Homeఆంధ్రప్రదేశ్‌2024 Elections- JanaSena: 2024లో జనసేన ప్లాన్ ఇదే.. పవన్ కళ్యాణ్ తో జనసేన నేతల...

2024 Elections- JanaSena: 2024లో జనసేన ప్లాన్ ఇదే.. పవన్ కళ్యాణ్ తో జనసేన నేతల కీలక భేటి

2024 Elections- JanaSena: ఏపీలో ఇప్పుడు అందరి దృష్టి జనసేనపైనే ఉంది. ఎప్పుడు ఎన్నికలు జరుగుతాయి అన్నదానికంటే పవన్ ఎవరితో కలిసి పోటీచేస్తారన్నదానిపైనే ఎక్కువగా చర్చ జరుగుతుంది. ఏ ఇద్దరు కలిసినా ఇదే హాట్ టాపిక్ గా మారుతోంది. పవన్ ప్రస్తావన లేని చర్చ లేదు. అటు అధికార పార్టీ నాయకులైనా.. విపక్ష నాయకులైనా.,వారి అభిమానులైనా పవన్ ను కార్నర్ చేసుకునే చర్చించుకుంటున్నారు. ఎన్నికల వేడి అంతా పవన్ పై డిపెండ్ అయ్యింది. విశాఖలో ప్రధానితో అరగంట భేటీ తరువాత పవన్ వ్యవహార శైలిలో మార్పు వచ్చిందని విశ్లేషకులు భావిస్తున్నారు. అప్పటి నుంచి పొలిటికల్ గా పవన్ కు మరింత మైలేజ్ వచ్చిందని చెబుతున్నారు. అసలే బలమే లేదన్న నాయకులు పవన్ గురించి బలంగా మాట్లాడడం మొదలు పెట్టారని గుర్తుచేస్తున్నారు. పవన్ ఎప్పుడు ఏం మాట్లాడుతున్నారో.. ఏం మాట్లాడారో కూడా ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా అధికార పార్టీలో ఆత్రం అంతా ఇంతాకాదు. తమప్రత్యర్థితో కలవనని చెబుతున్నప్పడు ఖుషీ అవుతున్నారు. కలిసి నడుస్తానని చెప్పినప్పుడు తెగ బాధపడుతున్నారు.

2024 Elections- JanaSena
pawan kalyan

 

అయితే ప్రధాని మోదీతో కలిసిన తరువాత పవన్ చాలా బ్యాలెన్స్ గా వెళుతున్నారు. అంతుకు ముందుకంటే కాస్తా భిన్నంగా వ్యవహరిస్తున్నారు. దీంతో అధికార వైసీపీకి, ప్రధాన విపక్షం టీడీపీకి టెన్షన్ పెడుతున్నారు. విశాఖ ఎపిసోడ్ తరువాత తనకు చంద్రబాబు సంఘీభావం తెలిపిన తరువాత కలిసి పోరాడతామని సంకేతాలిచ్చారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వనని తెగేసి చెప్పారు. దీంతో టీడీపీ శ్రేణులు తెగ ఖుషీ అయ్యాయి. కానీ తరువాత తనకు ఒక చాన్సివ్వాలని స్లోగన్ ఇచ్చిన తరువాత నీరుగారిపోయాయి. 2024, 2029 ఎన్నికలకు టార్గెట్ చేసి మాట్లాడినప్పుడు ఇక పొత్తు ఉండదేమోనని భయపడ్డాయి. అక్కడకు కొద్దిరోజులకే వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తానని వైసీపీకి హెచ్చరికలు పంపేసరికి పొత్తు సజీవంగా ఉందని ఊరట చెందారు.

ఒకటి మాత్రం చెప్పగలం. గతం కంటే జనసేన గ్రాఫ్ పెంచుకుంది. ఓటు షేర్ ను అమాంతం రెట్టింపు చేసుకుంది. గత ఎన్నికల్లో ఆరు శాతం ఉన్న ఓటు షేర్.. ఇప్పుడు 12 కు చేరుకుందని అంచనాకు వచ్చింది. అయితే దీనిని మరింత పెంచుకోని అధికారం వైపు అడుగులు వేయడం అన్నదానిపై అధ్యయనం చేస్తోంది. దీనిలో భాగంగా ఆ పార్టీ కీలక నేత నాదేండ్ల మనోహర్ తో పాటు మరో ఐదారుగురు సీనియర్లు తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడమే ఉత్తమమని పవన్ కు సూచించినట్టు వార్తలు వస్తున్నాయి. పార్టీ ఆవిర్బవించి సుదీర్ఘ కాలం అవుతున్న దృష్ట్యా పార్టీ పపర్ ను చేజిక్కించుకోకుంటే శ్రేణులు నైరాశ్యంలోకి వెళతాయని.. 2029 వరకూ వేచిచూసే కంటే..2024 లో ప్రభుత్వంలో భాగస్వామ్యమైతే పార్టీ మరింత నిలబడగలదని పవన్ దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. టీడీపీ, జనసేన విడివిడిగా పోటీచేస్తే వైసీపీ కి లాభం చేకూర్చిన వారవుతామని.. అది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని పవన్ తో చెప్పినట్టు తెలుస్తోంది.

2024 Elections- JanaSena
2024 Elections- JanaSena

ప్రస్తుతం టీడీపీ, జనసేన వేర్వేరుగా ప్రజల బాట పడుతున్నాయి. పార్టీ బలోపేతం నాయకత్వాలు ఫోకస్ పెట్టాయి. ఎన్నికల సమయానికి ఆ రెండు పార్టీలు కలవడం ఖాయమని అధికార వైసీపీ నేతలు బాహటంగానే కామెంట్స్ చేస్తున్నారు. బీజేపీ కూడా వారితో కలిసి వస్తుందని అనుమానిస్తున్నారు. అటు క్షేత్రస్థాయిలో పరిస్థితులు కూడా పార్టీల మధ్య అనుకూల వాతావరణం నడుస్తోంది. బీజేపీ రాష్ట్ర నాయకులు తప్పించి.. అగ్రనేతలు మేము టీడీపీతో కలవమని చెప్పడం లేదు. ఏ పార్టీకైనా లాభ నష్టాలు భేరీజు వేసుకొని ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటాయి. ఏపీలో పొత్తులతో లాభపడతామని బీజేపీ ఒక నిర్ణయానికి వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే తాజాగా నాదేండ్ల మనోహర్ తో పాటు జనసేన సీనియర్లు మాత్రం టీడీపీతో కలిసి నడవాలని అధినేతకు సూచించిన నేపథ్యంలో.. బీజేపీపై కూడా ఒత్తిడి పడే ప్రభావం ఉంది. సంక్రాంతి గడిచిన తరువాత పొత్తులపై ఒక తుది రూపం వచ్చే అవకాశముందన్న టాక్ అయితే మాత్రం వినిపిస్తోంది.

Velishala Suresh
Velishala Sureshhttps://oktelugu.com/
Velishala Suresh is Journlist and a Web Admin and is working with our organisation from last 4 years and he has good knowledge on Content uploads and Content Management in website.
RELATED ARTICLES

Most Popular