
కరోనా వ్యాప్తి కారణంగా మాస్క్ లేకుండా రోడ్లపైకి వచ్చే వారికి రూ.1000 జరిమానా విధిస్తున్నట్లు ప్రభుత్వం గతలోనే ప్రకటించాయి. ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ, పోలీసులు రంగంలోకి దిగారు. మాస్క్ ధరించకుండా ఇళ్ల నుంచి బయటకు వచ్చే వారిని గుర్తించి రూ.1000 పెనాల్టీ విధిస్తున్నారు. పీజేఆర్ నగర్, రాజీవ్‌నగర్ లో మాస్క్ లేకుండా కూరగాయల మార్కెట్ లో విక్రయాలు సాగిస్తోన్న వ్యక్తులకూ రూ.1000 చొప్పున పెనాల్టీ వేశారు. ఇప్పటి వరకు 50 మందికి పైగా జరిమానా విధించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
వరంగల్ పట్టణంలో కూడా మాస్క్ ధరించని పలువురిపై మున్సిపల్ అధికారులు ఫైన్ విధించారు. శివశంకర్ సెల్ పాయింట్ షాపుకు అధిక సంఖ్యలో వచ్చిన ప్రజలు భౌతిక దూరం పాటించలేదు. పైగా మాస్కులు లేకుండా యదేచ్ఛగా షాపుకు వచ్చారు. దీంతో మాస్క్ ధరించకుండా ఉన్నందుకు పరకాల మున్సిపల్ అధికారులు వారికి రూ.2వేల ఫైన్ ను విధించారు.