ప్రముఖ బాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నారని ఆరోపణలు ముందు నుండి వస్తున్నాయి. హత్య జరిగి చాలా రోజులు అయిన తర్వాత బీహార్ అసెంబ్లీలో అతని టాపిక్ లేవనెత్తడం ఇక సీబీఐ విచారణకు పట్టుబట్టడం వంటివి చూస్తుంటే అలాగే అనిపిస్తోంది అని పలువురు ఆరోపిస్తున్నారు.
ఇదే సమయంలో రాజకీయంగా లబ్ధి పొందేందుకే తనను సుశాంత్ ఆత్మహత్య కేసులో ఇరికిస్తున్నారని సుశాంత్ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రబోతి చెప్పారు. ఈ విషయంలో కొన్ని మీడియా వర్గాలు ఇప్పటికే తనను దోషిగా నిర్ధారించేశాయి అని…. తన విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆమె వాపోతోంది. ఈ మేరకు మీడియా ట్రయల్ ను నిరసిస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన రియా సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్యను రాజకీయాల కోసం వాడుకుంటున్నారని తనను ఇరికించి వారు పబ్బం గడుపుతున్నారని అంటోంది. బీహార్ లో తన పై ఎఫ్ఐర్ నమోదు కావడం కూడా రాజకీయంలో భాగమేనని ఆరోపిస్తోంది.
తనను ఇలా బలి చేయడం ఎంతవరకు సమంజసం అని తన పిటిషన్ లో ప్రతి ఒక్కటీ పేర్కొందని సమాచారం. ఇదివరకు మీడియా వారు 2జీ స్క్యామ్ తదితర వాటిల్లో అనేకమంది దోషులు అని మీడియా ప్రచారం చేసి ఆ తర్వాత వాళ్లందర్నీ కోర్టు తీర్పు ద్వారా నిర్దోషులుగా ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసింది. వందల వేల కోట్ల స్కాం లో ని విచారణలో సిబిఐ వంటి సంస్థలు జోక్యం చేసుకున్న తర్వాత కూడా పూర్తి కాలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లింది. ఒక పక్క విచారణకు హాజరు అవుతూ ఆమె ఈ పిటిషన్లు దాఖలు చేయడం గమనార్హం.