https://oktelugu.com/

టిప్పు సుల్తాన్ వివాదం: బీజేపీదే విజయం

మొత్తానికి రాయలసీమలోని ప్రొద్దుటూరులో తలపెట్టిన టిప్పుసుల్తాన్ విగ్రహా ఏర్పాటు వివాదం సామరస్యంగా ముగిసింది. ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ ఈ విషయంలో వెనక్కి తగ్గింది. ఏపీ బీజేపీ పోరాటానికి ఫలితం దక్కింది. ఇది ముమ్మాటీకి బీజేపీ సాధించిన విజయం అనే చెప్పాలి. సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు వ్యవహారం వివాదాస్పదమైంది. పట్టణంలోని మైనార్టీలతో కలిసి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఏర్పాటు చేస్తున్న ఈ విగ్రహంపై […]

Written By:
  • NARESH
  • , Updated On : August 3, 2021 / 03:18 PM IST
    Follow us on

    మొత్తానికి రాయలసీమలోని ప్రొద్దుటూరులో తలపెట్టిన టిప్పుసుల్తాన్ విగ్రహా ఏర్పాటు వివాదం సామరస్యంగా ముగిసింది. ఏపీలోని వైఎస్ జగన్ సర్కార్ ఈ విషయంలో వెనక్కి తగ్గింది. ఏపీ బీజేపీ పోరాటానికి ఫలితం దక్కింది. ఇది ముమ్మాటీకి బీజేపీ సాధించిన విజయం అనే చెప్పాలి.

    సీఎం జగన్ సొంత జిల్లా కడపలోని ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు వ్యవహారం వివాదాస్పదమైంది. పట్టణంలోని మైనార్టీలతో కలిసి స్థానిక వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి ఏర్పాటు చేస్తున్న ఈ విగ్రహంపై బీజేపీ పోరుబాట పట్టింది. టిప్పు సుల్లాన్ హిందుత్వ వ్యతిరేకి అని బీజేపీ వాదిస్తోంది. ఇప్పటికే కర్ణాటకలో టిప్పు సుల్తాన్ జయంతి కార్యక్రమాలను వ్యతిరేకిస్తున్న బీజేపీ నేతలు.. ఇప్పుడు జగన్ సొంత జిల్లాలో, అదీ వైసీపీ ఎమ్మెల్యే సాయంతో ఏర్పాటవుతున్న విగ్రహంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు.ఈ విగ్రహ ఏర్పాటును వ్యతిరేకిస్తూ బీజేపీ నేతలు ఆందోళనకు దిగడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

    ప్రొద్దూటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటును నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు సారథ్యంలో బీజేపీ శ్రేణులు కదంతొక్కాయి. ప్రొద్దూటూరు మున్సిపల్ కార్యాలయం వద్ద భారీ ధర్నాకు దిగారు. దీనికి బీజేపీ శ్రేణులు భారీగా కదిలివచ్చారు. అనంతరం మున్సిపల్ కార్యాలయం నుంచి టిప్పు సుల్తాన్ విగ్రహాన్ని ఏర్పాటు చేయతలపెట్టిన ప్రాంతానికి సోము వీర్రాజు బయలు దేరారు. ఆయన వెంట భారీగా బీజేపీ నేతలు, కార్యకర్తలు వచ్చారు. దీంతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.వెంటనే పోలీసులు రంగంలోకి దిగి సోము వీర్రాజును అడ్డుకొని అరెస్ట్ చేశారు. సోము వీర్రాజు అరెస్ట్ సమయంలో పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య తీవ్ర తోపులాట చోటుచేసుకుంది. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భారీగా మోహరించి సోము వీర్రాజు సహా నేతలను లాక్కేళ్లారు. ఇంత రచ్చ జరిగి ఈ వివాదం వైసీపీ ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పడేసింది. జాతీయ స్థాయిలో జగన్ సర్కార్ ను కార్నర్ చేసేలా ఈ వివాదం తయారైంది. ఈ క్రమంలోనే ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటును నిలిపివేస్తూ వైసీపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.

    ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహంతో సహా ఎటువంటి విగ్రహాలు ఏర్పాటు చేయకూడదని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్వాగతించారు. బహిరంగ ప్రదేశాల్లోనూ ముఖ్య కూడళ్లలో, విగ్రహాలు ఏర్పాటు విషయంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన మార్గదర్శకాలుకు అనుగుణంగా,రాష్ట్ర ప్రభుత్వ ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ ఈ నిర్ణయం తీసుకున్నారు,

    టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు నుంచి ప్రభుత్వం వెనక్కి తగ్గడంపై ఏపీ బీజేపీ చీఫ్ స్పందించారు. బీజేపీ పోరాట ఫలితం.. ప్రొద్దుటూరు ప్రజలు ఇచ్చిన సహకారం, స్ఫూర్తి ఫలితమేనని సోమువీర్రాజు అభిప్రాయపడ్డారు. ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు చేయటం ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనుకున్న వారికి ఈ నిర్ణయం చెంపపెట్టులాంటిదని శ్రీ సోము వీర్రాజు వ్యాఖ్యానించారు. ప్రజాబీష్టానికి వ్యతిరేకంగా వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రజల్లో ఘర్షణలు సృష్టించే వారికి సుప్రీంకోర్టు మార్గదర్శకాలు గుణపాఠం కావాలని వీర్రాజు అన్నారు.

    మొత్తంగా బీజేపీ పోరుబాట ఫలితంగానే టిప్పు సుల్తాన్ విగ్రహ ఏర్పాటు వివాదం వెనక్కి మళ్లింది. ఇది ముమ్మాటికీ ఏపీ బీజేపీ సాధించిన ఘనతగా చెప్పుకోవచ్చు.