https://oktelugu.com/

జగన్ ను వీడి.. నిండా మునిగి..

జగన్ ను మోసం చేసిన పాపానికి ఆ 23 మంది వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు అనుభవిస్తున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు నాడు టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన బిస్కెట్లకు ఆశపడి అధికార పార్టీలో చేరారు. కొందరికీ చంద్రబాబు ఏకంగా మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. అయితే నాడు జగన్ ను మోసం చేసిన వెళ్లిన అఖిలప్రియ మంత్రి కాగా.. ఇప్పుడు కేసులతో జైలుకెళ్లిన పరిస్థితి. మరికొంత […]

Written By:
  • NARESH
  • , Updated On : May 27, 2021 6:35 pm
    Follow us on

    జగన్ ను మోసం చేసిన పాపానికి ఆ 23 మంది వైసీపీ నుంచి గెలిచి టీడీపీలోకి వెళ్లిపోయిన ఎమ్మెల్యేలు అనుభవిస్తున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరుఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలు నాడు టీడీపీ అధినేత చంద్రబాబు వేసిన బిస్కెట్లకు ఆశపడి అధికార పార్టీలో చేరారు. కొందరికీ చంద్రబాబు ఏకంగా మంత్రి పదవి కూడా కట్టబెట్టారు. అయితే నాడు జగన్ ను మోసం చేసిన వెళ్లిన అఖిలప్రియ మంత్రి కాగా.. ఇప్పుడు కేసులతో జైలుకెళ్లిన పరిస్థితి. మరికొంత మందిది అదే గతి. అందుకే జగన్ ను చీట్ చేసిన ఎమ్మెల్యేలంతా ఇప్పుడు ‘జగన్ తో ఉంటే బాగుండేది’ అని వాపోతున్న పరిస్థితి ఉంది.

    జగన్ ను వదిలి టీడీపీలో చేరిన ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఇప్పుడు టీడీపీలో ఉండి బాధపడుతున్నాడు. టీడీపీలో వీరంతా ఓడిపోయారు. చంద్రబాబు ప్రలోభాలకు లొంగి ఇప్పుడు రాజకీయ జీవితం సమాధి చేసుకున్నారు. అధికారం ఉందని ఎమ్మెల్యేలు జంప్ అయిపోయారు. ఉన్నన్ని రోజులు బాగానే సంపాదించుకున్నారు. కానీ ఇప్పుడు 2019 ఎన్నికల్లో ఓడిపోయి జగన్ ధాటికి రాజకీయ భవిష్యత్ లేకుండా కనుమరుగైపోతున్న పరిస్థితి నెలకొంది.

    ఇక టీడీపీలోకి 23 మందిని చంద్రబాబు చివరి నిమిషంలో దెబ్బకొట్టారు. వారికి టికెట్లు ఇవ్వలేదు. అయితే వారంతా వైసీపీలోకి వచ్చినా జగన్ టికెట్ ఇవ్వలేదు. ఇప్పుడు వైసీపీలోనూ వారు ఎవరికి కాకుండా పోయారు.

    వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఒక్క గొట్టిపాటి రవికుమార్ మాత్రమే మళ్లీ అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. మిగిలిన 22 మంది ఓడిపోయారు. చాలా మంది సైలెంట్ అయ్యారు. గొట్టిపాటి మైనింగ్ ను కూడా వైసీపీ ప్రభుత్వం మూసివేయించింది.

    చాలా మంది జగన్ ను మోసం చేసిన వారు మళ్లీ వైసీపీ పెద్దలను కలిసి పార్టీలో చేరుదామని చూసినా జగన్ మాత్రం ఏ ఒక్కరిని దగ్గరకు రానీయలేదు. పార్టీలో చేర్చుకోలేదు. తనను మోసం చేసిన వారికి తగిన శాస్తి చేశారు. ఇక జగన్ ధాటికి ఆదినారాయణ రెడ్డి లాంటి వారు బీజేపీలోకి వెళ్లారు.

    ఇప్పుడు వీరి రాజకీయ భవిష్యత్ అంతా గందరగోళంలో పడిపోయింది. జగన్ ను కాదని వెళ్లిన వీరికి సమాధి పడుతోంది. జగన్ తో ఉంటే ఇప్పుడు మంత్రులుగా ఉండేవాళ్లమని.. కనీసం ఎమ్మెల్యేలుగా గెలిచేవారమని.. మరో దఫా కూడా గెలిచామని.. టీడీపీలో చేరి మొత్తం రాజకీయ జీవితానికే ఫుల్ స్టాప్ పెట్టుకున్నామని ఆ 22 మంది మాజీ ఎమ్మెల్యేలు వాపోతున్నారట.. అధికారం కోసం ఆశపడి జగన్ కాలదన్నిన పాపానికి ఇప్పుడు వారంతా అనుభవిస్తున్నారట..