https://oktelugu.com/

Minister Ambati Rambabu: ‘సందులో సంబరాల శ్యాంబాబు’.. అంబటి పరువు తీసే పనిలో జనసేన

తిరుపతిలో అయితే అంబటి పై ఏకంగా సినిమా షూటింగ్ను ప్రారంభించారు జనసేన నాయకులు. ప్రొడక్షన్ నెంబర్ 6093 జగ్గు భాయ్ సమర్పించు సందులో సంబరాల శ్యాం బాబు పేరిట ఓ సినిమా షూటింగ్ను ప్రారంభించారు.

Written By: , Updated On : August 3, 2023 / 12:08 PM IST
Minister Ambati Rambabu

Minister Ambati Rambabu

Follow us on

Minister Ambati Rambabu: ఏపీ మంత్రి అంబటిని జనసైనికులు వెంటపడుతున్నారు. వెంబడిస్తూనే ఉన్నారు. బ్రో సినిమా వివాదం నేపథ్యంలో మంత్రి అంబటి పవన్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది చిత్రాలు పవన్ పై తీయనున్నట్లు ప్రకటించిన సంగతి విధితమే. తాళి ఎగతాళి, మూడు పెళ్లిళ్లు మోసగాడు వంటి టైటిళ్లను పరిశీలిస్తున్నట్లు కూడా ప్రకటించారు. అంతటితో ఆగకుండా బ్రో సినిమాలో నటించినందుకు పవన్ కు టిడిపి ప్యాకేజీ ఇచ్చిందని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఏకంగా ఈడికి ఫిర్యాదు చేయనున్నట్లు కూడా చెప్పుకొచ్చారు.

అయితే అంబటి ఇటువంటి చర్యలతో ప్రజల్లో చులకన అవుతున్నారు. తన ప్రవర్తన తీరుతో ఏరి కోరి కష్టాలు తెచ్చుకుంటున్నారు. అటు జనసైనికులు సైతం అంబటిని విడిచి పెట్టడం లేదు. ఓ రేంజ్ లో వేసుకుంటున్నారు. అంబటి పై నిజంగానే సినిమాలు తీస్తామని చెబుతున్నారు. సందులో సంబరాల శ్యాం బాబు పేరిట.. త్రిబుల్ ఎస్ సినిమాను తీస్తామని ప్రకటించారు. సుకన్య క్యారెక్టర్ కోసం ముంబై రెడ్ లైట్ ఏరియాలో హీరోయిన్ను వెతుకుతున్నట్లు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నెటిజెన్లకు ఇది ఎంతగానో ఆకట్టుకుంటోంది.

తిరుపతిలో అయితే అంబటి పై ఏకంగా సినిమా షూటింగ్ను ప్రారంభించారు జనసేన నాయకులు. ప్రొడక్షన్ నెంబర్ 6093 జగ్గు భాయ్ సమర్పించు సందులో సంబరాల శ్యాం బాబు పేరిట ఓ సినిమా షూటింగ్ను ప్రారంభించారు. ముందుగా మంత్రి వేషధారణ కలిగిన వ్యక్తి ఆధ్వర్యంలో స్వామివారికి పూజలు నిర్వహించారు. క్లాప్ కొట్టి సినిమా ప్రారంభించారు. ఆ వ్యక్తిని గొబ్బెమ్మల కింద కూర్చోబెట్టి వీర మహిళలు చేతులకు గాజులు వేసి నృత్యం చేస్తూ పూలు చల్లారు. వీర మహిళలు పాటలు పాడుతూ సందడి చేస్తూ అంబటి పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. టీజింగ్ వీరలెవల్లో ఉందంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి.