TIME Magazine lists 50 best places to visit in 2022 : అంతర్జాతీయ స్థాయిలో పాపులర్ మ్యాగజైన్ ‘టైమ్’ తాజాగా ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల పేర్లను విడుదల చేసింది. ఆశ్చర్యకరంగా దేశంలో ప్రధాని మోడీ సొంత నగరంపై ఆవిజ్య ప్రేమ చూపించినట్టు విమర్శలు ఎదుర్కొంటోంది. ఎందుకంటే గుజరాత్ రాజధాని అహ్మదాబాద్ కంటే నిజాంలు పాలించిన హైదరాబాద్ ‘హెరిటేజ్’ సిటీగా ఎప్పుడో గుర్తింపు పొందింది. హైదరాబాద్‌లో నిజాం కాలం నాటి చారిత్రక కట్టడాలు, పర్యాటక ప్రాంతాలు ఎన్నో ఉన్నాయి. ట్యాంక్ బండ్ , సాలర్జంగ్ మ్యూజియం సహా ఉమ్మడి ఆంధ్రాలో తీర్చిదిద్దిన పర్యాటక ప్రాంతాలున్నాయి. వీటన్నింటిని చూస్తే ఖచ్చితంగా దేశంలో అహ్మదాబాద్ కంటే కూడా హైదరాబాద్ టాప్ ప్లేసులో ఉంటుందని చెప్పకతప్పదు. అఫ్ కోర్స్ దేశంలోని గొప్ప ప్రదేశాల్లో టైమ్ ప్రకటించిన కేరళ నంబర్ 1 గా ఉంటుంది. ఎందుకంటే అది ‘దేవ భూమి’గా ప్రఖ్యాతి గాంచింది. అంతటి ప్రకృతి సంపద కేరళ సొంతం. కానీ కేరళ తర్వాత అహ్మదాబాద్ పేరు వినిపించడమే అందరికీ డౌట్ కొట్టేలా చేస్తోంది. మోడీ-షా ల సొంత నగరమైన అహ్మాదాబాద్ పై టైం మ్యాగజైన్ ఆవాజ్య ప్రేమ చూపించిందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. హైదరాబాద్ కు ఏం తక్కువైంది ఇక్కడి ప్రేమికులు ప్రశ్నిస్తున్నారు.
ప్రఖ్యాత టైమ్ మ్యాగజైన్ ఈ సంవత్సరం “ప్రపంచంలోనే గొప్ప ప్రదేశాలు 50 ప్రాంతాలను గుర్తించింది. ఇందులో భారతదేశం నుండి రెండు ప్రదేశాలను పేర్కొంది. దక్షిణాది రాష్ట్రమైన కేరళ మరియు అహ్మదాబాద్ లను భారత్‌లో గొప్ప ప్రదేశాలుగా టైం తెలిపింది. గుజరాత్ రాజధాని నగరం అహ్మదాబాద్ 2022లో ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల జాబితాలోకి భారత్ తరుఫున ఎంట్రీ దక్కించుకోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.
-2022లో ప్రపంచంలోని గొప్ప ప్రదేశాలు
ఈ జాబితాలో రస్ అల్ ఖైమా, యూఏఈ, పార్క్ సిటీ, ఉటా, సియోల్; గ్రేట్ బారియర్ రీఫ్, ఆస్ట్రేలియా; ఆర్కిటిక్; వాలెన్సియా, స్పెయిన్; భూటాన్; అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం; బొగోటా; దిగువ జాంబేజీ నేషనల్ పార్క్, జాంబియా; ఇస్తాంబుల్, కిగాలీ, రువాండాలను గొప్ప ప్రదేశంగా పేర్కొంది. టైమ్’ మ్యాగజైన్ ప్రకారం.. “కొత్త, ఉత్తేజకరమైన అనుభవాలను అందించే వారి సర్వే ఆధారంగా.. దాని అంతర్జాతీయ నెట్వర్క్ కరస్పాండెంట్లు.. కంట్రిబ్యూటర్ల నుండి నామినేషన్ల ద్వారా ప్రపంచంలోని గొప్ప ప్రదేశాల జాబితా రూపొందించబడింది. దేశంలో కేరళను ఎంపిక చేసుకోవడం సరైందే కానీ అహ్మదాబాద్ విషయంలోనే అందరికీ తేడా కొడుతోంది.
