https://oktelugu.com/

Rana Daggubati: సన్‌ నెక్స్ట్‌ లో స్ట్రీమింగ్ కానున్న ‘1945’

Rana Daggubati: నేషనల్ స్టార్ గా రానాకి మంచి గుర్తింపు ఉంది. అలాంటి దగ్గుబాటి రానా నటించిన ‘1945’ మూవీ ఈ నెల 7 నుంచి సన్‌ నెక్స్ట్‌ లో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవలే సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాలో రానా సరసన రెజీనా నటించింది. ఐతే, నేషనల్ స్టార్ గా రానాకి మంచి గుర్తింపు ఉంది. అయితే, గుర్తింపు తప్ప మార్కెట్ లేదు అని ఈ సినిమాతో తేలిపోయింది. ఈ సినిమాకు చాలా దారుణంగా కలెక్షన్స్ […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 5, 2022 / 01:08 PM IST
    Follow us on

    Rana Daggubati: నేషనల్ స్టార్ గా రానాకి మంచి గుర్తింపు ఉంది. అలాంటి దగ్గుబాటి రానా నటించిన ‘1945’ మూవీ ఈ నెల 7 నుంచి సన్‌ నెక్స్ట్‌ లో స్ట్రీమింగ్ కానుంది. ఇటీవలే సంక్రాంతికి విడుదలైన ఈ సినిమాలో రానా సరసన రెజీనా నటించింది. ఐతే, నేషనల్ స్టార్ గా రానాకి మంచి గుర్తింపు ఉంది. అయితే, గుర్తింపు తప్ప మార్కెట్ లేదు అని ఈ సినిమాతో తేలిపోయింది. ఈ సినిమాకు చాలా దారుణంగా కలెక్షన్స్ వచ్చాయి.

    1945 Movie

    ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కాలేదు. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. 1945లో బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇండియన్ నేషనల్ ఆర్మీ స్థాపిస్తాడు. ఆ సమయంలో తన కుటుంబ వ్యాపారాలను చూసుకునేందుకు ఈ సినిమాలో హీరో బర్మాకు వెళ్తాడు. అక్కడ బ్రిటిష్ పాలకులపై హీరో పోరాటం చేశాడు అనేది కథ. కథలో మ్యాటర్ ఉన్నా.. ఆ మ్యాటర్ ను పర్ఫెక్ట్ గా ఎలివేట్ చేయలేదు.

    Also Read:  బాక్సాఫీస్ – ఆకట్టుకోవడంలో ‘సామాన్యుడు’ ఫెయిలయ్యాడు

    అయితే ఈ సినిమా ఇలా వెళ్ళడానికి కారణం నిర్మాతలు మారడమే. ‘1945’ చిత్రానికి మొదట వేరే నిర్మాత. రానా ఈ సినిమా నుంచి వెళ్ళిపోయాక.. నిర్మాత చేతులు ఎత్తేశాడు. అప్పుడు సి.కళ్యాణ్ వెళ్లి అతి తక్కువ ధరకు సినిమాను కొనుక్కుని మొత్తానికి రిలీజ్ చేశాడు. ఈ క్రమంలో చాలా జరిగాయి. అందుకే.. ఈ సినిమా ఫెయిల్ అయింది.

    1945

     

    కాగా సత్య శివ దర్శకత్వంలో ’కె.ప్రొడక్షన్స్’ బ్యానర్ పై ఎస్.ఎన్.రాజ రాజన్, సి.కళ్యాణ్ నిర్మాణంలో రూపొందింది ఈ చిత్రం. ఇక ఈ సినిమాకు యువన్ శంకర్ రాజా సంగీతం అందించాడు.

    Also Read: ‘చంద్రకళ’గా అనసూయ.. ఇంట్రెస్ట్ చూపిస్తున్న నెటిజన్లు

    Tags