Manmohan Singh Passed Away: మనదేశంలో ఎంతో మంది వ్యక్తులు ప్రముఖులుగా ఉన్నారు. రాజకీయంగా, సినిమాలపరంగా, వ్యాపార పరంగా వీరు స్థిరపడ్డారు. అయితే వీరు పాకిస్తాన్ లో పుట్టారు.. మనదేశంలో ఎదిగారు. ఇంతకీ ఆ వ్యక్తులు ఎవరంటే..
ఎల్కే అద్వానీ
1941లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ వాలంటీర్ గా తన రాజకీయ జీవితాన్ని అద్వాని ప్రారంభించారు. అప్పటికి ఆయన వయసు 14 సంవత్సరాలు. ఎల్కే అద్వానీ 1927లో ప్రస్తుత పాకిస్తాన్లోని కరాచీనగరంలో ఆయన జన్మించారు. 2002 నుంచి 2004 వరకు భారతదేశానికి ఏడవ ఉప ప్రధానమంత్రిగా పనిచేశారు. 2017లో పద్మ విభూషణ్ పురస్కారాన్ని అందుకున్నారు.
సునీల్ దత్
హిందీ చిత్రశ్రమలో ప్రముఖమైన నటుల్లో సునీల్ దత్ ఒకరు.. ఈయన జూన్ 6, 1929లో పాకిస్థాన్లోని పంజాబ్ ప్రామిస్ ప్రాంతానికి ఉత్తరాన ఉన్న జీలం అనే ప్రాంతంలో జన్మించారు. 2005 మే 25న ముంబైలోని బాంద్రాలో తన నివాసంలో కన్నుమూశారు.
రామ్ జెఠ్మలానీ
మనదేశంలో పేరుపొందిన క్రిమినల్ లాయర్లలో రామ్ జెఠ్మలానీ ముందు వరసలో ఉంటారు. ఈయన 18 సంవత్సరాల వయసులోనే న్యాయవాది అయ్యారు.. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, హర్షిద్ మెహతా, కేతన్ పరేఖ్ హత్యలకు సంబంధించిన కేసులను వాదించారు. స్టాక్ మార్కెట్ కుంభకోణాలు, జెస్సికాలాల్ హత్య కేసు, 2 జి స్కాం వంటి కేసులను కూడా వాదించారు. ఇతడు 1923 సెప్టెంబర్ 14న ప్రస్తుత పాకిస్తాన్లోని సింధు ప్రావిన్స్ ప్రాంతంలోని శిఖర్పూర్ ప్రాంతంలో జన్మించారు. సెప్టెంబర్ 8, 2019లో 90 సంవత్సరాల వయసులో ఆయన చనిపోయారు.
గుల్జార్
సాహిత్యంలో గుల్జార్ కు ప్రత్యేక స్థానం ఉంటుంది. ఆయన భావాత్మక కవితలకు అశేషమైన పాఠకులు ఉన్నారు. బాధను, హృదయ వాంఛను, దుఃఖాన్ని వ్యక్తీకరించడంలో గుల్జార్ తర్వాతే మరి ఎవరైనా.. గుల్జార్ 1934 ఆగస్టు 18న పాకిస్తాన్లోని దీనా అనే ప్రాంతంలో జన్మించారు. ఈయన బాలీవుడ్లో అనేక పాటలు రాశారు. ఈయన పాటలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి.
శేఖర్ కపూర్
ప్రముఖ బాలీవుడ్ దర్శకుడిగా శేఖర్ కపూర్ పేరు పొందారు. నిర్మాతగానూ ఈయన రాణించారు. మాసూమ్, మిస్టర్ ఇండియా, బందిపోటు క్వీన్ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. జాన్ హజీర్ హై, టూటే ఖిలోన్ వంటి సినిమాల్లోనూ నటించారు. 1998లో ఎలిజబెత్ అనే చిత్రానికి దర్శకత్వం వహించడం ద్వారా.. అకాడమీ అవార్డు విజేత గా నిలిచారు. శేఖర్ కపూర్ పాకిస్థాన్లోని లాహోర్ ప్రాంతంలో జన్మించారు.
దిలీప్ కుమార్
భారతీయ చిత్ర పరిశ్రమకు దిలీప్ కుమార్ అందించిన సేవలు మర్చిపోలేనివి . దిలీప్ కుమార్ అసలు పేరు మహమ్మద్ యూసఫ్ ఖాన్. ఈయన 1922లో డిసెంబర్ 11న జన్మించారు. జుగ్ను, షాహిద్, అందాజ్, జోగన్, దాగ్, ఆన్, దేవదాస్, నయా దౌర్, మొగల్ ఏ అజం వంటి సినిమాలో నటించారు. 25 సంవత్సరాలకే బాలీవుడ్లో నెంబరవన్ యాక్టర్ అయ్యారు.
మిల్కా సింగ్
భారతదేశంలో పరుగుల వీరుడిగా పేరుపొందిన ఈ లెజెండరీ అథ్లెట్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈయన నంబర్ 20, 1929లో ప్రస్తుత పాకిస్తాన్లోని గోవిందపురా అనే ప్రాంతంలో జన్మించారు. ఆసియా క్రీడల్లో నాలుగు సార్లు గోల్డ్ మెడల్స్ సాధించారు. 1958లో కామన్వెల్త్ గేమ్స్ లో కూడా గోల్డ్ మెడల్ అందుకున్నారు. 1960లో రోమ్ ఒలంపిక్స్ లో నాలుగో స్థానంలో నిలిచారు.. 1956, 64 ఒలంపిక్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించారు. 1959లో పద్మశ్రీ పురస్కారాన్ని దక్కించుకున్నారు.
