
తెలంగాణలో బీజేపీ పక్కా స్కెచ్ గీసింది. 2024లో విజయమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. ఇందుకోసం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి లు పక్కా వ్యూహంతో ముందుకు వెళుతున్నారు.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
ప్రధానంగా కాంగ్రెస్ ను దెబ్బతీసి ఆ నాయకులను చేర్చుకొని.. టీఆర్ఎస్ అసమ్మతులను లాగేసి తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఎదగాలని బీజేపీ యోచిస్తున్నట్టు తెలిసింది. ఈ ప్లాన్ వర్కవుట్ అయితే 2024లో అధికారమే లక్ష్యంగా వెళ్లనున్నట్లు తెలిసింది.
Also Read: బీజేపీని కెలికినందుకు కేసీఆర్ కు భారీ మూల్యం తప్పదా..?
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ అయ్యాక ఆయన దూకుడు వైఖరి విజయశాంతికి బాగా నచ్చిందని.. కేసీఆర్ సర్కార్ ను బండి ఎదుర్కొంటున్న తీరుకు ఆనందంగా ఉందని.. అందుకే ఇలాంటి పార్టీలో ఉండాలని విజయశాంతి కోరుకుంటున్నట్టు తెలిసింది. మరోవైపు విజయశాంతి గొప్ప నాయకురాలని.. తెలంగాణ మిగతా ఉద్యమకారుల్లాగానే ఆమెకు కేసీఆర్ అన్యాయం చేశారని బండి సంజయ్ ఆరోపించడం విశేషంగా మారింది. ఈ క్రమంలోనే బీజేపీకి మద్దతుగా విజయశాంతి ఆదివారం ట్వీట్ చేయడం విశేషం.
Also Read: తెలంగాణలో మంచినీరు తాగి ఒకరు మృతి.. 11 మందికి..?
దుబ్బాకలో గెలవగానే బీజేపీ భారీ ఎత్తున చేరికలపై దృష్టిసారించాలని.. పార్టీని బలోపేతం చేయాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ క్రమంలోనే కాంగ్రెస్, టీఆర్ఎస్ నేతలతో మంతనాలు జరుపుతున్నట్టు తెలిసింది. టీఆర్‌ఎస్ లోని కొందరు అసంతృప్త నేతలతో పాటు సీనియర్ కాంగ్రెస్ నేతలు ఇప్పటికే సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని వలసలను ప్రోత్సహించాలని బీజేపీ యోచిస్తున్నట్టు తెలిసింది.