Year Ender 2024: ఈ మధ్య కాలంలో విడాకులు తీసుకుంటున్న జంటలు ఎక్కువయ్యాయి. సెలబ్రిటీల నుంచి సాధారణ మనుషులు కూడా విడాకులు బాట పడుతున్నారు. ప్రేమ లేదా పెద్దలు కుదిర్చిన వివాహమైన కూడా పెళ్లయిన రెండు నుంచి మూడేళ్లకే విడాకులు తీసుకుంటున్నారు. అయితే ఈ ఏడాదిలో చాలా మంది సెలబ్రిటీలు విడాకులు తీసుకున్నారు. పెళ్లయి ఏళ్లు గడుస్తున్న వారు కూడా ఒక అండర్‌స్టాండింగ్‌తో విడాకులు తీసుకుంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు కూడా చివరికి విడాకుల బాట పట్టారు. అయితే మరికొద్ది రోజుల్లో ఈ ఏడాది ముగుస్తోంది. మరి ఈ ఏడాది విడాకులు తీసుకున్న ఆ జంటలు ఏవో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.
ఏఆర్ రెహమాన్, సైరా భాను
మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ గురించి ప్రత్యేకంగా చెప్పకర్లేదు. ఆస్కార్ విన్ అయి ప్రపంచ వ్యాప్తంగా తన కంటూ గుర్తింపు సంపాదించుకున్నారు. తన మ్యూజిక్‌తో అందరిని కట్టిపడేస్తారు. అయితే ఈ ఏడాది రెహమాన్, సైరా భాను విడిపోయారు. 1995లో పెళ్లి చేసుకున్నారు. దాదాపు 29 ఏళ్ల వివాహ బంధానికి ఈ ఏడాదితో ముగింపు పలికారు. రెహమాన్ దంపతులు విడాకులు తీసుకోవడంతో ఫ్యాన్స్ చాలా బాధపడ్డారు. ఇన్నేళ్లు కలిసి ఉండి ఇప్పుడు విడాకులు తీసుకోవడానికి కారణాలు ఏంటని చర్చించసాగారు.
ధనుష్, ఐశ్వర్య
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ తమ 18 ఏళ్ల వివాహ బంధానికి ఈ ఏడాది ముగింపు పలికారు. ఇద్దరూ విడిపోతున్నట్లు 2022లో ప్రకటించిన ఈ ఏడాది చట్టబద్ధంగా విడిపోయారు. ప్రేమించి 2004లో ధనుష్, ఐశ్వర్య వివాహం చేసుకున్నారు. కానీ ఇద్దరూ ఒక ఓపినియన్‌కి వచ్చి విడిపోయారు.
జయం రవి, ఆర్తి
కోలీవుడ్ హీరో జయం రవి తన భార్య ఆర్తి ఈ ఏడాది విడాకులు తీసుకున్నారు. దాదాపుగా 15 ఏళ్ల వారి వివాహ బంధానికి ఈ ఏడాది ముగింపు పలికారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
జీవి ప్రకాష్ కుమార్, సైంధవి
ప్రముఖ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ కుమార్, సింగర్ సైంధవి ఈ ఏడాది విడాకులు తీసుకున్నారు. జీవీ, సైంధవి చిన్నప్పటి నుంచే మంచి స్నేహితులుగా ఉండేవారు. వారి స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారి.. వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. వీరికి ఓ పాప కూడా ఉంది. అయితే ఇద్దరు విడిపోతున్నట్లు ఈ ఏడాది ప్రకటించారు. విడాకుల తర్వాత ఇటీవల ఓ స్టేజ్‌పై ఇద్దరూ పాట పాడినట్లు సమాచారం.
ఇషా డియోల్, భరత్ తక్తాని
దిగ్గజ నటుడు ధర్మేంద్ర, హేమ మాలిని కుమార్తెల గారాల పట్టి ఇషా డియోల్. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఉంటున్న ఇషా డియోల్, భరత్ తక్తాని విడాకులు తీసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. 2012లో వివాహం చేసుకున్న వీరిపై ఎప్పటి నుంచో రూమర్స్ ఉన్నాయి. విడాకులు తీసుకుంటారని గత ఎప్పటి నుంచో రూమర్స్ వచ్చాయి. చివరకు విడిపోతున్నట్లు ప్రకటించడంతో.. రూమర్స్ కాదని అవి నిజమే అని తేలాయి.