Homeఆంధ్రప్రదేశ్‌Pawan Kalyan- YCP: పవన్ కళ్యాణ్ ను అడ్డుకునేందుకే వైసీపీ రచించిన ప్లాన్ ఇదీ

Pawan Kalyan- YCP: పవన్ కళ్యాణ్ ను అడ్డుకునేందుకే వైసీపీ రచించిన ప్లాన్ ఇదీ

Pawan Kalyan- YCP: మాచర్ల, గుంటూరులో హై టెన్షన్ నెలకొంది. మాచర్లలో టీడీపీ నేతలను టార్గెట్ చేసుకుంటూ వైసీపీ విధ్వంసానికి దిగిన సంగతి తెలిసిందే.. టీడీపీ నాయకుడు బ్రహ్మానందరెడ్డితో పాటు టీడీపీ సానుభూతిపరులను టార్గెట్ చేసుకుంటూ వైసీపీ శ్రేణులు చేసిన దాడిని అన్నివర్గాలు ముక్తకంఠంతో ఖండిస్తున్నాయి.అయితే పక్కా వ్యూహంతోనే విధ్వంసానికి దిగినట్టు తెలుస్తోంది. మాచర్లలో టీడీపీ శ్రేణులను భయపెట్టడంతో పాటు పవన్ సత్తెనపల్లి టూర్ ను అడ్డుకునేందుకు.. ద్విముఖ వ్యూహంతో దాడికి ప్లాన్ చేసినట్టు వార్తలు వస్తున్నాయి. అటు విశ్లేషకులు కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చుతున్నారు. గతంలో కూడా మాచర్ల కేంద్రంగా ఇటువంటి దుశ్చర్యలకు దిగిన సందర్భాలున్నాయి. నేరుగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు మరణాయుధాలతో దాడులకు దిగుతుండడం ఇక్కడ పరిపాటిగా మారింది.

Pawan Kalyan- YCP
Pawan Kalyan- jagan

గతంలో ఇదే మాచర్లలో టీడీపీ నాయకుడు బొండా ఉమా, బుద్దా వెంకన్నను టార్గెట్ గా చేసుకొని వైసీపీ నేతలకు దాడులకు దిగారు. నేరుగా వారు ప్రయాణిస్తున్న వాహనంపైనే దాడిచేశారు. దీనిపై టీడీపీ సాక్షాధారాలతో ఫిర్యాదుచేసినా పోలీసులు పట్టించుకోలేదు. కనీసం కేసు కూడా నమోదుచేయలేదు. పైగా ఇక్కడ దాడుల్లో సూత్రధారి.. నేరుగా దాడిలో పాల్గొన్న కిశోర్ కు మునిసిపల్ చైర్మన్ పదవి కట్టబెట్టారు. తద్వారా విధ్వంస రాజకీయాలకు అండగా నిలుస్తున్నట్టు వైసీపీ హైకమాండ్ స్పష్టమైన సంకేతాలిచ్చింది. అందుకే వైసీపీ శ్రేణులు కర్రలు, మరణాయుధాలతో నిస్సిగ్గుగా దాడులకు తెగబడుతున్నారు. ఇక్కడ టీడీపీ నాయకులను భయాందోళనకు గురిచేయాలన్నదే ప్రణాళిక.

అయితే ఒక్క టీడీపీయే కాకుండా జనసేనను కూడా టార్గెట్ చేశారని తెలుస్తోంది. ఆదివారం సత్తెనపల్లిలో పవన్ పర్యటన ఖరారైంది. మంత్రి అంబటి రాంబాబు నియోజకవర్గం కావడంతో వైసీపీ అలెర్ట్ అయ్యింది. పవన్ కూడా రాంబాబును టార్గెట్ గా చేసుకొని సత్తెనపల్లిలో కౌలురైతు భరోసా యాత్రను ఖరారు చేసినట్టు వార్తలు వచ్చాయి. ఉమ్మడి గుంటూరు జిల్లాలో 250 మంది కౌలురైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. వారి కుటుంబాలకు రూ.లక్ష చొప్పున పవన్ సాయమందించనున్నారు. ఈ నేపథ్యంలో పవన్ వైసీపీ ప్రభుత్వంతో పాటు మంత్రి అంబటి రాంబాబుపై ఎదురుదాడి చేస్తారని ఊహించిన వైసీపీ నాయకులు ప్లాన్ ప్రకారం మాచర్ల విధ్వంసానికి తెరతీసినట్టు వార్తలు వస్తున్నాయి. జన సైనికులు కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Pawan Kalyan- YCP
Pawan Kalyan- jagan

మొన్నటికి మొన్న విశాఖలో కూడా ఇటువంటి ఎపిసోడే నడిచింది. విశాఖ రాజధానికి మద్దతుగా ఉత్తరాంధ్ర గర్జన పేరిట కార్యక్రమానికి వైసీపీ నేతలు పిలుపునిచ్చారు. అంతకంటే ముందే జనసేన జనవాణి కార్యక్రమం ఖరారైంది. పవన్ హాజరవుతారని ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ముందుగానే షెడ్యూల్ వెల్లడించింది. అయితే సరిగ్గా పవన్ వచ్చే సమయానికి విశాఖ ఎయిర్ పోర్టులో వైసీపీ మంత్రులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. కావాలనే జన సైనికులను రెచ్చగొట్టారు. తిరిగి తమపై దాడిచేశారంటూ పోలీసులకు ఫిర్యాదుచేశారు. దానిని సాకుగా చూపి పోలీసులు పవన్ పర్యటనను అడ్డుకున్నారు. జనవాణి కార్యక్రమాన్ని సైతం అడ్డగించారు. పవన్ ను రెండు రోజుల పాటు హోటల్ కే పరిమితం చేశారు. చివరకు విశాఖలో నెలరోజుల పాటు జనసేన కార్యక్రమాలపై నిషేధం పెట్టారు. ఇప్పుడు పవన్ సత్తెనపల్లి టూర్ ను సైతం అదే విధంగా అడ్డగించడానికే మాచర్లలో విధ్వంసం సృష్టించారని తెలుస్తోంది. అయితే దీనిపై పవన్ ఎలా రియాక్టవుతారో చూడాలి మరీ. అయితే పవన్ పర్యటనకు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అటు నాదేండ్ల మనోహర్ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మాచర్లను సాకుగా చూపి శాంతిభద్రతల సమస్యను తెరపైకి తెచ్చి పవన్ పర్యటనను పోలీసులు అడ్డుకుంటారన్న ప్రచారమైతే జోరుగా సాగుతోంది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular