టిక్‌టాక్‌ భారీ విరాళం…!

కరోనా వైరస్‌ కట్టడికి భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు టిక్‌టాక్‌ భారీ విరాళం ప్రకటించింది. కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులకు సుమారు నాలుగు లక్షల హజ్మత్‌ సూట్‌లు, రెండు లక్షల మాస్కులు సమకూర్చేందుకు సిద్ధమైంది. వీటి విలువ సుమారు వంద కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. కరోనాను ఎదుర్కొనేం దుకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరులో వైద్యులు ముందు వరుసలో ఉన్నారని, వారు సురక్షితంగా ఉండటం అత్యవసరమని టిక్‌టాక్‌ సంస్థ తెలిపింది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని నాలుగు […]

Written By: Neelambaram, Updated On : April 2, 2020 11:10 am
Follow us on

కరోనా వైరస్‌ కట్టడికి భారత్‌ చేస్తున్న ప్రయత్నాలకు టిక్‌టాక్‌ భారీ విరాళం ప్రకటించింది. కరోనా బాధితులకు సేవలందిస్తున్న వైద్యులకు సుమారు నాలుగు లక్షల హజ్మత్‌ సూట్‌లు, రెండు లక్షల మాస్కులు సమకూర్చేందుకు సిద్ధమైంది. వీటి విలువ సుమారు వంద కోట్ల రూపాయల వరకూ ఉంటుందని అంచనా. కరోనాను ఎదుర్కొనేం దుకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పోరులో వైద్యులు ముందు వరుసలో ఉన్నారని, వారు సురక్షితంగా ఉండటం అత్యవసరమని టిక్‌టాక్‌ సంస్థ తెలిపింది. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని నాలుగు లక్షల ప్రత్యేక హజ్మత్‌ సూట్లు, రెండు లక్షల మాస్కులు వైద్యులకు అందించాలని నిర్ణయిం చినట్లు తెలిపింది. కేంద్ర జౌళి శాఖ సహకారం తో తాము నిర్ణీత ప్రమాణాలతో కూడిన సూట్లు, మాస్కులు సిద్ధం చేశామని, వీటిని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖకు అందజేయను న్నామని టిక్‌టాక్‌ వివరించింది. ఇప్పటికే ఫేస్ బుక్, గూగుల్ వంటి సంస్థలు విరాళాలు ప్రకటించాయి. దీంతో టిక్ టాక్ భారీ విరాలన్ని దేశానికి అందించడానికి ముందుకు రావడం స్వాగతించాల్సిన విషయం.