Collecter: తెలంగాణ సీఎం కేసీఆర్ మెచ్చిన కలెక్టర్ ఆయన.. కేసీఆర్ సీఎం అయ్యాక ఏరికోరి తన సిద్దిపేట జిల్లాకు తీసుకొచ్చి నియమించుకున్నారు.మ ధ్యలో బదిలీ అయిన రాజన్న సిరిసిల్లకు వెళితే.. నో నెవర్ అని తిరిగి ఆరు నెలల్లోనే సిద్దిపేటలో పోస్టింగ్ ఇచ్చారు. మంచి పనిమంతుడు అయిన ఈ కలెక్టర్ ఆధ్వర్యంలోనే సిద్దిపేట జిల్లా అభివృద్ధి సాధిస్తోంది. మల్లన్న సాగర్ ప్రాజెక్టును ఎలాంటి వివాదాలు లేకుండా ముందుకు తీసుకెళ్లిన ఘనత సిద్దిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డిదే..
siddipet collecter
ఇటీవల ఉప ఎన్నికల్లో, ఎమ్మెల్సీల్లో సిద్దిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డిని రిజైన్ చేయించి కేసీఆర్ నిలబెడుతారన్న ప్రచారం జోరుగా సాగింది. అయితే సమీకరణాలు కుదరక ఆయన రాజకీయ నాయకుడిగా మారలేకపోయాడు.
అయితే కేసీఆర్ ఇంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చాక దూకుడుగా పనిచేస్తున్న ఈ కలెక్టర్ తాజాగా చేసిన కామెంట్స్ మాత్రం వివాదాస్పదమయ్యాయి. ఎరువులు, విత్తనాల డీలర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ సీరియస్ అయ్యారట.. యాసంగిలో వరి విత్తనాలు విక్రయిస్తే ఊరుకోనని.. డీలర్లు అమ్మితే సంబంధిత ఏఈవోలు, వ్యవసాయాధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించాడట.. వరి విత్తనాలు ఒక్క కేజీ అమ్మినా ఊరుకోనని.. అమ్మితేనే ఇంత తీవ్ర చర్యలా అని వారంతా ముక్కున వేలేసుకోవడం విశేషం. అమ్మితే షాపును సీజ్ చేస్తానని హెచ్చరించాడు. డీలర్లు సుప్రీంకోర్టుకెళ్లి ఆర్డర్ తెచ్చుకున్నా దుకాణం తెరువనంటూ స్పష్టం చేశారు.
ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల నుంచి సిఫార్సులు చేయించినా పట్టించుకునే ప్రశ్నే ఉత్పన్నం కాదని కలెక్టర్ వెంకట్రామిరెడ్డి స్పష్టం చేశారు. పలుకుబడి తన దగ్గర నడువదన్నారు. మొత్తంగా మోనార్క్ ను మించి కలెక్టర్ ఈ రూల్స్ పాటించడంపై మీడియా కోడై కూస్తోంది.. ఇప్పుడిది వివాదాస్పదంగా మారుతోంది.