https://oktelugu.com/

తిరుపతి బైపోల్ కూడా అప్పుడేనా..?

దేశంలో త్వరలో మరో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఈసీ రంగం సిద్ధం చేస్తోందన్న విషయం తెలిసిందే. తమిళనాడు.. పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, కేరళ, అస్సాం రాష్ట్రల్లో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ కూడా విడుదల చేసేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 15 తరువాత కానీ.. 20వ తేదీ తరువాత కానీ.. ఎన్నికల షెడ్యూలు విడుదల చేస్తుందంట ఎన్నికల సంఘం. అయితే ఏపీలోని తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పెండింగ్ […]

Written By:
  • Srinivas
  • , Updated On : February 11, 2021 3:07 pm
    Follow us on

    Tirupati by-elections
    దేశంలో త్వరలో మరో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణకు ఈసీ రంగం సిద్ధం చేస్తోందన్న విషయం తెలిసిందే. తమిళనాడు.. పశ్చిమ బెంగాల్, పుదుచ్చేరి, కేరళ, అస్సాం రాష్ట్రల్లో త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. షెడ్యూల్ కూడా విడుదల చేసేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఈనెల 15 తరువాత కానీ.. 20వ తేదీ తరువాత కానీ.. ఎన్నికల షెడ్యూలు విడుదల చేస్తుందంట ఎన్నికల సంఘం. అయితే ఏపీలోని తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పెండింగ్ లో ఉన్న సంగతి తెలిసిందే..

    Also Read: జగన్ స్పీడు మామూలుగా లేదుగా..!

    అయితే దేశంలోని ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు అతిత్వరలో ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికకు కూడా ఈసీ రంగం సిద్ధం చేసినట్లు సమాచారం. ఈనెల మూడోవారం లేదా.. నాలుగోవారంలో ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసే అవకాశం ఉంది. ఇదే జరిగితే.. పంచాయతీ పోరు ముగియగానే ఏపీలో మరోసారి హడావుడి మొదలు కానుంది.

    ఇప్పటికే ఈ ఉప ఎన్నికపై రాజకీయ పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. కొన్ని నెలలుగా తమ అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నాయి. ఈ క్రమంలో ఉప ఎన్నిక సమయం కూడా దగ్గర పడుతుండడంతో అందరూ అలర్ట్ అవుతున్నారు. తమిళనాడు, పశ్చిమ బెంగాల్, కేరళ, అస్సాం, పుదుచ్చేరి రాష్ట్రాల అసెంబ్లీల కాల పరిమితి దగ్గర పడింది. ఈ ఐదు రాష్ట్రాలకు కలిపి ఈసీ ఒకేసారి ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయనుంది. ఈ క్రమంలో వాటితో పాటు తిరుపతి బైపోల్ కు కూడా ఎన్నికల తేదీని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. తిరుపతి ఉప ఎన్నికకు సంబంధించి రిటర్నింగ్ అధికారి నియామకం కూడా జరిగినట్లు ఉంది.

    Also Read: జగన్ వైజాగ్ టూర్.. కారణం అదేనా..?

    తిరుపతి లోక్ సభ సభ్యుడు బల్లి దుర్గా ప్రసాద్ కరోనాతో మరణించాడు. ఈ నేపథ్యంలో ఈ స్థానానికి బై ఎలక్షన్ జరగనుంది. ఇప్పటికే పలు పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించేశారు. టీడీపీ నుంచి పనబాక లక్మ్షీని బరిలో నిలిపేందుకు ఖరారు చేశారు. వైఎస్సార్ సీపీ నుంచి గురుమూర్తికి టికెట్ ఇచ్చే అవకాశం ఉంది. బీజేపీ.. జనసేన పొత్తు పెట్టుకుని బరిలో నిలవాలని ఇప్పటికే డిసైడ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నికకు నోటిఫికేషన్ ఇస్తే.. ఏపీలో రాజకీయం మరోసారి వేడెక్కనుంది.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్