CM KCR: ఒక్క జీవోతో వందల ఎకరాలకు వెసులుబాటు ఇచ్చినట్లేనా?

CM KCR:  జీవో నెం. 111 ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. దీనిపై అసెంబ్లీలో సైతం చర్చ జరిగింది. దీన్ని రద్దు చేయాలని ప్రతిపక్షాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జీవోపై అందరిలో ఆసక్తి నెలకొంది. 1996లో అప్పటి ప్రభుత్వం జంట నగరాల్లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు కలుషితం కాకూడదనే ఉద్దేశంతో జీవోను తీసుకొచ్చారు. దీంతో అప్పటి నుంచి అక్కడ ఏ నిర్మాణాలు చేపట్టరాదని సూచించింది. దీంతో ప్రస్తుతం నిర్మిస్తున్న నిర్మాణాలకు సైతం అనుమతులు […]

Written By: Srinivas, Updated On : March 16, 2022 5:56 pm
Follow us on

CM KCR:  జీవో నెం. 111 ఇప్పుడు వివాదాస్పదమవుతోంది. దీనిపై అసెంబ్లీలో సైతం చర్చ జరిగింది. దీన్ని రద్దు చేయాలని ప్రతిపక్షాలు సైతం డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ జీవోపై అందరిలో ఆసక్తి నెలకొంది. 1996లో అప్పటి ప్రభుత్వం జంట నగరాల్లో ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలు కలుషితం కాకూడదనే ఉద్దేశంతో జీవోను తీసుకొచ్చారు. దీంతో అప్పటి నుంచి అక్కడ ఏ నిర్మాణాలు చేపట్టరాదని సూచించింది. దీంతో ప్రస్తుతం నిర్మిస్తున్న నిర్మాణాలకు సైతం అనుమతులు రావడం లేదు. ఫలితంగా ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

CM KCR

మంగళవారం జరిగిన శాసనసభ సమావేశాల్లో ఈ మేరకు సమస్యలు సభ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో స్పందించిన సీఎం కేసీఆర్ జీవో రద్దు చేస్తామని హామీ ఇచ్చారు. నిపుణుల కమిటీ సూచనల మేరకు కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తామని చెప్పార. దీంతో ఇన్నాళ్లు ఎదురు చూసిన ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. ప్రభుత్వ నిర్ణయంతో అందరిలో ఆశలు రేకెత్తుతున్నాయి.

Also Read: ఐదు రాష్ట్రాల ఓటమి.. మొదటి పీసీసీ చీఫ్ సిద్ధూ ఔట్.. కాంగ్రెస్ ప్రక్షాళనే

దీనిపై 2016 రాష్ట్రప్రభుత్వం సీఎస్ అధ్యక్షతన హైపవర్ కమిటీ వేసింది. దీంతో 111 జీవో రద్దుకు తీసుకోవాల్సిన చర్యలపై నివేదిక ఇవ్వాలని సూచించింది. జంట జలాశయాల అవసరం లేకుండా చుట్టుపక్కల ప్రాజెక్టులు నిర్మిస్తుండటంతో ఇక జంట జలాశయాల అవసరం లేదని తెలుస్తోంది. అందుకే ఈ జీవో రద్దుకు ప్రభుత్వం నడుం బిగించింది. కానీ సుప్రీంకోర్టు, ఎన్జీటీ లు ఈ జీవో పటిష్టంగా అమలు చేయాలని సూచనలు చేసిన నేపథ్యంలో రద్దు అంశం వివాదమే కానుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.

జీవో రద్దయితే నగర రూపురేఖలే మారనున్నాయి. రియల్ బూమ్ పెరగనుంది. ఇప్పటికే నగరం నలుమూలల విస్తరిస్తున్న క్రమంలో జీవో రద్దు చేస్తే మరింత ధరలు పె రిగే సూచనలు కనిపిస్తున్నాయి. దాని పరిధిలోని 84 గ్రామాల్లో విస్తరించిన వందల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ అమాంతంగా పెరగనుంది. భూముల ధరలకు కూడా రెక్కలు రానున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నగరం మరింత అభివృద్ధి అయ్యే అవకాశం ఉంటుందని చెబుతున్నారు.

CM KCR

మొత్తానికి కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సజావుగా అమలు జరిగేనా అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి. జీవోను రద్దు చేయడమంటే మాటలు కాదు దానికి చాలా కసరత్తు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో 111 జీవో రద్దు సాకారమయ్యేనా? అందరి కల నెరవేరేనా అనే అనుమానాలు వస్తున్నాయి.

Also Read:  వైసీపీ, టీడీపీ వ్యతిరేకులకు ఇక జనసేనే దిక్కా?

Tags