ఆకర్షించే అందమెందుకు.. అర్థం చేసుకునే మనసు లేనప్పుడు యువత అందానికి ఆకర్షితులవుతున్నారు. అదే జీవితమనుకుని తప్పటడుగులు వేస్తున్నారు. అందమనే బంధంలో ఇరుక్కుని జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. నూరేళ్ల జీవితాన్ని పాతికేళ్లకు కూడా చాలిస్తున్నారు. నిండు నూరేళ్లు ఉండాల్సిన సమయంలో తప్పుదారి పట్టి దారి తప్పుతున్నారు. తాజాగా గుజరాత్ రాష్ర్టంలోని సూరత్ పట్టణంలోని బెస్తాన్ ఏరియాలో ఓ సంఘటన చోటుచేసుకుంది. స్థానిక కాలనీకి చెందిన మహ్మద్ సాజిద్ జారా అనే కుర్రాడు ఓ బాలికను వెంటపడి వేధించసాగాడు. ప్రేమిస్తున్నానని చెప్పి నిత్యం వెంట తిరుగుతుండే వాడు. దీంతో ఆ బాలిక అతని ప్రేమలో పడింది.
నిత్యం ద్విచక్రవాహనంపై తిరుగుతూ ఉండేవారు. కొన్నాళ్లపాటు పెద్దలకు తెలియకుండా ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో ఓ రోజు వీరి ప్రేమ విషయం అమ్మాయి తండ్రికి తెలిసింది. దీంతో అతడు మందలించాడు. కానీ ఆ అమ్మాయి మాత్రం తాను అతడిని ప్రేమిస్తున్నానని తెగేసి చెప్పింది. ఈ నేపథ్యంలో నీ వయసేంటి నువు మాట్లాడే మాటలేంటి అని తండ్రి అమ్మాయిని నిలదీశాడు. చివరికి ఇరు కుటుంబాల వారు పెళ్లికి ఒప్పుకున్నారు. రెండు కుటుంబాలు పెళ్లికి అంగీకారం తెలపడంతో పెళ్లి చేయాలని అనుకున్నారు.
దీంతో సాజిద్ అమ్మాయిని తన ప్లాట్ కు తీసుకెళ్లాడు. ఇంట్లో ఎవరు లేని సమయం చూసి ఆమెను వశపరుచుకున్నాడు. అప్పటికే ఆమెను ఏడాది కాలంలో రెండు సార్లు అఘాయిత్యం చేశాడు. దీంతో మూడో సారి కూడా అలాగే చేయడంతో త్వరలో పెళ్లి చేసుకోబోతున్నా ఇదేంటని ప్రశ్నించినా వినకుండా చేయడంతో ఆమెకు నచ్చలేదు పెళ్లికి ముందే ఇలా చేస్తే పెళ్లయిన తరువాత నా మాట వింటాడా అనే అనుమానం వ్యక్తం చేసింది.
తండ్రికి జరిగింది చెప్పింది. పెళ్లికి ముందే మూడుసార్లు రేప్ చేశాడని తెలియడంతో ఆగ్రహంతో రగిలిపోయాడు తండ్రి. నాకు మొదటినుంచి ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పినా నువ్వు ప్రేమించానని చెప్పడంతో ఒప్పుకున్నానని చెప్పాడు. దీంతో వాన్ని వదిలేది లేదని అత్వా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు రాసి సాజిద్ ను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తు చేసి కేసుపై ముందుకెళ్తామని చెప్పారు. ఇందులో మరో కోణం ఏంటంటే సాజిద్ అమ్మాయి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటున్నాడని తెలిసింది.