో సెలవిస్తారా? మీకు దమ్ముంటే ఇప్పటి వరకు మీరు దర్శనం చేయించిన వారి వివరాలు బయటపెట్టగలరా? కౌంటర్ తెరిచి మరీ దర్శనం టిక్కెట్లు వ్యాపారం చేస్తున్న మీరా మాట్లాడేది. మీ నియోజకవర్గం నగరిలో మీకు గడప గడపకు తిరిగే దమ్ముందా?
ఐటీ అన్న పదానికి అర్ధం తెలియని అమర్నాథ్ ఐటీ శాఖకు మంత్రి. మీకసలు మీ శాఖల గురించి తెలుసా? అధికారంలో ఉన్న పార్టీల మోచేతి నీళ్లు తాగే మీరు శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉంది” అన్నారు.

• మచ్చలేని ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు: శ్రీమతి ఆకేపాటి సుభాషిణి
రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ఆకేపాటి సుభాషిణి మాట్లాడుతూ.. “శ్రీ పవన్ కళ్యాణ్ గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పే దమ్ము లేకే మంత్రులు ఇష్టారీతిన నోరు పారేసుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లోనే కాదు దేశ రాజకీయాల్లో కూడా మచ్చలేని ఏకైక నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు” అన్నారు. ఈ సమావేశంలో నగర కమిటీ సభ్యులు శ్రీ సుమన్ బాబు, శ్రీ మునస్వామి, శ్రీ బలరామ్, శ్రీ సుమన్, శ్రీమతి లక్ష్మి, శ్రీ సాయి, శ్రీ పురుషోత్తం, శ్రీ పవన్, శ్రీ ఆదికేశవులు తదితరులు పాల్గొన్నారు.