2024 Elections: దేశంలో ఈ రోజు మినీ ఎన్నికల సంగ్రామం నడుస్తోంది. ఏంటి మినీ సంగ్రామమా ? తెలంగాణలో ఒక్క హుజూరాబాద్ లో ఎన్నికలు సాగితే మినీ సంగ్రామం అని అంటున్నారని అర్థం కావడం లేదు కదూ. అవును నిజమే. ఈరోజు సాగేవి మినీ సంగ్రామం కిందనే భావించాలి. ఈ రోజు దేశంలోని నలుమూల ఎక్కడో ఓ చోట ఎన్నికలు సాగుతున్నాయి. ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాలు అన్ని కలిపితే ఒక చిన్న రాష్ట్రం అంత అవుతాయి. ఇది 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికకు ముందు జరిగే ఓ చిన్నపాటి సార్వత్రిక ఎన్నికలాగే కనిపిస్తోంది.

ప్రభుత్వ పనితీరు.. ప్రతిపక్షాలపై పెట్టుకున్న ఆశలను తెలిజేసే ఎన్నికలు..
ఈ రోజు దేశంలోని చాలా ప్రాంతాల్లో ఎన్నికలు సాగుతున్నాయి. ప్రతీ చోట అధికార, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మంగా తీసుకోవడంతో హోరా హోరీగా ఎన్నికలు సాగుతున్నాయి. ఈ ఎన్నికలను వచ్చే సార్వత్రిక ఎన్నికల ఫలితాలు ముఖచిత్రాన్ని తెలియజేసే ఎన్నికలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అన్ని పార్టీలపై ప్రజల అభిప్రాయం ఇప్పుడు ఏ విధంగా ఉందన్న విషయం స్పష్టం కానుంది. ఇవి ఆయా రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న పార్టీలపై ప్రజల్లో ఉన్న నమ్మకం, అంసతృప్తి, వ్యతిరేకతను తెలియజేయనున్నాయి. అలాగే ప్రతిపక్ష పార్టీలపై ప్రజలకు ఉన్న ఆశలు, నమ్మకం కూడా ఇప్పుడు తెలియరానుంది.
ఎక్కడెక్కడంటే..
బీహార్, కర్నాటకలోని రెండు అసెంబ్లీ స్థానాలకు, అస్సాంలో ఐదు అసెంబ్లీ స్థానాలకు, పశ్చిమ బెంగాల్ లో నాలుగు అసెంబ్లీ స్థానాలకు, హిమాచల్ ప్రదేశ్ లోని మూడు అసెంబ్లీ స్థానాలకు, మేఘాలయాలో మూడు అసెంబ్లీ స్థానాలకు, రాజస్థాన్ లో రెండు అసెంబ్లీ స్థానాలకు, మహారాష్ట్ర, తెలంగాణ, ఏపీ, మిజోరం, నాగాలాండ్, హర్యానలో ఒక్కో అసెంబ్లీ స్థానం చొప్పున నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. దేశం మొత్తం చూసుకుంటూ మూడు లోక్ సభ స్థానాలకు, 30 అసెంబ్లీ సీట్లకు ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నాయి. అందుకే దీనిని మిని సంగ్రామంగా భావిస్తున్నారు.
Also Read: Huzurabad by election: హుజూరాబాద్ పొలిటికల్ లీగ్.. ఎవరు గెలుస్తారనే విషయంలో బెట్టింగ్‌లు..
సార్వత్రిక ఎన్నికలకు రెడీ అయ్యేందుకు అవకాశంఈరోజు 30 అసెంబ్లీ స్థానాలకు, 3 లోక్ సభ స్థానాలకు హోరా హోరీగా ఎన్నికలు జరుగుతున్నాయి. ఇందులో అధికార, ప్రతిపక్ష పార్టీలు ఛాలెంజింగ్‌గా తీసుకొని పోటీ చేస్తున్నాయి. అయితే ఇందులో వచ్చే ఫలితాల ఆధారంగా రాజకీయ పార్టీలు 2024 ఎన్నికలకు సిద్ధం కావాల్సి ఉంటుంది. తీర్పు వ్యతిరేకంగా వస్తే, ప్రజల మద్దతును కూడగట్టుకునేందుకు ప్రయత్నించాలి. అనుకూలంగా వస్తే దానిని అలాగే కాపాడుకుంటూ, ప్రజల్లో వ్యతిరేకత పెరగకుండా చూసుకోవాలి. మొత్తానికి వచ్చే సార్వత్రిక ఎన్నికలకు సిద్ధం కావాడానికి ప్రతీ రాజకీయ పార్టీకి ఈ ఎన్నికలు ఒక అవకాశం కల్పించనున్నాయి.
Also Read: Chandrababu: ఇంకా పాతకాలం రాజకీయాలేంటి ‘బాబూ’.. అప్డేట్ కా?