Homeఎంటర్టైన్మెంట్Salman-Mahesh: పాత వాటితోనే ఖుషీ అవుతున్న 'సల్మాన్ - మహేష్' ఫ్యాన్స్ !

Salman-Mahesh: పాత వాటితోనే ఖుషీ అవుతున్న ‘సల్మాన్ – మహేష్’ ఫ్యాన్స్ !

Salman-Mahesh: బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్‌ ఖాన్‌ ఇప్పుడు వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతున్నాడు. ఈ క్రమంలోనే 2005లో సల్మాన్ హీరోగా వచ్చిన ‘నో ఎంట్రీ’ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఇప్పుడు అదే సినిమాను సీక్వెల్ గా రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నాడని తెలుస్తోంది. అన్నట్టు ఈ సినిమాను అనీస్‌ బజ్మీ డైరెక్ట్ చేయబోతున్నాడు. దీనిలో మూడు కీలక పాత్రలు ఉంటాయి.

Salman-Mahesh
Salman-Mahesh

కాగా ఆ కీలక పాత్రల్లో సల్మాన్ ఖాన్‌, అనిల్‌ కపూర్‌, ఫర్దీన్‌ ఖాన్ ముగ్గురు నటించబోతున్నారని తెలుస్తోంది. పైగా ఒక్కో హీరో మూడు పాత్రలు పోషిస్తారట. అంటే మొత్తం 9 పాత్రల్లో హీరోలు కనపడబోతున్నారు. ఇక పాత సినిమాతోనే ఖుషీ అవ్వడానికి మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ కూడా సిద్ధం అయ్యారు. అన్నీ అనుకూలంగా కుదిరితే సర్కారు వారి పాట ఈ సంక్రాంతికి బాక్సాఫీస్‌ పై యుద్దానికి దిగాల్సింది.

Also Read: టాలీవుడ్ ను చావుదెబ్బ తీసిన జగన్.. షాకింగ్ నిర్ణయం

అయితే, కరోనా దాడి దెబ్బకు రిలీజ్ ను పోస్ట్ ఫోన్ చేసుకుంది. ,మధ్యలో ఆర్ఆర్ఆర్ ఒకటి. మొత్తానికి మహేష్ కి కాలం కలిసి రాలేదు. అయితే ఈ పరిస్థితిని కూడా తమకి అనుకూలంగా మార్చుకుంటున్నారు సూపర్ స్టార్ ఫ్యాన్స్‌. బిజినెస్‌మ్యాన్‌ సినిమా దశాబ్దం పూర్తి చేసుకోబోతుంది.

ఏ హీరోకి లేనంతగా థియేటర్లలో దాదాపు 13 స్పెషల్‌ షోస్‌ వేసుకొని మళ్లీ పాత రోజుల్ని గుర్తు చేసుకుంటున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో డైలాగులు చాలా బాగా పేలాయి. మొత్తానికి అటు సల్మాన్ ఫ్యాన్స్, ఇటు మహేష్ ఫ్యాన్స్ ఈ సంక్రాంతికి పాత సినిమాలతోనే ఖుషీ అవుతున్నారు.

Also Read: ఎన్టీఆర్ కి బాబాయ్ గా డా: రాజశేఖర్ !

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Exit mobile version