AP Holidays: 2024లో ఏపీలో ప్రభుత్వ సెలవులు ఇవే

జనవరి 15, 16వ తేదీలను సాధారణ సెలవుల జాబితాలో చేర్చింది. ఏప్రిల్ 9న ఉగాది సెలవుగా ప్రకటించింది. సంక్రాంతి సెలవులను జనవరి 9 నుంచి 18 వరకు.. పది రోజులు పాటు ప్రకటించింది.

Written By: Dharma, Updated On : December 1, 2023 3:21 pm

AP Holidays

Follow us on

AP Holidays: కొత్త సంవత్సరం సమీపిస్తోంది. డిసెంబర్ మొదటి వారంలో అడుగుపెట్టాం. రెండు వారాల్లో నెలగంటు వేయనున్నారు. అక్కడికి పక్షం రోజులు గడిస్తే కొత్త సంవత్సరంలో అడుగుపెట్టేస్తాం. 2024 కొంగొత్త ఆశలతో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సాధారణ సెలవులపై స్పష్టమైన ప్రకటన చేసింది. ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేసింది. పండుగలు, జాతీయ సెలవులను కలిపి ప్రభుత్వ కార్యాలయాలకు మొత్తం 20 సాధారణ సెలవులు, మరో 17 రోజుల ఐచ్చిక సెలవులుగా పేర్కొంది.

జనవరి 15, 16వ తేదీలను సాధారణ సెలవుల జాబితాలో చేర్చింది. ఏప్రిల్ 9న ఉగాది సెలవుగా ప్రకటించింది. సంక్రాంతి సెలవులను జనవరి 9 నుంచి 18 వరకు.. పది రోజులు పాటు ప్రకటించింది. భోగి, అంబేద్కర్ జయంతి ఆదివారం సెలవులో పోయాయి. ఇక దుర్గాష్టమి రెండో శనివారం పడడం విశేషం. అయితే ఎన్నడూ లేని విధంగా నెల రోజులు ముందుగానే సెలవులపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయడం విశేషం.

సాధారణ సెలవులకు సంబంధించి జనవరి 15న మకర సంక్రాంతి, 16న కనుమ, 26న గణతంత్ర దినోత్సవం, మార్చి 8న మహాశివరాత్రి, 25న హోలీ, 29న గుడ్ ఫ్రైడే, ఏప్రిల్ 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి, తొమ్మిది న ఉగాది, 11న రంజాన్, 17న శ్రీరామనవమి, జూన్ 17న బక్రీద్, జూలై 17న మొహర్రం, ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవం, 26న శ్రీ కృష్ణాష్టమి, సెప్టెంబర్ 7న వినాయక చవితి, 16న ఈద్ మిలాద్ ఉన్ నబీ, అక్టోబర్ నిన్న గాంధీ జయంతి, 11న దుర్గాష్టమి, 31న దీపావళి, డిసెంబర్ 25న క్రిస్మస్ సెలవు దినాలుగా ప్రభుత్వం ప్రకటించింది. వీటితోపాటు ఐచ్చిక సెలవులను, ఆదివారం వచ్చే పండగలను, రెండో శనివారం వచ్చే పండగల వివరాలను ప్రభుత్వం ప్రకటించడం విశేషం.