– కేరళ ‘దేవ భూమి’
“భారతదేశంలోని అత్యంత అందమైన రాష్ట్రాలలో కేరళ ఒకటి. అద్భుతమైన బీచ్‌లు.. దట్టమైన బ్యాక్ వాటర్ నదులు, దేవాలయాలు.. రాజభవనాలతో దీనిని “దేవభూమి” అని పిలుస్తారు” అని టైమ్ మ్యాగజైన్ తెలిపింది. ఈ సంవత్సరం కేరళ పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. హనీమూన్ ప్యాకేజీలు కూడా పెరుగుతున్నాయి. భారతదేశంలో మోటార్-హోమ్ టూరిజంను ప్రోత్సహిస్తోంది. రాష్ట్రంలో మొట్టమొదటి కారవాన్ పార్క్, కరవాన్ మెడోస్, వాగమోన్, సుందరమైన హిల్ స్టేషన్లు కేరళలో ప్రఖ్యాతి గాంచాయి. పడవ పోటీలతో కేరళ రాష్ట్రం పేరుపొందింది. పర్యాటకులు ఈ రాష్ట్రాన్ని సందర్శించడానికి మొగ్గు చూపుతున్నారు. కేరళ బీచ్‌లు, ప్రత్యేకమైన నదీ మార్గాలు.. పచ్చని తోటలు పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. 2022 సంవత్సరంలోని గత నెలలో కేరళ టూరిజం మొదటి త్రైమాసికంలో దేశీయ పర్యాటకుల సంఖ్య 3.8 మిలియన్లకు చేరుకుందని.. 2021 యొక్క సంబంధిత కాలంలో 2.2 మిలియన్ల మందితో పోలిస్తే ఇది పెరిగిందని టైమ్ మ్యాగజైన్ వివరించింది. ఈ గణాంకాలు కరోనా మహమ్మారికి ముందు ఉన్న గణాంకాల కంటే కేవలం 9.44% తక్కువగా ఉండడం విశేషం.. కేరళలోని ఎర్నాకులం జిల్లాను సందర్శించడానికి అత్యధికంగా 8,11,426 మంది దేశీయ పర్యాటకులు నమోదు చేసుకున్నారు. తిరువనంతపురం (6,00,933), ఇడుక్కి (5,11,947), త్రిసూర్ (3,58,052), వాయనాడ్ (3,10,322) ఆ తర్వాత పర్యాటక ప్రదేశాలుగా ఉన్నాయి.
-అహ్మదాబాద్
అహ్మదాబాద్ ను టైమ్ మ్యాగజైన్ దేశంలో రెండో గొప్ప ప్రదేశంగా పేర్కొంది. “భారతదేశంలో మొట్టమొదటి యునెస్కో ప్రపంచ వారసత్వ నగరంగా అహ్మదాబాద్ లోని “సబర్మతీ ఒడ్డున 36 ఎకరాలలో ఉన్న ప్రశాంతమైన గాంధీ ఆశ్రమంను పేర్కొంది. ఇక్కడి సాంస్కృతిక పర్యాటకానికి ‘మక్కా’గా మార్చే పురాతన మైలురాళ్లు.. సమకాలీన ఆవిష్కరణలు రెండింటినీ కలిగి ఉందని పేర్కొంది. ప్రపంచంలోనే అతి పెద్ద నృత్య ఉత్సవం తొమ్మిది రోజుల పాటు నవరాత్రి సందర్భంగా సాగుతుందని పేర్కొంది. అహ్మదాబాద్‌లోని గుజరాత్ సైన్స్ సిటీ “విశాలమైన వినోద కేంద్రం.. థీమ్ పార్క్ పర్యాటకులను ఆకర్షిస్తోందట.. గత సంవత్సరం మూడు ప్రధాన ప్రదేశాలను చూడడానికి పర్యాటకులు వచ్చారట.. స్థానిక వృక్షజాలంపై ప్రజలకు అవగాహన కల్పించడానికి 20 ఎకరాల ప్రకృతి పార్కుతోపాటు చదరంగం ఆడటానికి.. ప్రాక్టీస్ చేయడానికి కొత్త స్థలాలను రూపొందించారని.. యోగాకు అహ్మదాబాద్ ఫేమస్ అని పేర్కొంది.. సైన్స్ సిటీలోని కొత్త అక్వేరియం ప్రపంచవ్యాప్తంగా ఉన్న జల జాతులను ప్రదర్శిస్తుందని.. ఇది భారతదేశంలోనే అతిపెద్దది ”అని టైం పేర్కొంది.
అయితే టైం మ్యాగజైన్ అహ్మదాబాద్ ను గొప్ప ప్రదేశంగా కీర్తించిన హైదరాబాద్ కు మాత్రం సాటిరాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడి చార్మినార్, గొల్కొండ కోట, చౌమహల్లా ప్యాలెస్, బిర్లా మందిర్, సాలార్ జంగ్ మ్యూజియం చారిత్రక వారసత్వ సంపదకు నిదర్శనం. ఎన్నో హెరిటేజ్ భవనాలున్నాయి. ఇప్పటికీ ఎంతో మంది ఇక్కడకు పర్యటనకు వస్తారు. కానీ దేశ ప్రధాని నగరం కావడంతో దానికి ప్రచారం ఎక్కువైంది.కానీ హైదరాబాద్ లో అహ్మదాబాద్ ను మించి గొప్ప ప్రదేశాలున్నాయి. దాన్ని ప్రపంచానికి ప్రచారం చేస్తే మన భాగ్యనగరమే దేశంలో గొప్ప నగరంగా అభివర్ణించక మానరు. ప్రచారం చేసుకునే విషయంలోనే హైదరాబాద్ వెనుకబడింది కానీ.. చారిత్రకంగా.. పర్యాటకంగా అహ్మదాబాద్ ను మించి ఉంటుందని చెప్పొచ్చు.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Time magazine lists 50 best places to visit in 2022
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com