టిక్ టాక్ వ్యసనానికి యువతి బలి

చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ కు భారత్ లోనే అత్యధిక యూజర్లు ఉన్నారు. టిక్ టాక్.. కొందరిలోని టాలెంట్ ను బయటికి తీసుకొస్తుండగా మరికొందరినీ బలి తీసుకుంటోంది. టిక్ టాక్ వ్యసనం నిత్యం ఏదో ఒక వివాదాన్ని తెరలేపుతూనే ఉంది. భార్యభర్తల మధ్య గొడవలకు.. చివరికీ విడాకులకు కారణమవుతోంది. తమ వీడియోలకు ఎక్కువ లైకులు రావడంలేదని కొందరు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు గతంలో వెలుగుచూశాయి. వివాహేతర సంబంధాలకు కూడా టిక్ టాక్ కారణమవడంతోపాటు హత్యలకు దారితీసిన […]

Written By: Neelambaram, Updated On : May 29, 2020 2:25 pm
Follow us on


చైనాకు చెందిన టిక్ టాక్ యాప్ కు భారత్ లోనే అత్యధిక యూజర్లు ఉన్నారు. టిక్ టాక్.. కొందరిలోని టాలెంట్ ను బయటికి తీసుకొస్తుండగా మరికొందరినీ బలి తీసుకుంటోంది. టిక్ టాక్ వ్యసనం నిత్యం ఏదో ఒక వివాదాన్ని తెరలేపుతూనే ఉంది. భార్యభర్తల మధ్య గొడవలకు.. చివరికీ విడాకులకు కారణమవుతోంది. తమ వీడియోలకు ఎక్కువ లైకులు రావడంలేదని కొందరు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు గతంలో వెలుగుచూశాయి. వివాహేతర సంబంధాలకు కూడా టిక్ టాక్ కారణమవడంతోపాటు హత్యలకు దారితీసిన సంఘటనలు కూడా అనేకం ఉన్నాయి. అదేవిధంగా అశ్లీల వీడియోలకు ఇటీవల కాలంలో టిక్ టాక్ కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తుంది. దీంతో టిక్ టాక్ పై అనేక కేసులు నమోదవుతున్న సంగతి తెల్సిందే. ఒకనొక సమయంలో భారత్ టిక్ టాక్ యాప్ ను బ్యాన్ చేస్తుందనే ప్రచారం జరిగింది. అయితే సుప్రీం కోర్టులో టిక్ టాక్ కు అనుకూలంగా తీర్పు రావడంతో మళ్లీ టిక్ టాక్ కొనసాగుతుంది.

తాజాగా హైదరాబాద్ కు చెందిన ఓ యువతీ టిక్ టాక్ వ్యసనానికి బలవడం శోచనీయంగా మారింది. రామంతాపూర్ ప్రాంతానికి చెందిన 17ఏళ్ల యువతి టిక్ టాక్ కు బానిసైంది. నిత్యం టిక్ టాక్ లు చేస్తూ నిత్యం ఫోన్ తోనే ఎక్కువ సమయం గడిపేస్తుంది. దీంతో ఆ యువతి తల్లి సదరు యువతిని మందలించడంతో మనస్థాపం చెంది ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనపై యువతీ తల్లి ఫిర్యాదు మేరకు ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టిక్ టాక్ మోజులో కొందరు ప్రాణాలను తీసుకుంటుండటం ఆందోళనను కలిగిస్తుంది. టిక్ టాక్, సోషల్ మీడియాల యాప్ లకు యువతీయువకులు వీలైనంత దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటిని అవసరమైనంత వరకే ఉపయోగించుకోవాలని కోరుతున్నారు.