షకీలా అంటే ఇప్పుడు షేప్ అవుట్ అయి ఫేడ్ అవుట్ అయింది గాని, ఒకప్పుడు దక్షిణ భారత దేశానికే ఆమె కలల శృంగార తార. బోల్డ్ ప్రపంచంలో ఎనలేని కీర్తి ప్రతిష్టలతో ప్రేక్షక లోకాన్ని తనదైన అందచందాలతో ఎప్పటికప్పుడు ఉహల మైకంలో విహరింప జేస్తూ ఎంతగానో అలరించింది. అయితే, కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు కదా, వయసు పెరిగేకొద్దీ ఆమె వైభవం కూడా తగ్గిపోతూ వచ్చింది.
1990వ కాలంలో స్టార్ హీరోలకు సమానంగా క్రేజ్ అండ్ స్టార్ డమ్ సంపాదించుకున్న షకీలా త్వరలోనే డిజిటల్ ఎంట్రీకి అన్ని రకాలుగా సిద్ధమవుంతుంది. అందుకుగానూ తానే సొంతంగా ఓ ఓటీటీ ప్లాట్ ఫామ్ రెడీ చేసుకుంది. తన ఓటీటీ ప్లాట్ ఫామ్ ద్వారా తన చిత్రాలతో పాటు ఇతర బోల్డ్ సినిమాలను కూడా రిలీజ్ చేస్తానని.. తనలాంటి నటీమణులకు అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తానని షకీలా చెప్పుకొచ్చింది.
అన్నట్టు షకీలా తన కూతురుని కూడా హీరోయిన్ గా పరిచయం చేయబోతుంది. కూతురు అంటే పెంచుకున్న కూతురు లేండి. మరి షకీలా పెంపకంలో పెరిగింది కాబట్టి, బోల్డ్ రోల్స్ లో ఎలా జీవించాలో ఆమె ఆరితేరిపోయి ఉంటుంది. అందుకే, షకీలా తన కూతురు హీరోయిన్ గా ఏకంగా రెండు ప్రాజెక్టులను అధికారికంగా అనౌన్స్ చేయడంతో పాటు పోస్టర్లను కూడా రిలీజ్ చేసి బాగా హడావిడి చేసింది.
రామానాయుడు స్టూడియోస్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో షకీలా మాట్లాడుతూ.. ‘దర్శకుడు రమేష్ కావలి చెప్పిన స్క్రిప్ట్ తనకు బాగా నచ్చాయని, అందుకే అతని దర్శకత్వంలో సినిమా చేస్తున్నానని, గోవాలో అద్భుతమైన లొకేషన్లలో మా సినిమా షూటింగ్ చేస్తున్నామని… ఇలా మొత్తానికి తన కొత్త సినిమా గురించి కొత్త కబుర్లు చెప్పుకొచ్చింది షకీలా. మరి షకీలా ఓటీటీ వచ్చేస్తుంది కాబట్టి, ఇక బోల్డ్ నెస్ కి పట్టాభిషేకమే అనుకోవాలి. అయితే షకీలాకి కనీసం ఓటీటీలో నైనా మంచి లాభాలు వస్తాయా !