https://oktelugu.com/

Sarkaru Vaari Paata Movie: ఈ సారి చాలా జాగ్రత్త పడుతున్న ‘మహేష్’ టీమ్

Sarkaru Vaari Paata Movie: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న ‘సర్కారు వారి పాట’ నుంచి సెకండ్ సాంగ్ రాబోతుంది. రేపు రెండో పాట అనౌన్స్మెంట్ ఉంటుందని ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. దీంతో ప్రిన్స్ మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ ‘సర్కారు వారి పాట’ నుంచి లవ్ సాంగ్ కళావతి అంటూ సాగే ఈ పాట రిలీజ్ […]

Written By:
  • Shiva
  • , Updated On : March 16, 2022 / 06:21 PM IST
    Follow us on

    Sarkaru Vaari Paata Movie: సూపర్‌ స్టార్‌ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న ‘సర్కారు వారి పాట’ నుంచి సెకండ్ సాంగ్ రాబోతుంది. రేపు రెండో పాట అనౌన్స్మెంట్ ఉంటుందని ఓ పోస్టర్ విడుదల చేసింది చిత్ర బృందం. దీంతో ప్రిన్స్ మహేష్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. ఇక ఈ ‘సర్కారు వారి పాట’ నుంచి లవ్ సాంగ్ కళావతి అంటూ సాగే ఈ పాట రిలీజ్ అయి సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

    Sarkaru Vaari Paata Movie

    మొత్తమ్మీద కళావతి అంటూ సాగే ఈ పాట ఒక ఊపు ఊపేసింది. యూట్యూబ్‌ కూడా షేక్ అయ్యింది. ఈ పాట యూట్యూబ్‌ లో 70 మిలియన్స్‌ కు పైగా వ్యూస్‌ ను క్రాస్ చేసింది. ఈ ఘనతపై మ్యూజిక్ డైరెక్టర్ తమన్, డైరెక్టర్ పరుశురామ్, సింగర్ సిద్ శ్రీరామ్ హర్షం వ్యక్తం చేశారు. మొత్తానికి ప్రేక్షకులను, అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది కళావతి.

    Also Read: ‘ఆర్ఆర్ఆర్’ 3డీలో.. సరికొత్త అనుభూతి ఇది !

    ఈ పాటకు సోషల్ మీడియా లో సైతం భారీ రెస్పాన్స్ వస్తోంది. నిజానికి మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన ఈ పాట సోషల్ మీడియాలో లీకైంది. సోషల్ మీడియాలో మొత్తం పాట వైరల్ కూడా అయ్యింది. దాంతో ఇక ఈ పాట హిట్ కాదు అనుకున్నారు. ఆ కోపంలోనే సైబర్ క్రైమ్ పోలీసులకు SVP యూనిట్ ఫిర్యాదు కూడా చేసిన సంగతి తెలిసిందే.

    అయితే, ఈ పాటకు పైరసీ బెడద గట్టిగానే తగిలినా.. ఈ పాట మాత్రం అద్భుతంగా హిట్ అయ్యింది. కాగా మొదటి పాట విషయంలో జరిగిన పొరపాటు రెండో పాటలో జరగకుండా జాగ్రత్త పడుతుంది టీమ్. ఇక చంద్రబోస్ రాసిన రెండో పాట చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందట. ఈ రెండో పాటలో కూడా మహేష్ బాబు, కీర్తి సురేష్ జంట కెమిస్ట్రీ కూడా చాలా బాగుంటుందట.

    Sarkaru Vaari Paata Movie

    త్వరలో ఈ సినిమా కొత్త షెడ్యూల్ ను ‘గోవా’లో ప్లాన్ చేస్తారట. ఈ షూట్ లో మహేష్, హీరోయిన్ కీర్తి సురేష్, అలాగే కమెడియన్ వెన్నెల కిషోర్ కూడా పాల్గొననున్నారు. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

    Also Read: వైరల్ అవుతున్న ‘ఎన్టీఆర్ – చరణ్’ ఫన్నీ ఇంటర్వ్యూ

    Tags