‘సర్కారు వారి పాట’ మొదలైపోయింది !

సూపర్ స్టార్ మహేష్ బాబు – పరుశురామ్ కలయికలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా షూట్ ఈ రోజు నుండి మొదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం సోషల్ మీడియాలో మోషన్ వీడియో పోస్టర్ ను రిలీజ్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది. ముందుగా బ్యాంక్ సీన్స్ తో షూట్ మొదలవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే బ్యాంక్ సెట్ వర్క్ స్టార్ట్ అయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన సెంట్రల్ బ్యాంక్ కి […]

Written By: Neelambaram, Updated On : January 25, 2021 1:11 pm
Follow us on


సూపర్ స్టార్ మహేష్ బాబు – పరుశురామ్ కలయికలో రానున్న ‘సర్కారు వారి పాట’ సినిమా షూట్ ఈ రోజు నుండి మొదలైంది. ఈ సందర్భంగా చిత్రబృందం సోషల్ మీడియాలో మోషన్ వీడియో పోస్టర్ ను రిలీజ్ చేస్తూ అధికారికంగా ప్రకటించింది. ముందుగా బ్యాంక్ సీన్స్ తో షూట్ మొదలవుతుందని తెలుస్తోంది. ఇప్పటికే బ్యాంక్ సెట్ వర్క్ స్టార్ట్ అయింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఆర్ట్ డైరెక్టర్ తోట తరుణి ఆధ్వర్యంలో ప్రత్యేకమైన సెంట్రల్ బ్యాంక్ కి సంబంధించిన భారీ సెట్ ను నిర్మించారు. కాగా బ్యాంకు నేప‌థ్యంలో సాగే కీల‌క‌మైన ఎపిసోడ్ ఈ రోజు తీస్తున్నారు.

Also Read: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్.. రెండు కొత్త అప్ డేట్స్ !

ఇక ఈ సినిమాలో ఫాదర్ క్యారెక్టర్ చాల కీలకమైనదని, ఆ పాత్రలో బాలీవుడ్ స్టార్ అనిల్ కపూర్ ను తీసుకున్నారని.. మొదట అనిల్ ఒప్పుకోకపోయినా.. నమ్రతా బలవంతంతో అంగీకరించాడని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో మహేష్ ఒక బ్యాంక్ మేనేజర్ కొడుకుగా నటించబోతున్నాడు. అంటే తన తండ్రిని మోసం చేసి వేలాది కోట్ల ఎగవేసిన ఓ బిజినెస్ మెన్ నుండి ఆ డబ్బు మొత్తాన్ని తిరిగి రాబట్టడానికి మహేష్ ఎలాంటి ప్రయత్నాలు చేశాడనేది సినిమాలో మెయిన్ కంటెంట్ అట. అయితే ఈ సినిమా సీరియస్ టోన్ లో సాగకుండా కాస్త కామెడీ యాంగిల్ లోనే ఉంటుంది.

Also Read: వైరల్ అవుతోన్న ‘గ్యాంగ్’తో గ్యాంగ్ లీడ‌ర్ !

అనగా మహేష్ వేసే ప్లాన్స్ చుట్టూ వచ్చే సీన్స్ ఫుల్ ఎంటర్ టైన్ గా ఉంటాయి. మొత్తానికి భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ ఈ సినిమా కథ కేంద్రీకృతమైందని తెలుస్తోంది అలాగే ఈ సినిమాలో ఓ రొమాన్స్ ట్రాక్‌ కూడా ఉందని.. మహేష్ అభిమానులకు ఈ లవ్ స్టోరీ బాగా కనెక్ట్ అవుతుందని.. అన్నిటికి మించి చాలా కాలం తర్వాత మహేష్ ఈ సినిమాలో లవర్ బాయ్‌ గా కనిపించబోతున్నాడని ఫిల్మ్ నగర్ టాక్. కాగా ఈ లవర్ బాయ్ లుక్ కోసమే, మహేష్ తన హెయిర్ స్టైల్ ను కూడా కొత్తగా మార్చుకున్నాడు. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ మూవీని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్