Tomato Prices : ఈ సీజన్ లో చౌకగా దొరకాల్సిన టమాట ధర రూ.100 ఎందుకు అయ్యింది? అసలు కారణాలివే?

Tomato Prices : మార్కెట్లో టమాట ధర వింటే వినియోగదారులు గుండెలు గుభేళ్లుమంటున్నాయి. కిలో టమాట 60 నుంచి 120 కి తక్కువ కాకుండా విక్రయిస్తున్నాయి. వాస్తవానికి శీతాకాలంలో టమాటకు ఇంత ధర ఉండేది కాదు. ఎందుకంటే అన్ని ప్రాంతాల వాళ్లూ టమాటాను పండిస్తారు. అదే వేసవిలో కొన్ని ప్రాంతాల నుంచి టమాట వస్తుంది. ఆ సమయంలో వాటి ధర అధికంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది శీతాకాలంలోనే టమాట రేటు గుబులు రేపుతోంది. పేదవారు పూర్తిగా […]

Written By: NARESH, Updated On : November 26, 2021 11:14 am
Follow us on

Tomato Prices : మార్కెట్లో టమాట ధర వింటే వినియోగదారులు గుండెలు గుభేళ్లుమంటున్నాయి. కిలో టమాట 60 నుంచి 120 కి తక్కువ కాకుండా విక్రయిస్తున్నాయి. వాస్తవానికి శీతాకాలంలో టమాటకు ఇంత ధర ఉండేది కాదు. ఎందుకంటే అన్ని ప్రాంతాల వాళ్లూ టమాటాను పండిస్తారు. అదే వేసవిలో కొన్ని ప్రాంతాల నుంచి టమాట వస్తుంది. ఆ సమయంలో వాటి ధర అధికంగా ఉంటుంది. కానీ ఈ ఏడాది శీతాకాలంలోనే టమాట రేటు గుబులు రేపుతోంది. పేదవారు పూర్తిగా కొనలేని స్థాయికి టమాట ధర పెరిగింది. సామాన్యులు సైతం టమాట కర్రీ గురించి ఆలోచించడం మానేశారు. ఇక రెస్టారెంట్స్, హోటల్స్ లో కూడా  టమాట వండడమే మానేశారు. మరి టమాట ధర ఎందుకు పెరిగింది..? ఎప్పుడూ లేనంతగా ఇంతగా వందల్లో పెరడానికి కారణమేంటి..? అన్న చర్చ సాగుతోంది. దీనిపై స్పెషల్ ఫోకస్..

tomatoes

తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దక్షిణాది రాష్ట్రాల్లోనూ  టమాట ధర విపరీతంగా పెరిగింది. పెట్రోల్ రేటు కన్న టమాట రేటు పెరిగిందని సోషల్ మీడియాలో రకరకాల పోస్టులు పెడుతున్నారు. హైదరాబాద్లో 60 నుంచి 80 లోపు కిలో ధర ఉండగా.. ఏపీలో 100 కు పైగానే పలుకుతోంది. ఇక కేరళ రాష్ట్రంలో 90 నుంచి 120 చొప్పున విక్రయిస్తున్నారు. గత ఐదేళ్లలో ఇంతలా ధరలు పెరగడం ఇదే మొదటిసారి అని వ్యాపారులు అంటున్నారు. దేశంలోని అతిపెద్ద మార్కెట్ యార్డు చిత్తూరు జిల్లాలోని మదనపల్లెలో ఉంది. ఇక్కడ కూడా టమాట ధరరూ.100 చొప్పున అమ్మడం గమనార్హం.

దక్షిణాదిన ఇటీవల వరుసగా కురుస్తున్న వర్షాలే ఇలా టమాట ధర పెరగడానికి కారణమని అంటున్నారు. కేరళ, తమిళనాడుతో పాటు ఏపీలోని రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ప్రాజెక్టులు కొట్టుకుపోయాయి. ఫలితంగా పంటలన్నీ దెబ్బతిన్నాయి. ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు తరిలే కూరగాయాలు లేకుండా పోయాయి. దీంతో కూరగాయల రేటు విపరీతంగా పెరగిందని అంటున్నారు. అయితే ధర పెరగడం వల్ల సామాన్యలకు ఇబ్బంది కలిగినా రైతులకు మేలే జరుగుతుందని అంటున్నారు. వర్షాలకు నష్టపోయిన తమకు ఈ ధరలతో కాస్త ఊరట కలుగుతుందని అంటున్నారు. సాధారణంగా పెట్టే టమాట రూ.300కు అమ్ముతారు. ఇందులో 25 కిలోల టమాట ఉంటుంది. కానీ ఇప్పుడు అదే పెట్టే రూ.1000 నుంచి 1400 రూపాయలకు అమ్ముతున్నారు.

Also Read: టమాటకున్న విలువ పవన్ కల్యాణ్ సినిమాకు ఉండదా?
సాధారణంగా శీతాకాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో టమాట సాగు ఎక్కువగా చేస్తారు. దీంతో ఈ సమయంలో టమాట రేటు పడిపోతుంది. కానీ ఈసారి వర్షాల కారణంగా టమాట ధర విపరీతంగా పెరిగింది. అయితే ఈ పరిస్థితి ఉత్తర భారత రైతులకు మేలు చేకూరుతోంది. ఉత్తరప్రదేశ్ లోని అసిమ్ పటాన్, హెబత్ పూర్ -సాలార్ పూర్ లో ఎక్కవగా శీతాకాలంటో టమాట సాగు చేస్తారు. ఈ సందర్భంగా అక్కడి రైతులు మాట్లాడుతూ శీతాకాంలో టమాటకు ఇంత ధర ఎప్పుడూ రాలేదు. ఈ సమయంలో కిలో టమాట కిలో రూ. 10కి మాత్రమే అమ్ముడుపోయేది. కానీ ఈసారి కురిసిన వర్షాలతో టమాట ధర పెరిగిందని అంటున్నారు.

దక్షిణాదిన టమాట ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. తమిళనాడులో కిలో టమాట 100 దాటింది. చెన్నైలో రూ.140కి విక్రయిస్తున్నారు. ఇక టమాట ధర పెరగడంతో సోషల్ మీడియాలో కొందరు ఫన్నీ పోస్టులు పెడుతున్నారు. ధరల పరుగులో టమాట పెట్రోల్ రేటును దాటేసింది అన్నట్లు పోస్టులు తయారు చేసి ట్రోలింగ్ చేస్తున్నారు. మార్కెట్లోకి కొత్త పెట్రోల్ వచ్చిందని, ఇది చాలా హాట్ గురూ అంటూ టమాట రేటును పెట్టి ట్రోల్ చేస్తున్నారు. మీమ్స్, కామెడీతో రకరకాల పోస్టులు పెట్టడంతో అవి వైరల్ గా మారుతున్నాయి.

Also Read: పెన్సిల్ దొంగతనం: న్యాయం కోసం పోలీసు స్టేషన్ మెట్లెక్కిన రెండో తరగతి విద్యార్థి