https://oktelugu.com/

Rajamouli Next movie: రాజమౌళి నెక్ట్ మూవీ ఆ బాలీవుడ్ హీరోతోనే?

Rajamouli Next movie: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ కొద్దిరోజుల క్రితమే షూటింగ్  పూర్తి చేసుకుంది. 2022 జనవరి 7న విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా పరిస్థితుల కారణంగా మరోసారి వాయిదాపడక తప్పలేదు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఆత్రుతగా ఎదురుచూసిన అభిమానులు నిరాశకు గురయ్యారు. దీంతో చిత్రబృందం అభిమానులను క్షమాపణలు చెబుతూ త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని ప్రకటించింది. ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి తన నెక్ట్ ప్రాజెక్టు సూపర్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : January 9, 2022 / 09:48 AM IST
    Follow us on

    Rajamouli Next movie: దర్శకధీరుడు రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘ఆర్ఆర్ఆర్’ కొద్దిరోజుల క్రితమే షూటింగ్  పూర్తి చేసుకుంది. 2022 జనవరి 7న విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా పరిస్థితుల కారణంగా మరోసారి వాయిదాపడక తప్పలేదు. దీంతో ‘ఆర్ఆర్ఆర్’ కోసం ఆత్రుతగా ఎదురుచూసిన అభిమానులు నిరాశకు గురయ్యారు. దీంతో చిత్రబృందం అభిమానులను క్షమాపణలు చెబుతూ త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని ప్రకటించింది.

    Rajamouli

    ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ లో భాగంగా రాజమౌళి తన నెక్ట్ ప్రాజెక్టు సూపర్ స్టార్ మహేష్ తో ఉండబోతుందని ప్రకటించారు. ఈ మూవీ హాలీవుడ్ స్థాయి అడ్వెంచర్స్ యాక్షన్ తరహాలో ఉంటుందని రాజమౌళి ప్రకటించి సూపర్ స్టార్ అభిమానుల్లో జోష్ నింపారు. అయితే ఈ మూవీ కంటే ముందే రాజమౌళి మరో ప్రాజెక్టును లైన్లో పెట్టినట్లు వార్తలు విన్పిస్తున్నాయి.

    ‘బాహుబలి’ సిరీసులతో ప్యాన్ ఇండియా డైరెక్టర్ గా రాజమౌళి మారిపోయాడు. దీంతో బాలీవుడ్లోలోనూ ఆయనతో సినిమా చేసేందుకు హీరోలు, నిర్మాతలు క్యూ కడుతున్నారు. బాలీవుడ్లో రాజమౌళికి ప్రముఖ నిర్మాత కరణ్ జోహర్, హీరో రణ్వీర్ కపూర్ లతో మంచి సాన్నిహిత్యం ఏర్పడింది. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో ఓ మూవీని తెరకెక్కించనున్నారనే గుసగుసలు విన్పిస్తున్నాయి. మహేష్ తో మూవీ చేసే గ్యాప్ లో సమయం దొరికితే ఈ మూవీ పట్టాలెక్కనుందని సమాచారం.

    Also Read: Shyam Singha Roy: ‘శ్యామ్ సింగరాయ్’పై ‘మెగా’ ప్రశంసలు.. సంబరపడిపోతున్న కృతిశెట్టి..!

    ప్రస్తుతం మహేష్ బాబు దర్శకుడు పర్శురాంతో కలిసి ‘సర్కారువారిపాట’ అనే యాక్షన్ మూవీలో నటిస్తున్నారు. ఇందులో మహేష్ కు జోడీ కీర్తి సురేష్ నటిస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్, 14 ప్లస్ రీల్స్ జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా ఈ మూవీని ఏప్రిల్ 1న విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది.

    Also Read: Ramesh Babu: హీరో మహేష్ బాబు సోదరుడు రమేశ్ బాబు కన్నుమూత