Omicron: దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ విశ్వరూపం దాల్చుతోంది. కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. మహారాష్ర్ట, కర్ణాటక, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, ఢిల్లీ స్టేట్లలో వైరస్ ఉధృతంగా వ్యాపిస్తోంది. దీంతో దేశంలో మూడో దశ ప్రారంభమైందనే సంకేతాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ ప్రభావంతో ప్రజలుభయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ కారణంగానే అన్ని స్టేట్లలో కేసుల సంఖ్య పెరుగుతున్నాయి.

కొద్ది రోజులుగా పశ్చిమ బెంగాల్, చత్తీస్ గడ్ తో పాటు ఈశాన్య స్టేట్లలోనే వ్యాపించిన డెల్టా వేరియంట్ తో జనం ఇబ్బందులు పడ్డారు. కానీ ప్రస్తుతం ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ప్రభావితం చేయడంతో కేసుల సంఖ్య రెట్టింపవుతోంది. అన్ని ప్రాంతాలు లాక్ డౌన్ విధించేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఒమిక్రాన్ వేరియంట్ తో మూడో దశ ముప్పు వాటిల్లనుందని చెబుతున్నారు.
దేశంలో నానాటికి కేసులు పెరుగుతున్నాయి. శుక్రవారం దాదాపు 1.41 లక్షల కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. రోజువారీ పాజిటివిటీ రేలు 9 శాతానికి చేరుకోవడం గమనార్హం. ఈ క్రమంలో దేశంలో కేసులు ఐదు లక్షలకు చేరడం ప్రమాదకరమే. దీంతో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా విస్తరిస్తోంది. దీంతోనే కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Omicron – Immunity Boost: ముంచుకొస్తున్న ఒమిక్రాన్ ముప్పు.. ఇమ్యూనిటీని పెంచే ఆహార పదార్థాలివే?
మహమ్మారి జాడ్యం మళ్లీ విజృంభిస్తుండటంతో పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించనున్నట్లు సమాచారం. పశ్చిమ బెంగాల్ లో ఇప్పటికే లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో అన్ని స్టేట్లు కూడా నిబంధనలు అమలు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ ను నిరోధించే చర్యలకు ఉపక్రమిస్తున్నారు. ఒమిక్రాన్ ను అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.
Also Read: Omicron: కమ్ము కొస్తున్న ‘ఒమిక్రాన్’ మబ్బు.. ఫిబ్రవరిలో లాక్ డౌన్?