విడుదల చేసింది. గ్రామంలోనే ఉంటూ ప్రభుత్వ ఉద్యోగం చేయాలని భావించే వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం పశ్చిమ బెంగాల్ సర్కిల్ లో ఈ ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. అర్హతకు తగిన వేతనం లభిస్తుండటంతో నిరుద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది.
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 2,357 ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని సమాచారం. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వారిలో బ్రాంచ్ మాస్టర్ పోస్టు ఉద్యోగ ఖాళీలకు వేతనం 12,000 రూపాయలు కాగా మిగిలిన ఉద్యోగ ఖాళీలకు వేతనం 10,000 రూపాయలుగా ఉంది. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగ ఖాళీలతో పాటు డాక్ సేవక్ అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఉద్యోగ ఖాళీల భర్తీ జరగనుందని తెలుస్తోంది.
కంప్యూటర్ సబ్జెక్ట్ గా ఉన్నవాళ్లు బేసిక్ కంప్యూటర్ నాలెడ్ సర్టిఫికెట్ ను సబ్మిట్ చేయకుండానే ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్ సబ్జెక్ట్ గా లేని వాళ్లు మాత్రం కంప్యూటర్ కోర్సుకు సంబంధించిన ధృవపత్రాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. 18 నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీల కొరకు దరఖాస్తు చేసుకోవాలి. రిజర్వేషన్లను బట్టి వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.
ఆగష్టు 19వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది. https://appost.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడంతో వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం అయితే ఉంటుంది.