Delhi Elections 2025 :ఇప్పుడు కొనసాగుతున్న ట్రెండ్ ప్రకారం బిజెపి నాయకులు పూర్తిస్థాయిలో విజయం సాధిస్తే.. కచ్చితంగా ఢిల్లీ పీఠంపై కమలం జెండా ఎగురుతుంది. ఆ ప్రకారం చూసుకుంటే కాబోయే ముఖ్యమంత్రి ఎవరు? అనే చర్చ ప్రస్తుతం దేశ రాజకీయాలలో నడుస్తోంది.. జాతీయ మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఢిల్లీ ముఖ్యమంత్రి రేసులో ముగ్గురు పేర్లు వినిపిస్తున్నాయి.. ప్రస్తుతం ఢిల్లీ బిజెపి అధ్యక్షుడిగా వీరేంద్ర సచ్ దేవా ఉన్నారు. ముఖ్యమంత్రి పదవిలో ఆయన ముందు వరుసలో ఉన్నారు.. పార్లమెంట్ సభ్యుడు మనోజ్ తివారి, ప్రవేశ్ వర్మ, రమేష్ బిదూడీ వంటి వారు ముఖ్యమంత్రి పదవి రేసులో ఉన్నారు.. ఇటీవల జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. ఒకవేళ బిజెపి కనుక అధికారంలోకి వస్తే కాబోయే ముఖ్యమంత్రి అభ్యర్థి రమేష్ బిదూడీ అని చెప్పడం విశేషం.. అయితే ఈసారి జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నాయకులు తీవ్రంగా శ్రమించారు. ఆప్ పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేశారు. ఇందులో విజయవంతమయ్యారు కూడా. ఇప్పటికే ఢిల్లీ అసెంబ్లీ రాష్ట్రాన్ని ఆప్ గత మూడు పర్యాయాలు పరిపాలించింది. మరోవైపు సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఈసారైనా ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగరవేయాలని బిజెపి నాయకులు తీవ్రంగా శ్రమించారు. అయితే ఫలితాలు బిజెపికి అనుకూలంగా ఉండడంతో ఆ పార్టీ నాయకులు సంబరాలు చేసుకుంటున్నారు. ఉత్సాహంగా టపాకులు కా
లుస్తున్నారు. వీరేంద్ర, మనోజ్, ప్రవేశ్ వర్మ, రమేష్ వంటి వారు రంగంలో ఉండడంతో.. బిజెపి అధిష్టానం ముఖ్యమంత్రిగా ఎవరిని ప్రకటిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.
ఉప ముఖ్యమంత్రులు ఎవరు?
బిజెపి అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ముఖ్యమంత్రి తో పాటు, ఇద్దరు ఉప ముఖ్యమంత్రులను నియమించడం ఆనవాయితీగా వస్తోంది. రాజస్థాన్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. ఇక్కడ ఇద్దరు ముఖ్యమంత్రులను నియమించింది.. ఇక ఇదే సమయంలో రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో కొన్ని ఉదంతాలు చోటుచేసుకున్నాయి. ఆ రాష్ట్రాలలో బిజెపి సీనియర్ నాయకురాలు గా ఉన్నవారిని ముఖ్యమంత్రులుగా నియమించలేదు. రాజస్థాన్ రాష్ట్రంలో వసుంధర రాజే, మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహన్ లను ముఖ్యమంత్రులుగా బిజెపి నియమించలేదు. ఒకవేళ ఇదే విధానం కనుక కొనసాగితే ఢిల్లీలో కూడా కొత్త వ్యక్తిని ముఖ్యమంత్రిగా నియమించి.. మనోజ్ తివారి, వీరేంద్ర సచ్ దేవా, ప్రవేశ వర్మ లో ఇద్దరిని డిప్యూటీ సీఎంలుగా నియమించే అవకాశం కనిపిస్తోంది. రమేష్ ను ముఖ్యమంత్రిని చేస్తారని ప్రచారం జరుగుతోంది..
ఢిల్లీలో 1993లో
ఢిల్లీలో 1993లో జరిగిన ఎన్నికల్లో బిజెపి అధికారంలోకి వచ్చింది. ఆసమ్యాల్లో అనేకమంది ముఖ్యమంత్రులను బిజెపి మార్చింది. 1998 ఎన్నికల్లో సుష్మ స్వరాజ్ తన కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేసి.. ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఢిల్లీలో మొదటి మహిళా ముఖ్యమంత్రి కూడా సుష్మా స్వరాజ్ కావడం విశేషం. ఒకవేళ ఇప్పుడు బిజెపి కనుక అధికారంలోకి వస్తే మహిళలకు అవకాశం ఇస్తుందని తెలుస్తోంది.. ముఖ్యమంత్రి పదవి రేసులో స్మృతి ఇరానీ, మీనాక్షి లేఖి, బన్సూరి స్వరాజ్ పేర్లను భారతీయ జనతా పార్టీ అధిష్టానం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.. అయితే వీరికి ప్రజల్లో విపరీతమైన క్రేజ్ ఉంది. వీరిలో ఎవరో ఒకరు ఢిల్లీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కనిపిస్తోందని జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి..