కేసీఆర్ డిసైడ్: హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి ఈయనే?

హుజురాబాద్ ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. అభ్యర్థి ఎంపిక విషయంలో ఇన్నాళ్లు వేచి చూసినా ఇక ఉపేక్షించేది లేదని చూస్తున్నారు. అభ్యర్థి అన్వేషణలో తర్జనభర్జన పడుతున్న కేసీఆర్ ఇక నిర్ణయం తీసుకునేందుకు నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ ప్రచారం లో దూసుకుపోతుండడంతో టీఆర్ఎస్ కూడా తన ప్రభావం చూపాలని భావిస్తోంది. ఈనెల 16న హుజురాబాద్ లోపర్యటించనున్న కేసీఆర్ అదే రోజు అభ్యర్థి ప్రకటనపై వెల్లడిస్తారని ప్రచారం సాగుతోంది. ఉప ఎన్నిక ప్రచారం […]

Written By: Srinivas, Updated On : August 3, 2021 5:07 pm
Follow us on

హుజురాబాద్ ఉప ఎన్నికపై సీఎం కేసీఆర్ దృష్టి సారించారు. అభ్యర్థి ఎంపిక విషయంలో ఇన్నాళ్లు వేచి చూసినా ఇక ఉపేక్షించేది లేదని చూస్తున్నారు. అభ్యర్థి అన్వేషణలో తర్జనభర్జన పడుతున్న కేసీఆర్ ఇక నిర్ణయం తీసుకునేందుకు నిశ్చయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బీజేపీ ప్రచారం లో దూసుకుపోతుండడంతో టీఆర్ఎస్ కూడా తన ప్రభావం చూపాలని భావిస్తోంది. ఈనెల 16న హుజురాబాద్ లోపర్యటించనున్న కేసీఆర్ అదే రోజు అభ్యర్థి ప్రకటనపై వెల్లడిస్తారని ప్రచారం సాగుతోంది. ఉప ఎన్నిక ప్రచారం గురించి ఇప్పటికేపలు రకాల పథకాల అమలుతో హుజురాబాద్ టాపిక్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం ఇప్పటికే చాలా మంది పేర్లు పరిశీలించారు. మొదట మాజీ ఎంపీ వినోద్ కుమార్, బీసీ కమిషన్ మాజీ సభ్యుడు వకుళాభరణం కృష్ణమోహన్, మాజీ మంత్రి ముద్దసాని దామోదర్ రెడ్డి కొడుకు పురుషోత్తం రెడ్డి, ఆయన భార్య మాలతి తదితరుల పేర్లు వినిపించినా వారికి సీటు దొరకడం లేదని తెలుస్తోంది. తరువాత స్వర్గం రవి, గెల్లు శ్రీనివాస్ యాదవ్, కౌశిక్ రెడ్డి పేర్లు వచ్చాయి. కౌశిక్ రెడ్డికి టికెట్ ఖాయమని ప్రచారం జరిగినా ఆయనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ఈటల రాజేందర్ ఉద్యమ కారుడు కావడంతో ఆ నేపథ్యం ఉన్న వారికే టికెట్ ఇవ్వాలని చూస్తున్నట్లు నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇందులో భాగంగా గెల్లు శ్రీనివాస్ యాదవ్ ను హుజురాబాద్ బరిలో దింపనున్నట్లు ప్రచారం సాగుతోంది టీఆర్ ఎస్వీ నాయకుడిగా ఉన్న శ్రీనివాస్ యాదవ్ నియోజకవర్గానికి చెందిన వాడు కావడంతో ఆయన వైపు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే శ్రీనివాస్ యాదవ్ తనకు ఇచ్చిన అవకాశాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటాడో అని చూస్తున్నారు.

హుజురాబాద్ నియోజకవర్గంలో పథకాలను పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే దళిత బంధు పథకంతో అందరి ధృష్టిని ఆకర్షించిన కేసీఆర్ కు దీంతో చిక్కులే ఎదురవుతున్నాయి. అందరు అన్నిప్రాంతాల్లో దళిత బంధు పథకం అమలు చేయాలని డిమాండ్లు వస్తున్న నేపథ్యంలో దాని గురించి కేసీఆర్ కు ఇబ్బందులు వస్తున్నాయి. దీంతో క్షేత్రస్థాయిలో కేసీఆర్ టీఆర్ఎస్ ముమ్మర ప్రచారం చేస్తోంది. అభ్యర్థి ప్రకటన తరువాత ప్రచారాన్ని మరింత స్పీడ్ చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దళితబంధు పథకం అమలుపై స్పష్ట ఇచ్చే విషయంలో ఇంకా ఏ నిర్ణయం ప్రకటించడం లేదు. ఉప ఎన్నిక ముందు ఇస్తారా? లేక తరువాత ఇష్తారా అనే విషయం తేల్చాల్సి ఉంది. దీంతో గెలుపుపై తమదే విజయం అనే ధీమాలో ఉంది. ఉప ఎన్నిక నోటిఫికేషన్ వచ్చే లోగా ఎవరి బలం ఎంత ఉంటుందో అనే తెలియాల్సి ఉంటుంది. అధికార పార్టీ విజయం కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది.