https://oktelugu.com/

పెద్దపులిని కూడా వదలని కరోనా!

చైనాలోని సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. ఈ మహమ్మరి ఇప్పటివరకు మనుషులకు మాత్రమే సోకింది. తాజాగా జంతువుల్లోనూ కరోనా సోకుతున్నట్లు నిర్ధారణ అయింది. ఏకంగా కరోనా బారిన పెద్దపులి పడటం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలో ఇప్పటివరకు 12లక్షల70వేలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా 69వేలమంది మృతిచెందారు. ప్రస్తుతం కరోనా దాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిలాడుతుంది. అమెరికాలో 3లక్షల కరోనా కేసులు నమోదుగా ఒక్క న్యూయార్క్ లోనే లక్ష పాజిటివ్ కేసులు దాటాయి. న్యూయార్క్ లోని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : April 6, 2020 / 01:46 PM IST
    Follow us on


    చైనాలోని సోకిన కరోనా వైరస్ ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తోంది. ఈ మహమ్మరి ఇప్పటివరకు మనుషులకు మాత్రమే సోకింది. తాజాగా జంతువుల్లోనూ కరోనా సోకుతున్నట్లు నిర్ధారణ అయింది. ఏకంగా కరోనా బారిన పెద్దపులి పడటం చర్చనీయాంశంగా మారింది. ప్రపంచంలో ఇప్పటివరకు 12లక్షల70వేలకు పైగా కరోనా కేసులు నమోదుకాగా 69వేలమంది మృతిచెందారు. ప్రస్తుతం కరోనా దాటికి అగ్రరాజ్యం అమెరికా విలవిలాడుతుంది. అమెరికాలో 3లక్షల కరోనా కేసులు నమోదుగా ఒక్క న్యూయార్క్ లోనే లక్ష పాజిటివ్ కేసులు దాటాయి.

    న్యూయార్క్ లోని బ్రోంక్స్ జూలోని పెద్దపులికి కరోనా సోకింది. మలయన్ జాతికి చెందిన 4 ఏళ్ల ‘నదియా’ అనే ఆడ పులికి ఈ వైరస్ సోకినట్లు వైల్డ్‌లైఫ్ కన్జర్వేషన్ సొసైటీ అధికారులు పేర్కొన్నారు. ఈ నదియా దగ్గుతో బాధపడుతండటం చూసి అనుమానంతో టెస్టులు చేయగా కరోనా పాజిటివ్ వచ్చినట్లు తేలింది. ఈ జూలోని మరో మూడు పులులు, మూడు ఆఫ్రికన్ సింహాలకు కూడా ఈ లక్షణాలు ఉన్నట్లు వారు గుర్తించారు.

    కరోనా సోకిన పులులు, సింహాలు ఇప్పటికైతే బాగానే ఉన్నాయని.. అయితే తినడం బాగా తగ్గించినట్లు జూ అధికారులు తెలిపారు. జంతువుల ఆలనాపాలనా చూసే జూ ఉద్యోగి నుంచి వీటికి కరోనా సోకినట్లు అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. న్యూయార్క్ లో వైరస్ వ్యాప్తి ఎక్కవగా ఉండటంతో బ్రోంక్స్ జూను మార్చి 16నుంచి మూసివేసినట్లు జూ అధికారులు తెలిపారు. జంతువులు కూడా కరోనా బారిన పడుతాయని అయితే వాటి నుంచి మనుషులు సోకడం తక్కవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.