Peddi: ప్రస్తుతం ‘ఇండిగో'(Indigo Airlines) ఎయిర్ లైన్స్ సంస్థ సంక్షోభం లో పడడం, వేల మంది ప్రయాణికులు ఇబ్బందులు పడడం వంటివి ప్రతీ రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. కార్యకలాపాల్లో లోపాలు ఉండడం వల్ల వెయ్యి కి పైగా ఫ్లైట్స్ నిన్న ఒక్క రోజే రద్దు అయ్యాయి. దీని వల్ల ప్రయాణికులపై మాత్రమే కాదు, సినీ ఇండస్ట్రీ పై కూడా తీవ్రమైన ప్రభావం పడింది. ఎన్నో సినిమాల షూటింగ్స్ వాయిదా రద్దు అయ్యాయి. వాటిల్లో ‘పెద్ది'(Peddi Movie) చిత్రం కూడా ఉంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటిస్తున్న ఈ సినిమాపై ప్రస్తుతం అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గా విడుదలైన చికిరి చికిరి పాట పెద్ద సెన్సేషన్ సృష్టించింది. అయితే ఈ సినిమా షూటింగ్ ని డిసెంబర్ 5 నుండి ఢిల్లీ లో ప్లాన్ చేశారు.
అక్కడ కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేశారు. కానీ ఫ్లైట్స్ రద్దు అవ్వడం తో షూటింగ్ రద్దు అయ్యింది. ఎట్టి పరిస్థితిలో ఈ సినిమా షూటింగ్ ని జనవరి చివరి లోపు పూర్తి చేసి, మార్చి 26 న విడుదల చెయ్యాలని అనుకున్నారు మేకర్స్. కానీ ఇప్పుడు ఈ అంతరాయం చూసిన తర్వాత ఈ చిత్రం వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో నిన్నటి నుండి ఒక వార్త తెగ ప్రచారం అవుతోంది. దీనిపై మూవీ టీం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు కానీ, ఈ సినిమా స్థానం లో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం. రెండు సినిమాలు ఒకే నిర్మాణ సంస్థ లో తెరకెక్కుతుండడం వల్ల, ఈ రెండు క్లాష్ పడే అవకాశాలే లేవు. అందుకే పెద్ది వాయిదా పడింది అని అంటున్నారు. ఇండిగో సంస్థ సంక్షోభం లో పడడం వల్ల పెద్ది లాంటి భారీ ప్రాజెక్ట్ వాయిదా పడింది.