Pradhan Mantri Vishwakarma Yojana Scheme : ప్రస్తుత కాలంలో ఉద్యోగాలు చేసేందుకు కొంత మంది ఆసక్తి చూపడం లేదు. ఒకరి కింద పని చేయడం కంటే సొంతంగా ఏదైనా వ్యాపారం చేయాలని చూస్తున్నారు. తమ ఆలోచనలను పెట్టుబడిగా పెట్టి అధిక డబ్బు సంపాదించాలనే ఆలోచన ఉన్న వారికి వ్యాపారమే బెస్ట్ ఆప్షన్ అని కొందరు ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. అయితే కొందరి వ్యాపారం చేయాలని ఉత్సాహం ఉన్నా అందుకు కావాల్సిన ఆదాయం ఉండదు. ఒక వేళ ఎవరిదగ్గరైనా అప్పు తీసుకుంటే వడ్డీ భారం అవుతుంది. అయితే బ్యాంకు రుణం తీసుకున్నా.. కనీస వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. కానీ 0.40 పైసల వడ్డీతో రూ. 3 లక్షలు పొందే సదుపాయం ఉంది. ఈ రుణం కేవలం నైపుణ్యం ఉంటే చాలు.. ఆ వివరాల్లోకి వెళితే..
కేంద్ర ప్రభుత్వం కొన్ని వర్గాలను ప్రోత్సహించడానికి వారికి తక్కువ వడ్డీకే రుణం ఇవ్వాలని నిర్ణయించింది. ముఖ్యంగా చేతి వృత్తుల వారికి సహకరించాలని అనుకుంది. ఈ నేపథ్యంలో ‘ప్రధానమంత్రి విశ్వ కర్మ యోజన’ అనే పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. 2023 సెప్టెంబర్ 17న రూ.13 వేల కోట్ల రూపాయలతో ప్రారంభించిన ఈ పథకంతో చేనేత కళాకారులకు, కుటుంబ ఆధారిత పరిశ్రమల్లో పనిచేసేవారికి ప్రయోజనం కలగనుంది. 18 ఏళ్ల యవసు నిండిన వారు సాంప్రదాయ వ్యాపారంలో నైపుణ్యం కలిగిన ఎవరైనా ఈ రుణం తీసుకోవడానికి అర్హులు.
ప్రధానమంత్రి విశ్వకర్మ యోజన పథకం ద్వారా రుణం తీసుకొని చేతివృత్తులకు సంబంధించిన వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు. ఈ పరిశ్రమ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం రూ. 3 లక్ష రుణసాయం చేస్తుంది ఈ రుణంపై కేవలం 0.40 పైసల వడ్డీని మాత్రమే విధిస్తారు. అంతేకాకుండా ఎటువంటి చేతి వృత్తుల్లో నైపుణ్యం ఉందో అందుకు సంబంధించి రూ. 15 వేల టూల్ కిట్ ను ఉచితంగా ఇస్తారు. ఆయా రంగాల వారిరి కొన్ని రోజుల పాటు శిక్షణ ఇచ్చి రుణం మంజూరు చేస్తారు.
ఈ పథకంలో 18 రకాల చేతి వృత్తులను చేర్చారు. వీటిలో వడ్రంగులు, స్వర్ణ కారులు, కుమ్మరి, శిల్పులు, రాతి పని చేసేవారు, చీపుర్లు అల్లేవారు, సాంప్రదాయమైన బొమ్మలు తయారు చేసేవారు, క్షురకులు, తాళ్లు అల్లేవారు, లాండ్రీ, టైలర్, చేపల వలలు తయారు చేసేవారు, సుత్తి, పనిముట్లు తయారు చేసేవరు, తాళాలు తయారు చేసేవారు, తాపి పనివారు, పూలదండలు తయారు చేసేవారితో పాటు మరో రెండు చేతి వృత్తులకు ఈ ప్రయోజనం కలగనుంది.
ఈ పథకంను ముందుగా ఏడాదికి 5 లక్షల మందికి ప్రయోజనం చేసేలా రూపకల్పణ చేశారు. మొత్తం 30 లక్షల కుటుంబాలకు లబ్ది చేకూరనున్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు. అయితే విశ్వకర్మ యోజన పథకం వెబ్ సైట్ ప్రకారం దీనిని ప్రారంభించిన ఇప్పటివరకు 2.52 కోట్ల దరఖాస్తులు వచ్చాయి. వీటిలో 1.44 కోట్లు వెరిఫికేషన్ పూర్తయ్యాయి. 42 లక్షలు రెండో దశ సర్వే కూడా పూర్తి చేశారు. 22.27 లక్షల మంది ఈ పథకం ప్రయోజనం పొందారు.
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.
Read MoreWeb Title: Through the pm vishwakarma yojana scheme a loan of rs 3 lakh can be taken at an interest rate of 0 40 paisa to start a business related to handicrafts
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com