సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై అప్డేట్ ఇదీ

తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో ఉంటున్నారు. అయితే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. తాజాగా అధికారికంగా కేసీఆర్ ఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. జ్వరం, జలుబు లక్షణాలు కనిపించడంతో సీఎం కేసీఆర్ […]

Written By: NARESH, Updated On : April 20, 2021 9:41 am
Follow us on

తెలంగాణ సీఎం కేసీఆర్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఎర్రవెల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో ఉంటున్నారు. అయితే కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు.

తాజాగా అధికారికంగా కేసీఆర్ ఆరోగ్యంపై తెలంగాణ ప్రభుత్వం వివరణ ఇచ్చింది. కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉందని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు. జ్వరం, జలుబు లక్షణాలు కనిపించడంతో సీఎం కేసీఆర్ కు రాపిడ్ టెస్టులు చేశామని.. కరోనా పాజిటివ్ గా వచ్చిందని ఆయన తెలిపారు.

ఇక పూర్తి నిర్ధారణ కోసం ఆర్టీపీసీఆర్ కు శాంపిల్స్ పంపిచామన్నారు. ఈరాత్రి 1 గంట వరకు రిపోర్ట్స్ రావోచ్చని చెప్పారు.

ప్రస్తుతం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. పల్స్, బ్లడ్ ప్రెజర్, ఆక్సిజన్ శాతం బాగానే ఉన్నాయని తెలిపారు. జ్వరం తగ్గిందని.. కొంచెం జలుబు ఉందని తెలిపారు. ఇది మైల్డ్ కోవిడ్ అని తెలిపారు.

కేసీఆర్ హోం ఐసోలేషన్ లో ఉండాలని చెప్పడంతో ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటున్నారని వివరించారు. వైద్యబృందం కేసీఆర్ ఆరోగ్యాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోందని డాక్టర్ ఎంవీ రావు తెలిపారు.