Homeఆంధ్రప్రదేశ్‌AP Three Capitals Bill: మళ్లీ సభ ముందుకు మూడు రాజధానుల బిల్లు? ఈసారి ఆమోదం...

AP Three Capitals Bill: మళ్లీ సభ ముందుకు మూడు రాజధానుల బిల్లు? ఈసారి ఆమోదం పక్కా?

AP Three Capitals Bill: ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల వ్యవహారం హాట్ టాపిక్ గా మారుతోంది. ఇప్పటికే పలు రకాలుగా పోరాటం చేసిన ప్రజలు ప్రభుత్వంపై పోరాటం చేసిన నేపథ్యంలో మూడు రాజధానుల విషయంలో ఇప్పుడు చర్చ మరో వైపుకు మళ్లనుందని తెలుస్తోంది. మూడు రాజధానుల విషయంలో ప్రజలు దాదాపు 800 రోజులకు పైగా నిరాహార దీక్షలు చేయడంతో హైకోర్టు తీర్పు వారికి ఊరటనిచ్చింది. కానీ ప్రభుత్వం మాత్రం ఇప్పటికి కూడా మూడు రాజధానులకే మొగ్గు చూపుతున్నట్లు చెప్పడంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది.

AP Three Capitals Bill:
Jagan

గత టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన అమరావతి రాజధాని విషయంలో వైసీపీ కక్ష్యసాధింపు చర్యలు తీసుకోవడం ఎంతవరకు సమంజసం అనే విమర్శలు వస్తున్నాయి. రాజధాని ప్రకటన తరువాత జరిగిన పరిణామాల్ో ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ ఎటువంటి ఆక్షేపణలు చేయకపోవడంతో అందరు ఒప్పుకున్నారని భావించారు. కానీ అధికారంలోకి వచ్చాక జగన్ మరోమారు తన వైఖరి స్పష్టం చేస్తూ మూడు రాజధానుల విషయం తెరమీదకు తెచ్చి అందరిని ఆశ్చర్యానికి ురి చేశారు.

Also Read: AP Cabinet Expansion: వైసీపీలో సగం మంది ఎమ్మెల్యేలకు నో టికెట్.. జగన్ ఏమన్నారంటే..?

శాసనసభ వేదికగా మరోమారు మూడు రాజధానుల విషయంలో క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈణెల 21న జరిగే అసెంబ్లీలో ప్రభుత్వం ఈ మేరకు ప్రకటన చేయనుందని చెబుతున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ కూడా ఈ విషయంలో చేసిన వ్యాఖ్యలతో ప్రభుత్వం ఏ వైఖరి అవలంభిస్తుందో తెలియడం లేదు. మూడు రాజధానుల అంశంలో న్యాయపరమైన చిక్కులు తొలగించుకునేందుకు ప్రభుత్వం ఎలాంటి ప్రయత్నం చేస్తారో తెలియడం లేదు.

AP Three Capitals Bill:
YS Jagan

ఒకే రాజధానికే మొగ్గు చూపాలని అన్ని పార్టీలు భావిస్తున్నా వైసీపీ మాత్రం తన వ్యూహం ఏంటో చెప్పడం లేదు. ఫలితంగా న్యాయస్థానం తీర్పుకు లోబడే ముందుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెబుతున్నారు. వైసీపీ మూడు రాజధానుల నినాదంతోనే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లు సమాచారం. టీడీపీ ఇప్పటికే స్పష్టం చేయడంతో వైసీపీ నిర్ణయం ఎలా ఉంటుందోననే సంశయాలు అందరిలో వస్తున్నాయి. బీజేపీ విధానం కూడా అమరావతి కావడంతో వైసీపీ ఎలా తట్టుకుని ముందుకు వెళ్తుందోనని అందరిలో అనుమానాలు వస్తున్నాయి.

Also Read: Anand Mahindra: గుజరాత్‌లో ప్రధాని పర్యటనపై ఆనంద్ మహీంద్రా ఇంట్రెస్టింగ్ ట్వీట్..

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular