Lok Sabha Elections 2024 : యావత్ ప్రపంచం ఆసక్తిగా గమనించిన భారత సార్వత్రిక ఎన్నికల పర్వం ముగిసింది. ఏడు విడతల్లో హోరాహోరీగా సాగిన ఈ ఎన్నికల్లో ఓటర్లు విలక్షన తీర్పు ఇచ్చారు. బీజేపీకి ఎక్కువ సీట్లు కట్టబెట్టినా.. మిత్రపక్షాలతో ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి బలం పెరిగింది. ఇక మూడోసారి ఎన్డీఏ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. ఇక ఈ ఎన్నికల్లో కొందరు గత రికార్డును మెరుగుపర్చుకోగా కొందరు ఉత్కంఠ పోరులో తృటిలో పరాజయం తప్పించుకున్నారు. మహారాష్ట్రలో ఓ అభ్యర్థి కేవలం 48 ఓట్ల మెజారిటీతో గెలిచారు.
తక్కువ మెజారిటీతో గెలిచింది వీరే..
– మహారాష్ట్రలోని ముంబయ్ నార్త్ వెస్ట్ స్థానం నుంచి ఏక్‌నాథ్ షిండే సారథ్యంలోని శివసేన తరఫున పోటీ చేసిన రవీంద్ర దత్తారామ్ వైకర్ పోటీ చేశారు. ఉద్ధవ్ ఠాక్రే శివసేన నుంచి అన్మోల్ కీర్తికర్ నిలబడ్డారు. వీరి మధయ ఆద్యంతం గెలుపు ఊగిసలాడింది. చివరకు 48 ఓట్ల తేడాతో రవీంద్ర విజయం సాధించారు.
– కేరళలోని అత్తిగళ్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి అదూర్ ప్రకాశ్ తన సమీప ప్రత్యర్థిపై కేవలం 684 ఓట్లతో నెగ్గారు.
– ఒడిశాలోని జయపురంలో బీజేపీ అభ్యర్థి రబీంద్రనారాయణ్ బెహరా తన సమీప బిజు జనతాదళ్ అభ్యర్థి శర్మిష్టా సేథిపై 1,587 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
– రాజస్థాన్‌లోని జైపూర్ రూరల్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి అనిల్ చోప్రా, బీజేపీ అభ్యర్థి రాజేంద్రసింగ్ చేతిలో 1,615 ఓట్లతో ఓడిపోయారు.
ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి భోజ్‌రాజ్ నాగ్ తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి బీరేశ్ ఠాకూర్‌పై 1,884 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.