తెరపైకి ‘పింక్ డైమండ్’ వివాదం..

టిటిడి ఆస్తుల వేలానికి స్వస్థి పలికిన ప్రభుత్వం ఈ అంశాన్ని రచ్చ చేసిన ప్రధాన ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహ రచన చేసిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ వ్యవహారంలోను టీటీడీ కేంద్ర బింధువుగా కానుంది. టిటిడి ఆస్తుల వివరాలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని అధికారులను పాలక మండలి ఆదేశించింది. ఈ నిర్ణయం వెనుక పరోక్షంగా పింక్ డైమండ్ గురించి తెరపైకి తీసుకువచ్చారనేది స్పష్టం అవుతుంది. టీడీపీ ప్రభుత్వ హయాంలో పింక్ డైమండ్ పై […]

Written By: Neelambaram, Updated On : May 29, 2020 2:09 pm
Follow us on


టిటిడి ఆస్తుల వేలానికి స్వస్థి పలికిన ప్రభుత్వం ఈ అంశాన్ని రచ్చ చేసిన ప్రధాన ప్రతిపక్షాన్ని ఇరుకున పెట్టేందుకు వ్యూహ రచన చేసిందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఈ వ్యవహారంలోను టీటీడీ కేంద్ర బింధువుగా కానుంది. టిటిడి ఆస్తుల వివరాలకు సంబంధించి శ్వేతపత్రం విడుదల చేయాలని అధికారులను పాలక మండలి ఆదేశించింది. ఈ నిర్ణయం వెనుక పరోక్షంగా పింక్ డైమండ్ గురించి తెరపైకి తీసుకువచ్చారనేది స్పష్టం అవుతుంది.

టీడీపీ ప్రభుత్వ హయాంలో పింక్ డైమండ్ పై పెద్ద దుమారమే రేగింది. శ్రీవారికి మైసూర్ మహారాజు ఈ పింక్ డైమండ్ ను కానుకగా సమర్పించారని, అయితే ఆ వజ్రాన్ని దేశం దాటించారని అప్పట్లో రమణ దీక్షితులు తీవ్ర ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ విచారణకు డిమాండ్ చేసింది. అప్పటి టిటిడి అధికారులు, విశ్రాంత అధికారులు ఎవరి వాదనలు వారు వెల్లడించారు. చివరికి టిటిడి అధికారులు శ్రీవారి ఆభరణాల జాబితాలో పింక్ డైమండ్ లేదని ప్రకటించి వివాదానికి ముగింపు పలికారు. ఇది ఎంత వరకూ వాస్తవం అనే సందేహం ఇప్పటికి ఎంతో మందిని వెంటాడుతుంది.

ప్రపంచంలో అత్యధిక ఆదాయం కలిగిన దేవస్థానం అయిన తిరుమల తిరుపతిలో స్వామివారి ఆభరణాల సంరక్షణ లోపాలు ఎన్నో ఉన్నాయి. ఎంతో మంది భక్తులు వారి మొక్కులు తీర్చుకొనేందుకు స్వామివారికి బంగారు ఆభరణాలను సమర్పిస్తారు.స్వామి వారి ఆభరణాలపై నిర్ణిత కాలానికి ఆడిట్ నిర్వహించాల్సి ఉన్నా అది జరగడం లేదు. పింక్ డైమండ్ వ్యవహారం వెలుగులోకి వచ్చినప్పుడు స్వామి వారి ఆభరణాలపై ఆడిట్ నిర్వహించాలనే డిమాండ్ వచ్చినా అప్పటి ప్రభుత్వం పట్టించుకోలేదు.

మరోవైపు పింక్ డైమండ్ విషయాన్ని తేల్చాలని బీజేపీ స్థానిక నాయకులు డిమాండ్ చేస్తున్నారు. భూముల వేలం నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని అభినందించిన జనసేన నాయకులు నాగబాబు పింక్ డైమండ్ గురించి కూడా ఎంక్వైరీ చేసి నిజాలను నిగ్గుతేల్చాలని కోరుతూ ట్వీట్ చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన అనంతరం పింక్ డైమండ్ ఇప్పుడే తెరపైకి వచ్చింది.. భవిష్యత్ లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో వేచి చూడాలి.