Telangana: పోరుగడ్డ కరీంనగర్.. తెలంగాణ మలిదశ ఉద్యమానికి కేంద్రమైన కరీంనగర్ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకు సెంటిమెంట్ జిల్లా. కేసీఆర్ ఇక్కడి నుంచే తెలంగాణ పోరాటం ప్రారంభించి విజయం సాధించారు. ప్రత్యేక రాష్ట్ర కలను సాకారం చేశారు. కేసీఆర్ తనయుడు, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారకరామారావుకు కూడా కరీంనగర్ అచ్చొచ్చిన జిల్లా. అయితే ఆ సెంటిమెంటు ఇప్పుడు సన్నగిల్లుతున్నట్లు కనిపిస్తోంది. ఉద్యమ ప్రస్థానంలో తోడున్నవారే ఇప్పుడు దూరమవుతున్నారు. మరోవైపు కేసీఆర్, కేటీఆర్ ప్రారంభించిన అభివృద్ధి పనులకే రక్షణ కరువవుతోంది. దీంతో అధికారులు కూడా వారిని పెద్దగా పట్టించుకోవడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఏ ఉద్యమం అయినా కరీంనగర్ నుంచే..
తెలంగాణ సీఎం, తెలంగాణ ఉద్యమ విజేత కేసీఆర్ ఏ ఉద్యమం అయినా కరీంనగర్ నుండే ప్రారంభించడం అనవాయితీ వప్తోంది. ఇక్కడ ప్రారంభించిన ఏ కారక్రమమైనా సక్సెస్ అవుతుందనేది కేసీఆర్‌కి ఉన్న గట్టి నమ్మకం. అది ఇప్పుడు పాటిస్తున్న సెంటిమెంట్ కాదు 2001లో టీఆర్‌ఎస్ పార్టీ ఆవిర్భావ సభ నుంచి 2009లో చేపట్టిన ఆమరణ దీక్ష వరకూ ప్రతి ఆందోళనను కరీంనగర్ జిల్లానే వేదికగా మార్చుకున్నారు. ఇప్పటికీ కరీంనగర్ అంటేనే సీఎంకు ఏనలేని అభిమానమని టీఆర్‌ఎస్ నేతలు కూడా తరుచూ చెబుతుంటారు. అంతటి ప్రత్యేకత ఉన్న కరీంనగర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మంత్రి కేటీఆర్‌కి షాకిచ్చే విధంగా వ్యవహరిస్తున్నారు కొందరు స్థానికులు. దీంతె సెంటిమెంటే నీరుగారిపోతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి.
నాడు మొక్క మాయం..
రాష్ట్రం పచ్చగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురవాలని, ఊళ్లలోకి వచ్చిన కోతులు తిరిగి అడవులకు వెళ్లాలన్న సంకల్పంతో తెలంగాణకు హరితహారం కార్యక్రమం చేపట్టారు కేసీఆర్. ఇందులో భాగంగానే గతంలో కరీంనగర్ లో పర్యటించిన గులాబీ అధినేత లోయర్ మానేరు డ్యాం దిగువన సంపంగి మొక్క నాటారు. సీఎం నాటిన ఆ మొక్క కొన్ని రోజుల్లోనే మాయం అయింది. ఈవార్త సంచలనంగా మారడంతో అధికారులు అదే స్థానంలో మరో మొక్కను నాటి చేతులు దులుపుకున్నారు. ఆ మొక్కను పట్టుకెళ్లిన వాళ్లను సైతం పోలీసులు పట్టుకున్నారు. అక్కడ ప్రత్యేకమైన పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు.
నేడు బిందె చోరీ..
తాజాగా కరీంనగర్‌లో మిషన్ భగీరథ పైలాన్ వద్ద ఏర్పాటు చేసిన బిందె మాయమైంది. నగరంలో ఇంటింటికి తాగునీరు అందించేందుకు ఏర్పాటు చేసిన మిషన్ భగీరథ కార్యక్రమం ప్రారంభించినందుకు గుర్తుగా భారీ సైజు పైలాన్ ను మానేరు వంతెన వద్ద నిర్మించారు అధికారు. ఈ పైలాన్ ను రెండు చేతుల నుంచి కింద పడుతున్న నీటి చుక్క బిందెలో పడుతుందన్నట్టుగా తీర్చిదిద్దారు. గత మార్చి 17న మంత్రి కేటీఆర్ ఈ పైలాన్‌ను ప్రారంభించారు. అయితే ఇక్కడ ఏర్పాటు చేసిన ఇత్తడి బిందె రెండు రోజుల క్రితం మాయమైంది. ఈ విషయం ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
నాడు తండ్రి నాటిన మొక్క … నేడు తనయుడు ఓపెన్ చేసిన బిందె మాయం కావడం కాకతీళీయయే అయినా ఇద్దరి చేతుల మీదుగా జరిగిన కార్యక్రమాలకు సంబంధించినవే అదృశ్యం కావడం గమనార్హం. దీనిపైన వన్ టౌన్ పీఎస్‌లో ఫిర్యాదు చేశారు కరీంనగర్ కార్పొరేషన్ ఏఈ వాణి. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ రెండు సంఘటనలు చూస్తుంటే జిల్లా ప్రజల్లో టీఆర్‌ఎస్‌పై అభిమానం తగ్గిందా లేక కేసీఆర్, కేటీఆర్‌కే కరీంనగర్ జిల్లాపై ఉన్నసెంటిమెంట్ నీరుగారిపోతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.