https://oktelugu.com/

ఏపీ అధికార పార్టీ నేతల్లో ‘మూడేళ్ల’ భయం..!

ఏపీ అధికార పార్టీ నాయకుల్లో ఇప్పుడో కొత్త భయం పట్టుకొంది. పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్ల గడువు సమీపిస్తున్న తరుణంలో సంబరాలు చేసుకోవాల్సిందిపోయి టెన్షన్ పడుతున్నారట. ముఖ్యంగా మంత్రి పదవిలో కొనసాగే వారికి మీర భయాందోళన చెందుతున్నారట. ఎందుకంటే తమ పదవి ఉంటుందో..? లేదో..? అని మదన పడుతున్నారట. అదేంటి..? మూడేళ్లయితే మంత్రి పదవి పోతుందా..? అనే అనుమానం రావచ్చు. కానీ కొందరు మంత్రుల్లో ఆ ఫోబియా పట్టుకుందట. అసలు విషయం ఏమిటంటే..? 2019 అధికారంలోకి వచ్చిన […]

Written By:
  • NARESH
  • , Updated On : July 24, 2021 / 10:09 AM IST
    Follow us on

    ఏపీ అధికార పార్టీ నాయకుల్లో ఇప్పుడో కొత్త భయం పట్టుకొంది. పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్ల గడువు సమీపిస్తున్న తరుణంలో సంబరాలు చేసుకోవాల్సిందిపోయి టెన్షన్ పడుతున్నారట. ముఖ్యంగా మంత్రి పదవిలో కొనసాగే వారికి మీర భయాందోళన చెందుతున్నారట. ఎందుకంటే తమ పదవి ఉంటుందో..? లేదో..? అని మదన పడుతున్నారట. అదేంటి..? మూడేళ్లయితే మంత్రి పదవి పోతుందా..? అనే అనుమానం రావచ్చు. కానీ కొందరు మంత్రుల్లో ఆ ఫోబియా పట్టుకుందట. అసలు విషయం ఏమిటంటే..?

    2019 అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం రెండున్నరేళ్లు పూర్తి చేసుకొని మూడో సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. ఈ సందర్భంగా మంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో జగన్ అన్న మాటలను గుర్తు చేసుకుంటున్నారు. ఆ సమయంలో జగన్ మూడేళ్ల తరువాత పాత మంత్రుల స్థానంలో కొత్త మంత్రులు వస్తారని.. అందరికీ సముచిత న్యాయం చేస్తానని అన్నారు. ఆ సమయంలో కేబినేట్లోకి వచ్చిన వారు హర్షం వ్యక్తం చేయగా.. రాని వారు ఈ మూడేళ్ల కాలం ఎప్పుడు పూర్తవుతుందా..? అని ఎదురుచూస్తున్నారు.

    ఈ నేపథ్యంలో మూడేళ్లలో జగన్ మంత్రివర్గ విస్తరణ చేపట్టి పాత వాళ్లలో కొందరిని తొలగిస్తారనే భయం పట్టుకుంది. దీంతో కొందరు మంత్రులు పార్టీ అధినేతను ప్రసన్నం చేసుకోవడానికి వివిధ ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రులు ప్రత్యేకంగా జగన్ కు చేయాల్సిందే ఏమీ ఉండదు.. ఆయనను పొగిడి ..ప్రతిపక్షాలను తిడితే జగన్ ను ప్రసన్నం చేసుకున్నట్లేనని కొందరు భావిస్తున్నారు. అందులో భాగంగా కొందరు ఇప్పటికే ఆ ప్రయత్నాలు చేసి జగన్ చేత ప్రశంసలు తెప్పించుకున్నారు.

    ఇంకొందరు తమ పదవిని కాపాడుకోవడానికి అవకాశం వచ్చినప్పుడల్లా జగన్ పై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. కొందరు నాయకలు జగన్ 30 ఏళ్లుగా సీఎంగా ఉంటారంటుండగా.. ఇంకొందరు జగన్ ప్రధాని అయ్యే అర్హత ఉందని అంటున్నారు. ఇదిలా ఉండగా ఇప్పుడున్న మంత్రుల పదవీ కాలం కరోనాతోనే గడిచిపోయింది. ఈ కాలంలో తాము మంత్రులుగా అనుభవించింది ఏమీ లేదని నిరాశపడుతున్నారు. ఈ సమయంలో తమ మంత్రి పదవి పోతే ఎలా..? అని భయపడుతున్నారట.