https://oktelugu.com/

థర్డ్ వేవ్ గ్యారెంటీ: ఎంతలా ఉంటుందంటే?

భారతదేశంలో కేసులు మళ్లీ చాపకింద నీరుగా పెరిగిపోతున్నాయి. సెకండ్ వేవ్ తగ్గి జనాలు మెల్లిగా బయటకు వస్తూ బిజీ అవున్న వేళ మూడో ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే థర్డ్ వేవ్ ఖాయం అని నిపుణులు సూచించారు.అందుకు తగినట్టుగానే దేశంలో కొత్త కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే ఏకంగా 3.60లక్షల టెస్టులు చేయగా.. కొత్తగా 40134 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 422 మంది చనిపోయారు. కొద్దిరోజులుగా కొత్త కేసుల్లో పెరుగుదల థర్డ్ వేవ్ […]

Written By:
  • NARESH
  • , Updated On : August 2, 2021 / 12:04 PM IST
    Follow us on

    భారతదేశంలో కేసులు మళ్లీ చాపకింద నీరుగా పెరిగిపోతున్నాయి. సెకండ్ వేవ్ తగ్గి జనాలు మెల్లిగా బయటకు వస్తూ బిజీ అవున్న వేళ మూడో ముప్పు పొంచి ఉంది. ఇప్పటికే థర్డ్ వేవ్ ఖాయం అని నిపుణులు సూచించారు.అందుకు తగినట్టుగానే దేశంలో కొత్త కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది.

    దేశవ్యాప్తంగా ఆదివారం ఒక్కరోజే ఏకంగా 3.60లక్షల టెస్టులు చేయగా.. కొత్తగా 40134 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కొత్తగా 422 మంది చనిపోయారు. కొద్దిరోజులుగా కొత్త కేసుల్లో పెరుగుదల థర్డ్ వేవ్ కు దారితీస్తుందా? అన్న ఆందోళన కనిపిస్తోంది.

    సగానికి పైగా కేసులు కేరళ, మహారాష్ట్రల్లోనే వెలుగుచూస్తున్నాయి. 40కిపైగా జిల్లాల్లో పాజిటివిటీ రేటు 10శాతం కన్నా ఎక్కువగా నమోదవుతోంది. ఈ క్రమంలోనే తాజాగా వెలువడిన ఓ అధ్యయనం మూడో ముప్పు వేళ ఎన్ని కేసులు వెలుగుచూడనున్నాయో ఓ సంచలన విషయాన్ని బయటపెట్టింది.

    మేథమెటికల్ మోడల్ ఆధారంగా ఐఐటీ కాన్పూర్, హైదరాబాద్ కు చెందిన మణీంద్రా అగర్వాల్, ఎం విద్యాసాగర్ నేతృత్వంలో థర్డ్ వేవ్ పై ఈ అధ్యయనం సాగింది. ఆంక్షల సడలింపులు, డెల్టా వేరియంట్ విజృంభణ వంటి కారణాలతో ఇటీవల కాలంలో కరోనా కొత్త కేసులు పెరుగుతున్నాయి. ఇవి మూడో ముప్పుకు దారితీస్తున్నాయని సర్వే తేల్చింది.

    కేసులు ఇలాగే పెరిగి అక్టోబర్ నాటికి గరిష్ట్రస్తాయికి చేరుకుంటాయని థర్డ్ వేవ్ అక్టోబర్ లో తీవ్రంగా ఉంటుందని అంచనా వేశారు. అయితే సెకండ్ వేవ్ అంత ముప్పు థర్డ్ వేవ్ లో ఉండకపోవచ్చని చెబుతున్నారు.

    థర్డ్ వేవ్ లో రోజుకు అత్యధికంగా లక్ష కంటే తక్కువ కేసులు వెలుగుచూసే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. పరిస్థితులు మరీ చేయిదాటితే ఆ సంఖ్య గరిష్టంగా 150000 గా ఉండొచ్చని సెకండ్ వేవ్ అంత తీవ్రం కాదని చెబుతున్నారు.

    దేశంలో సెకండ్ వేవ్ కల్లోలం సృష్టించింది. జనాలు పిట్లల్లా రాలిపోయారు. అత్యధిక కేసులు, మరణాలతో రికార్డు నమోదైంది. ఆక్సిజన్ మందుల కొరత సహా వైద్యరంగం వైఫల్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. రోజు వారీగా ఏకంగా 4 లక్షలకుపైగానే కేసులు నమోదయ్యాయి. సెకండ్ వేవ్ కు డెల్టా వేరియంట్ కారణమైంది. మరణ మృదంగం వినిపించింది. అయితే థర్డ్ వేవ్ ముప్పు అంతగా ఉండకపోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రజలు జాగ్రత్తలు పాటిస్తూ టీకాలు వేసుకుంటే పెద్దగా ప్రమాదం ఉండదని సూచిస్తున్నారు.