https://oktelugu.com/

Ramesh Ghattamaneni : ఆ నిర్ణయంతోనే రమేష్ బాబు సినీ జీవితం ముగిసింది !

Ramesh Babu Ghattameni: ఘట్టమనేని రమేష్ బాబు నిన్న రాత్రి మరణించారు అనగానే సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు తల్లడిల్లిపోయారు. ఆ రోజుల్లో కృష్ణ వారసుడు అనగానే రమేష్ బాబు మాత్రమే గుర్తుకు వచ్చేవారు. దానికి రమేశ్ బాబు కూడా కృష్ణ వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. తొలినాళ్లలో సక్సెస్ కూడా అయ్యారు. పైగా చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా రమేష్ కొన్ని చిత్రాల్లో నటించి అలరించారు. ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా రమేష్ […]

Written By: Shiva, Updated On : January 9, 2022 10:46 am
Follow us on

Ramesh Babu Ghattameni: ఘట్టమనేని రమేష్ బాబు నిన్న రాత్రి మరణించారు అనగానే సూపర్ స్టార్ కృష్ణ అభిమానులు తల్లడిల్లిపోయారు. ఆ రోజుల్లో కృష్ణ వారసుడు అనగానే రమేష్ బాబు మాత్రమే గుర్తుకు వచ్చేవారు. దానికి రమేశ్ బాబు కూడా కృష్ణ వారసత్వాన్ని కొనసాగించే ప్రయత్నం చేశారు. తొలినాళ్లలో సక్సెస్ కూడా అయ్యారు. పైగా చైల్డ్ ఆర్టిస్ట్ గా కూడా రమేష్ కొన్ని చిత్రాల్లో నటించి అలరించారు. ‘అల్లూరి సీతారామరాజు’ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా రమేష్ తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు.

Ramesh Babu Ghattamaneni

Ramesh Babu Ghattamaneni

Ramesh Babu Ghattamaneni Biography

ఆ తర్వాత రోజుల్లో దొంగలకు దొంగ, నీడ, పాలు నీళ్లు, మనుషులు చేసిన దొంగలు, అన్నదమ్ముల సవాల్ లాంటి సినిమాల్లోనూ రమేష్ బాబు తనదైన నటనతో ఫుల్ క్రేజ్ సంపాధించుకున్నారు. కాబోయే సూపర్ స్టార్ రమేష్ బాబు Ramesh Babu Ghattamaneni అంటూ ఆ రోజుల్లో ఆయనకు విపరీతమైన ఫాలోయింగ్ కూడా వచ్చింది. అయితే.. రమేష్ బాబు బాలనటుడిగా ఎంత గొప్ప సక్సెస్ అయ్యారో హీరోగా అంత దారుణంగా ఫెయిల్ అయ్యారు.

‘సామ్రాట్’ అనే సినిమాతో హీరోగా రమేష్ బాబు ఎంట్రీ ఇచ్చినప్పుడు.. అప్పటి స్టార్ హీరోలు కూడా తమకు గట్టి పోటీ ఉండబోతుందని డైరెక్ట్ గానే స్పీచ్ లు ఇచ్చారు. ఓ సందర్భంలో మెగాస్టార్ చిరంజీవి కూడా ‘మాకు రమేష్ బాబు రూపంలో పోటీ రాబోతుంది’ అని అన్నారు. అంతటి క్రేజ్ తెచ్చుకున్న రమేష్ బాబు ఆ తర్వాత ‘చిన్ని కృష్ణుడు’, ‘బజార్ రౌడీ’, కృష్ణ గారబ్బాయి, ఆయుధం లాంటి చిత్రాలతో అలరించే ప్రయత్నం చేశారు.

Mahesh Babu Brother Ramesh Babu

కానీ, ఆయనకు హిట్లు ఆశించిన స్థాయిలో రాలేదు. కలియుగ కర్ణుడు, ముగ్గురు కొడుకులు, బ్లాక్ టైగర్, కలియుగ అభిమన్యుడు, నా ఇల్లే నా స్వర్గం, మామా కోడలు, అన్న చెల్లెలు, పచ్చ తోరణం లాంటి సినిమాలు ఆయనను బాగా ఇబ్బంది పెట్టాయి. ఆ సినిమాల నిర్మాతలు కూడా ఆయన చిత్రాల ద్వారా బాగా నష్టపోయారు. దాంతో రమేష్ బాబు తనలో తానే బాగా నలిగిపోతూ ఉండేవారు.

Also Read: Ramesh Babu: హీరో మహేష్ బాబు సోదరుడు రమేశ్ బాబు కన్నుమూత

‘నా కారణంగా నిర్మాతలు ఇబ్బందులు పడకూడదు’ అని రమేష్ బాబు నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయం తర్వాతే ఆయన ఇక హీరోగా నటించకూడదు అని ఫిక్స్ అయ్యారు. ఇక అప్పటి నుంచి ‘రమేష్ బాబు’ సినిమాల్లో మళ్ళీ నటించలేదు. అయితే, ‘ఎన్కౌంటర్’ అనే సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించారు. కానీ, ఆ సినిమా కూడా ఆయనకు పేరు తీసుకోలేదు. నిజానికి, రమేష్ బాబు మోస్ట్ గ్లామరస్ హీరోగా ఎదిగాల్సిన హీరో. కానీ ఉదయించకుండానే అస్తమించిన హీరోగా ‘రమేష్ బాబు’ మిగిలిపోవడం దురదృష్టకరం.

Also Read: Rajamouli Next movie: రాజమౌళి నెక్ట్ మూవీ ఆ బాలీవుడ్ హీరోతోనే?

Tags