ఐకే గుజ్రాల్
ఐకే గుజ్రాల్ అసలు పేరు ఇంద్ర కుమార్ గుజరాత్.. ఈయన ఒక స్వాతంత్ర పోరాటయోధుడు. 1931లో ఇతడికి 11 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాడు. జీలం అనే పట్టణంలో చిన్న పిల్లలతో స్వాతంత్ర ఉద్యమాన్ని చేసినందుకు ఇతడిని పోలీసులు అరెస్టు చేశారు.. ఏప్రిల్ 1997 నుంచి మార్చి 1998 వరకు భారతదేశానికి 12వ ప్రధానమంత్రిగా పనిచేశారు. ఈయన 1919 డిసెంబర్ 4న పాకిస్థాన్లోని జీలం ప్రాంతంలో జన్మించారు.
మదన్ లాల్ ఖురానా
ఈయన 1993 నుంచి 96 వరకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పని చేశారు. 2004లో రాజస్థాన్ గవర్నర్ గా పనిచేశారు. రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, భారతీయ జనతా పార్టీ లో సభ్యుడిగా కొనసాగారు. ఈయన రాజకీయాల్లోకి ప్రవేశించక ముందు పిజిడిఏవి కాలేజీలో అధ్యాపకుడిగా పని చేశారు. ఈయన 1936 అక్టోబర్ 5న ప్రస్తుత పాకిస్థాన్లోని పైసలా బాద్ అనే ప్రాంతంలో జన్మించారు.
కుశ్వంత్ సింగ్
భారతీయ రచయితల్లో ఈయన ఒకరు. 1956లో ట్రైన్ టు పాకిస్తాన్ అనే నవల రాసి సంచలనం సృష్టించారు. చరిత్రకారుడిగా, నవల రచయితగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయ వ్యాఖ్యాతగా, సామాజిక విమర్శకుడిగా, సునిశితమైన పరిశీలకుడిగా ఈయన ఖ్యాతి గడించారు. 1915 ఫిబ్రవరి 2న పాకిస్థాన్లోని హదాలి అనే ప్రాంతంలో జన్మించారు.
భగత్ సింగ్
దేశ స్వాతంత్ర సంగ్రామంలో భగత్ సింగ్ కీలకపాత్ర పోషించారు. నాడు బ్రిటిష్ పరిపాలకులు భగత్ సింగ్ కు ఉరిశిక్ష విధించారు. చిన్న వయసులోనే ఉరి కొయ్యను ముద్దాడాడు. ఈయన చేసిన పోరాటం దేశ యువతకు స్ఫూర్తిగా నిలిచింది. 1907 లో సెప్టెంబర్ 28న పాకిస్తాన్లోని బంగా అనే ప్రాంతంలో జన్మించాడు.
రాజేంద్ర కుమార్
రాజేంద్ర కుమార్ భారతీయ చిత్ర పరిశ్రమలో ప్రముఖ నటుడు. 1960లో ఈయన నటించిన సినిమాలు మొత్తం సిల్వర్ జూబ్లీ జరుపుకున్నాయి. అందువల్లే ఈయన జూబ్లీ కుమార్ గా పేరు పొందాడు. 1950లో తన హిందీ చిత్రకేరియర్ మొదలు పెట్టాడు. 80 కి పైగా సినిమాలో నటించాడు. రాజేంద్ర కుమార్ 1929 జూలై 20న పాకిస్థాన్లో జన్మించాడు.
పృధ్వీరాజ్ కపూర్
పృధ్వీరాజ్ కపూర్ భారతీయ చిత్రపరశ్రమలో ప్రముఖ నటుడిగా పేరుపొందారు. తన పేరుతో బాలీవుడ్లో సినిమా థియేటర్లను నిర్మించారు. హిందూ చిత్ర పరిశ్రమకు అయిదు తరాల నటులను అందించారు. ఈయన కుటుంబ సభ్యులు చిత్ర పరిశ్రమలో ఉండడంవల్ల గిన్నిస్ రికార్డు సాధించారు. ఈయన 1906 నవంబర్ 3న పాకిస్థాన్లో జన్మించారు.
వినోద్ ఖన్నా
ఈయన బాలీవుడ్ లో పేరుపొందిన ప్రముఖ నటుడు. 141 కంటే ఎక్కువ చిత్రాలు నటించారు. అమర్ అక్బర్ ఆంథోనీ, దబాంగ్ ఫ్రాంచైజీ, కుర్బానీ, మేరా గావ్ మేరా దేశ్, ఇమితి హన్ అనే చిత్రాల్లో నటించాడు. 1946 అక్టోబర్ 6న పాకిస్థాన్లోని పేషావర్ ప్రాంతంలో జన్మించాడు.
ప్రేమ్ చోప్రా
బాలీవుడ్ లో విలక్షణ నటుడిగా ఇతడు పేరు పొందాడు. మన కెరియర్లో 380 కంటే ఎక్కువ చిత్రాల్లో నటించాడు. ఇతడు 1935 సెప్టెంబర్ 23న పాకిస్తాన్లోని లాహోర్ ప్రాంతంలో జన్మించాడు.
మన్మోహన్ సింగ్
మన్మోహన్ సింగ్ భారతదేశానికి ప్రధానమంత్రిగా సేవలందించారు. ఆర్థిక మంత్రిగా పనిచేశారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా, ఆర్థిక సంస్కరణల పితామహుడిగా దేశానికి ఎనలేని సేవలు అందించారు. ఈయన 1932 సెప్టెంబర్ 26న పాకిస్తాన్లోని పశ్చిమ పంజాబ్ లోని గాహ్ అనే ప్రాంతంలో జన్మించారు.