Chiranjeevi- YCP: మెగాస్టార్ చిరంజీవి ఇటీవల చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. వాల్తేరు వీరయ్య మూవీ 200 రోజుల ఫంక్షన్లో పాల్గొన్న ఆయన ఏపీ ప్రభుత్వాన్ని ఉద్దేశిస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వీటిపై మంత్రులు స్పందించడంతో సినిమా వర్సెస్ పొలిటికల్ అన్నట్లుగా మారింది. అయితే ‘పిచ్చుకపై బ్రహ్మస్త్రం’ అన్న కామెంట్స్ పై ప్రభుత్వ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. సినీ పరిశ్రమ చిన్నది అని ఒప్పుకున్నట్లేగా అని కౌంటర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు చిరంజీవి ఏం మట్లాడారు? దానికి మంత్రులు ఇంతలా ఎందుకు రియాక్ట్ అయ్యారు? అనే విషయం తీవ్ర చర్చకు వచ్చింది. ఈ నేపథ్యంలో చిరు చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఫుల్ వీడియోను ఇటీవల రిలీజ్ చేశారు. ఈ వీడియోలో ఏముందంటే?
కొన్ని నెలలుగా కొందరు హీరోల సినిమాలపై ఏపీ ప్రభుత్వం వివక్ష చూపుతోందన్న విమర్శలు వస్తున్నాయి. తమ సినిమాలకు టికెట్ల రేట్లు పెంచే విషయంలో పట్టించుకోవడం లేదని, కనీసం సినిమా ఆడించుకునేందుక థియేటర్లు ఇవ్వడం లేదని సినీ పరిశ్రమకు చెందిన వారు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా పవన్ కల్యాణ్ కు చెందిన సినిమాలపై ప్రభుత్వం కావాలనే కక్ష కడుతోందని అంటున్నారు. ఇటీవల పవన్ నటించిన ‘బ్రో’ సినిమా విషయంలో ఇదే జరిగిందని చెబుతూ వస్తున్నారు. ఈ తరుణంలో మెగాస్టార్ చిరంజీవి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
ఆయన నటించిన వాల్తేరు వీరయ్య ఫంక్షన్లో మాట్లాడుతూ ‘సినిమా పరిశ్రమ చాలా చిన్నది.. రాజకీయాలతో దీనిని పోల్చడం సరికాదు.. నేను అది చూశా.. ఇది చూశా.. మీరు సినిమా వివాదాలపై పెట్టే ఫోకస్ కంటే ప్రత్యేక హోదా, ప్రాజెక్టులు లాంటి విషయాలపై పెడితే చాలా సంతోషిస్తాం. అంతేగానీ పిచ్చుకపై బ్రహ్మస్త్రంలా సినిమా పరిశ్రమపై ఏంటి సార్? ’ అని ప్రశ్నించారు. అయితే ఈ వీడియో ముందుగా పూర్తిగా రాలేదు. క్లిప్పింగ్స్ మాత్రమే వచ్చాయి. ఇందులో పిచ్చుకపై బ్రహ్మస్త్రం అనే పదంపై ఏపీ ప్రభుత్వ నేతలు చిరంజీవిని ఉద్దేశిస్తూ కౌంటర్ వేశారు. సినిమా పరిశ్రమ పిచ్చుక అని ఒప్పుకున్నేట్లేనా? అని అన్నారు.
అయితే ఈ విషయం పార్లమెంట్ లోకి వెళ్లింది. పార్లమెంట్ లో ఈ విషయంపై ప్రస్తావించడంపై చిరంజీవి మాట్లాడుతూ ‘ సినిమా వాళ్ల రెమ్యూనరేషన్ గురించి మాట్లాడుతున్నారు. రెమ్యూనరేషన్ తీసుకోవడం తప్పు అన్నట్లు రాజ్యసభలో చెబుతున్నారు. వ్యాపారం జరుగుతోంది కాబట్టే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాం. రాజ్యసభలో వీటి గురించి మాట్లాడడం దురదృష్టకరం. మా కష్టాలేవో మేం పడుతాం. మా గురించి పట్టించుకోవడం మానేయండి’ అంటూ చిరంజీవికి సంబంధించిన పూర్తి వీడియోలో ఉంది. దీంతో జనసేన నాయకులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ నాయకులు కళ్లు తెరవాలంటూ విమర్శలు చేస్తున్నారు.