spot_img
Homeజాతీయ వార్తలుPanjob Elections: పంజాబ్ ‘ఆప్’ పార్టీలో అత్యంత పేద వారే కాదు... అత్యంత ధనవంతులు కూడా...

Panjob Elections: పంజాబ్ ‘ఆప్’ పార్టీలో అత్యంత పేద వారే కాదు… అత్యంత ధనవంతులు కూడా ఉన్నారు!

Panjob Elections: పంజాబ్ లో ఆమ్ ఆద్మీ పార్టీ సరికొత్త చరిత్ర సృష్టించింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలను ఓడించి ఠీవీగా నిలబడింది. పంజాబ్ లో ఆమ్ ఆద్మీ సునామీలో మాజీ సీఎంలు, ప్రస్తుత సీఎం సహా ఎంతో మంది దిగ్గజ నాయకులు కొట్టుకుపోయారు. ఇక వారిని ఓడించింది ఎవరో బిగ్ షాట్స్ కాదు.. కేవలం మహిళా వాలంటీర్లు, గుమస్తాలు, షాపుల్లో పనిచేసే ఆమ్ ఆద్మీ సామాన్య నేతలే కావడం విశేషం.

పంజాబ్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన సామాన్యులే ఎమ్మెల్యేలుగా గెలిచారు. దిగ్గజ నేతలను ఓడగొట్టారు. ప్రజలు డబ్బుకు దాసోహం కాకుండా నీట్ పాలిటిక్స్ చేసే ఆమ్ ఆద్మీ పార్టీని ఓన్ చేసుకొని గెలిపించారు.

మొత్తం 117 సీట్లున్న పంజాబ్ లో ఆప్ ఏకంగా 91 స్థానాల్లో ఆధిక్యం కనబరిచింది. కాంగ్రెస్ కేవలం 19 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. పంజాబ్ ఎన్నికల్లో సీఎంలుగా చేసిన బాదల్, చన్నీ, కెప్టెన్ కూడా ఆమ్ ఆద్మీ ధాటికి ఓడిపోయారు. సీఎం చరణ్ జీత్ చన్నీ సింగ్ ను ఓడించింది మొబైల్ రిపేర్ దుకాణంలో చిన్న పనిచేస్తున్న ఓ వ్యక్తి కావడం సంచలనమైంది. ఇక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ సిద్దూను ఓడించిన వ్యక్తి ఒక మహిళా వాలంటీర్.. ఆమ్ ఆద్మీ ప్రభంజనంలో వారంతా సామాన్యుల చేతుల్లో కొట్టుకుపోయారు.

అయితే ఆమ్ ఆద్మీ పార్టీ నేతలే అత్యంత పేదవారే కాదు.. అత్యంత ధనవంతులైన నేతలు కూడా పోటీచేశారు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో అత్యధిక ధనవంతుడైన అభ్యర్థిగా కులవంత్ సింగ్ నిలిచారు. ఆమ్ ఆద్మీ తరుఫున పోటీచేసిన ఈ ధనవంతుడి సంపద విలువ ఏకంగా రూ.238 కోట్లు కావడం విశేషం. ఇతడే పంజాబ్ లో పోటీచేసిన వారిలో అత్యంత ధనవంతుడు. సాస్ నగర్ అసెంబ్లీ సీటునుంచి పోటీచేసిన కుల్వంత్ సింగ్ కాంగ్రెస్ అభ్యర్థి బల్బీర్ సింగ్ సిద్దూను 34097 ఓట్ల తేడాతో ఓడించారు.

ఇక పంజాబ్ లో పోటీచేసిన అభ్యర్థుల్లో రెండో అత్యంత సంపన్న వ్యక్తి మాజీ డిప్యూటీ సీఎం సుఖ్ బీర్ సింగ్ బాదల్. ఈయన సంపద విలువ రూ.202 కోట్లు. జలాలబాద్ నుంచి కాంగ్రెస్ తరుఫున పోటీచేసిన ఈయన ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి జగదీప్ కమ్ బోజ్ చేతిలో 30930 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక కాంగ్రెస్ పార్టీకి చెందిన కరన్ కౌర్ మూడో అత్యంత ధనవంతురాలు.. ఈమెకూడా ముక్త్ సర్ నుంచి పోటీచేసి ఓటమి చవిచూశారు.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Related News

Most Popular

Jogi Ramesh

Jogi Ramesh: చిక్కుల్లో మాజీ మంత్రి రమేష్ ఫ్యామిలీ!

Jogi Ramesh: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై వ్యక్తిగత కేసులు చుట్టుముడుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి అప్పలరాజు తన కుమారుడు ప్రమాదం మూలంగా చిక్కుల్లో పడ్డారు. బైక్ ప్రమాదానికి కారణమైన తన...
Akhil Akkineni

Akhil Akkineni: లెనిన్ సక్సెస్ తో అఖిల్ రెమ్యునరేషన్ భారీగా పెంచేశాడుగా…

Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప విజయాలను సాధించిన హీరోలు చాలామంది ఉన్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే అక్కినేని ఫ్యామిలీకి సైతం తెలుగులో చాలా మంచి...
Toli Ekadashi 2026

Toli Ekadashi 2026: తొలి ఏకాదశి: ఉపవాసం ఉన్నవారు అన్నం, గోధుమల ఆహారం తినొచ్చా..

Toli Ekadashi 2026: హిందూ సాంప్రదాయం ప్రకారం ఏకాదశికి ఎంతో విశిష్టత ఉంటుంది. ప్రతి నెలలో రెండు సార్లు వచ్చే ఏకాదశి ఏడాదిలో 24 సార్లు వస్తుంది. అయితే వీటిలో ఆషాడ మాసంలో...
Today 25 July 2026 Horoscope:

Today 25 July 2026 Horoscope: ఈ నాలుగు రాశుల వారికి ఈరోజు నారాయణుడి ఆశీస్సులు.. పట్టిందల్లా బంగారమే..

Today 25 July 2026 Horoscope: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శనివారం ద్వాదశ రాశులపై జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా కొన్ని రాశుల వారికి అనుకోని ధన...

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...
Oktelugu Epaper