Pawan Kalyan Bus : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ గ్రాఫ్ రోజురోజుకి దూసుకుపోతోంది..అధికార వైసీపీ చేసే తప్పులను ఎండగడుతూ పవన్ కళ్యాణ్ చేస్తున్న పోరాటానికి జనం నుండి అనూహ్యమైన స్పందన వస్తోంది.. దీంతో జనసేన పార్టీ ఓటు బ్యాంకు ని పెంచుకునే దశగా పవన్ కళ్యాణ్ మరిన్ని వ్యూహాలు ప్రతి వ్యూహాలు చేస్తున్నాడు.. అందులో భాగంగా త్వరలో ఆయన బస్సు యాత్ర చెయ్యబోతున్నాడు.. ఈ బస్సు యాత్ర 2024వ సంవత్సరం సార్వత్రిక ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా సాగనుంది..ముందుగా 2019 వ సంవత్సరం లో జనసేన పార్టీకి మంచి ఓటు బ్యాంకు వచ్చిన స్థానాల్లో పర్యటించి అక్కడ సందర్భానుసారంగా పాదయాత్ర కూడా చేయనున్నాడు పవన్ కళ్యాణ్.

‘ఒక్క ఛాన్స్’ అనే నినాదం తో పవన్ కళ్యాణ్ ఈసారి పర్యటించబోతున్నాడు..అందుకోసం ముందుగా 30 స్థానాలను టార్గెట్ చేసుకొని అక్కడ ప్రత్యేకమైన దృష్టిని సారించబోతున్నాడు..ఆ తర్వాత వేవ్ మొదలయ్యాక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని స్థానాల్లో పట్టు సాధించే విధంగా పవన్ పర్యటన ఉండబోతున్నట్టు తెలుస్తోంది.
ఈ పర్యటన కోసం బస్సు కూడా సిద్ధం అయిపోయింది.. పవన్ కళ్యాణ్ పర్యటన కోసం ప్రత్యేకంగా ఈ బస్సుని తయారు చేయించారు.. అత్యాధునిక హంగులతో..హై సెక్యూరిటీ సిస్టంతో ఈ బస్సు ని నిర్మించినట్టు తెలుస్తోంది..ఇందులో 360 డిగ్రీస్ కవర్ చేసే కెమెరాలు కూడా ఉంటాయట.. వీటిని మోనిటర్ చెయ్యడానికి ఒక ప్రత్యేకమైన బృందం ఎప్పుడు బస్సులోనే ఉంటుందట..ఈ బస్సుకి సంబంధించిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారిపోయింది.
ఇది ఇలా ఉండగా.. రాష్ట్ర వ్యాప్తంగా అలజడి రేపిన ఇప్పటంలో ఇళ్ల కూల్చివేత ఘటనలో బాధితులకు ఆర్ధిక సహాయం చెయ్యడానికి పవన్ కళ్యాణ్ ఈనెల 27న ఇప్పటం గ్రామానికి స్వయంగా రాబోతున్నాడు..ఇళ్ల కూల్చివేతకు గురైన ప్రతి ఒక్క కుటుంబానికి లక్ష రూపాయిల చొప్పున ఆర్ధిక సహాయం చేసి మీకు నేను ఉన్నాను అని ధైర్యం చెప్పబోతున్నాడు. ఇందుకోసం ఆయన రేపు మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకోబోతున్నాడు.. ఈ కార్యక్రమం రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.
It’s getting ready for @PawanKalyan upcoming Bus Tour 🎙🔥 pic.twitter.com/mTLoqJsvlA
— Supreme PawanKalyan FC™ (@SupremePSPK) November 24, 2022