
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలో నల్లమల అడవిలో రవాణా సౌకర్యం లేని చెంచు గూడేల లోని చెంచు కుటుంబాలకు పచ్చళ్ళు అందజేస్తున్నారు. ప్రతి కుటుంబానికి 500 గ్రాముల టమోటా, 500 గ్రాముల మామిడి పచ్చడి ని సరఫరా చేస్తున్నారు. యర్రగొండపాలెం లో విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ క్యాంప్ కార్యాలయం లో వీటిని పంపిణీ చేశారు. గూడేల్లో తిరిగి అన్ని కుటుంబాలకు వీటిని పంపిణీ చేస్తామని మంత్రి సురేష్ కు అధికారులు తెలిపారు. గిరిజనులు ఆకలితో ఇబ్బంది పడకూడదని, ఇంకా అవసరమైన ఆహార పదార్దాలు సరఫరాకు చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు.
యర్రగొండపాలెం నియోజకవర్గం పరిధిలోని 5 మండలాల్లో (యర్రగొండపాలెం, పుల్లలచెరువు, త్రిపురాంతకం, పెద్దారవీడు, పెద్ద దోర్నాల) మొత్తం 130 మంది ప్రింట్ & ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఒక్కొక్కరికి 25 కిలోల బియ్యం, 2 కిలోల కందిపప్పు, 1కిలో చెక్కర, 1లీటర్ నూనె అందజేశారు. జర్నలిస్టుల సమస్యల పరిస్కారంలో ముందుంటానని మంత్రి హామీ ఇచ్చారు. యర్రగొండపాలెం లో ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు స్థలం కేటాయింపుతో పాటు భవన నిర్మాణానికి అవసరమైన నిధులు కూడా మంజూరు కు కృషి చేస్తామని మంత్రి చెప్పారు.
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ సోమవారం పర్యటించారు. పారిశుధ్య కార్మికులకు గ్లౌజు లు, మాస్కులు, శానిటైజర్ లను పంపిణీ చేశారు. కూరగాయల అమ్మకాలు, ధరల వివరాలు పరిశీలించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం అన్ని విధాలా చర్యలు తీసుకుంటుందన్నారు.